జీపీ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి
ధర్పల్లి: జీవో 51ని రద్దుచేసి, పంచాయతీ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) జిల్లా కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్ యూనియన్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్మికులు ఆశన్న , సాయిలు గంగన్న గంగారం సులోచన సాయబా సునీత రాజవ్వ పాల్గొన్నారు.
శిక్షణ తరగతులు ప్రారంభం
నిజామాబాద్ సిటీ: జిల్లా కేంద్రంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో ఆదివారం రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈసందర్బంగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్, రమేష్‌బాబులు మాట్లడుతూ... పని పద్ధతులు, నిర్మాణం, కార్యక్రమం అనే అంశాలపై చర్చించారు. వర్గ పోరాటాల ద్వారానే ప్రజలకు విముక్తి లభిస్తుందన్నారు. వర్గ పోరాటాల నిర్మాణంలో, విప్లవ సాధన కోసం కృషిచేయాలన్నారు. నాయకులు రమేష్‌బాబు, నూర్జహాన్, వెంకటేష్, శంకర్ గౌడ్, నన్నే షాప్, సుజాత, మోహన్ రావు, విగ్నేష్‌లు పాల్గొన్నారు.
గూడెంలో హైమాస్ట్ లైట్ల ప్రారంభం
మోపాల్: నగర శివా రులోని గూడెం (శ్రా మికనగర్)లో ఎంపీ అర్వింద్ ధర్మపురి నిధులతో ఆదివారం హైమాస్ట్ లైట్లను ఏ ర్పాటు చేయగా ఆది వారం స్థానిక నాయ కులు, కార్యకర్తలు ప్రారంభించారు. అడిగిన వెంటనే శ్రామికనగర్‌కు హైమాస్ట్ లైట్లను మంజూరు చేసినందుకు ఎంపీకి కాలనీవాసులు ధన్యవాదాలు తెలియజేశారు. నాయకులు యాదాల నరేష్, రచ్చ ఆనంద్, కాలనీవాసులు పాల్గొన్నారు.
ఆన్‌లైన్ నమోదులో తప్పులు రావొద్దు
బాల్కొండ: సమగ్ర కుటుంబ సర్వే వివరాల ఆన్‌లైన్ నమోదులో తప్పులు లేకుండా చేపట్టాలని ఆర్మూర్ ఆర్డీవో రాజుగౌడ్ అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో చేపట్టిన డాటా ఆన్‌లైన్ ఎంట్రీని ఆదివారం ఆయన పరిశీలించారు. ఈసందర్బంగా డాటా ఎంట్రీ ఆపరేటర్లకు పలు సూచనలు చేశారు. ఎలాంటి తప్పులు దొర్లిన ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment