మోర్తాడ్: గణతంత్ర దినోత్సవం రోజున మద్యం అమ్మకాలపై నిషేధం ఉన్నా కొందరు తమ వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగించారు. ఆదివారం గణతంత్ర దినోత్సవం రావడంతో కొందరు ముందస్తుగా మద్యం కొని పెట్టుకోగా, మరికొందరు దళారుల నుంచి కొనుగోళ్లు జరిపారు. మోర్తాడ్, కమ్మర్పల్లి, ఏర్గట్ల, వేల్పూర్, మెండోరా, ముప్కాల్, భీమ్‌గల్, బాల్కొండ మండలాల్లోని వివిధ గ్రామాల్లో మద్యం అమ్మకాలకు అడ్డు అదుపులేకుండా పోయిందనే ఆరోపణలు ఉన్నాయి. బెల్టుషాపుల నిర్వాహకులు రెగ్యులర్‌గా మద్యం విక్రయించే చోట కాకుండా రహస్య ప్రాంతంలో మద్యం నిల్వ ఉంచి వ్యాపారం సాగించారు. అయితే మోర్తాడ్‌లో మద్యం అమ్మకాలపై పోలీసులకు సమాచారం అందించినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా అలాంటిది ఏమి లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment