తాళం వేసిన ఇంట్లో చోరీ
కామారెడ్డి క్రైం: దైవ దర్శనానికని వెళ్లిన ఓ కుటుంబం తిరిగి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడిన ఘటన జిల్లా కేంద్రంలోని జయశంకర్ కాలనీలో గురువారం వెలుగుచూసింది. కాలనీకి చెందిన రాజశేఖర్ రెడ్డి కుటుంబం బుధవారం మాఘ అమావాస్య కావడంతో పుణ్యస్నానం చేయడానికని ఇంటికి తాళం వేసి కూడెళ్లి వాగుకు వెళ్లారు. గురువారం ఇంటికి వచ్చేసరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. దొంగలు చొరబడి సామాన్లన్నీ చిందరవందర చేసినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. ఇంట్లో దాచి ఉంచిన రూ.30 వేలు నగదు, 3 తులాల బంగారం, 10 తులాల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment