అర్ధరాత్రి నుంచే ఖాతాల్లోకి నిధులు
మోర్తాడ్(బాల్కొండ): రైతుభరోసా, ఇందిర మ్మ ఆత్మీయ భరోసా పథకం కింద నిధులు ఆదివారం అర్ధరాత్రి నుంచి లబ్ధిదారుల ఖాతా ల్లో జమవుతాయని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని మోర్తాడ్ మండలంలోని దోన్ పాల్లో నాలుగు సంక్షేమ పథకాలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మధ్యాహ్నం లాంఛనంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణా నికి ఆర్థిక సాయం, ఇందిరమ్మ ఆత్మీయ భరో సా, రైతు భరోసా, రేషన్ కార్డుల కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు. జాబితాలో పేర్లు రాకపోతే ఆందోళన చెందొద్దని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని వెల్లడించారు. ఆర్మూర్ ఆర్డీవో రాజా గౌడ్, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీవో తిరుమల, ఎంపీవో శ్రీధర్, ఏపీవో ప్రమీల, మాజీ సర్పంచ్ పర్స దేవన్న, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముత్యాల రాములు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
Comments
Please login to add a commentAdd a comment