రూరల్ మండల కేంద్రం ఏదీ?
నిజామాబాద్ రూరల్: రూరల్ మండలానికి మండల కేంద్రం లేక మండలంలోని 19 గ్రామాల ప్రజ లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మండల కా ర్యాలయాలు అన్నీ జిల్లాకేంద్రంలోనే ఉండటంతో ఆయా మండలాల ప్రజలు సుమారు 10నుంచి 15 కి.మీ ప్రయాణించి జిల్లాకేంద్రానికి రావాల్సిన ప రిస్థితి నెలకొంది. నగరానికి వచ్చినా మండల కా ర్యాలయాలు ఒకచోట లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తహసీల్ కార్యాలయం ముబారక్ నగర్‌లో, ఎంపీడీవో కార్యాలయం సుభా ష్‌నగర్‌లో, పోలీస్‌స్టేషన్ బైపాస్‌రోడ్డులో ఉన్నాయి. ఐకేపీ కార్యాలయం పాంగ్రాలో ఉంది. దీంతో ఆ యా గ్రామాల ప్రజలు నగరానికి వచ్చి సంబందిత కార్యాలయాల కోసం నగరమంతా తిరగాల్సి వస్తోంది.
ఇదీ పరిస్థితి..
గతంలో నిజామాబాద్ మండలంలోని మోపాల్, నిజామాబాద్ రూరల్, నార్త్, మండలాలు అన్ని కలిసి జిల్లా కేంద్రంలో ఉండేవి. 2016–17 సంవత్సరంలో మోపాల్, నిజామాబాద్ రూరల్, నార్త్ మండలాలు ఏర్పడ్డాయి. కానీ మోపాల్, నార్త్ మండలాలకు మండల కేంద్రాలు ఉన్నప్పటికీ నిజామాబాద్ రూరల్ మండలానికి మండల కేంద్రం లేకపోవడంతో మండల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రూరల్ మండలంలో 19 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మండలానికి మండల కేంద్రం ఏర్పడితే ప్రజలకు పాలన చేరువైతుందని, జిల్లా కేంద్రానికి రావడం తప్పుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా భూముల విలువలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే మండల కేంద్రంతో ఎన్నో లాభాలు, ప్రజలకు కావసిన సౌకర్యలు అందుబాటులోకి వస్తాయని, వారాంతపు సంత, పశువులసంత, మండల కేంద్రంలో నిత్య వ్యాపార లావాదేవీలు పెరుగుతాయని పలువురు పేర్కొంటున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా రూరల్ మండలంలోని గుండారం గ్రామాన్ని మండల కేంద్రం చేస్తే అన్ని విధాలుగా ప్రజలకు అనుకూలంగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు మండల కేంద్రంగా గుండారంను ప్రకటిస్తామని హావీచిచ్చారు. ఈక్రమంలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి గతంలో ఇచ్చిన హామీ మేరకు గుండారం గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.
మండలకేంద్రం ప్రకటించాలి
రూరల్ మండల కేంద్రంగా గుండారం గ్రామాన్ని ప్రకటిస్తే గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. మండల కార్యాలయాల కోసం జిల్లాకేంద్రానికి వచ్చి, తిరిగే బాధలు తప్పుతాయి. మండలకేంద్రంలోనే పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. –దాసరి శ్రీధర్,
పీఏసీఎస్ చైర్మన్, గుండారం
దూరభారం తగ్గుతుంది..
గత ఎన్నికల్లో గుండారం గ్రామాన్ని మండల కేంద్రంగా చేస్తామని రాజకీయనాయకులు ప్రకటించారు. కానీ హామీని నెరవేర్చడం లేదు. ప్రజాప్రతినిధులు స్పందించి ఉత్తర్వులు త్వరగా విడుదలయ్యే విధంగా చర్యలు చేపట్టాలి. గుండారం మండలకేంద్రం అయితే ప్రజలకు దూరభారం తగ్గు తుంది. –ఒంటెల శంకర్‌రెడ్డి, బీజేపీ నేత, గుండారం
జిల్లా కేంద్రంలోనే
మండల కార్యాలయాలు
ఒకేచోట లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
Comments
Please login to add a commentAdd a comment