లారీ ఢీకొని బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ మృతి
డిచ్పల్లి: లారీ ఢీకొనడంతో బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం రాత్రి మాధవనగర్ బైపాస్ రోడ్డులో చోటు చేసుకుంది. నిజామాబాద్ రూరల్ ఎస్సై ఎండీ ఆరీఫ్, బెటాలియన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామానికి చెందిన అజ్మీరా కల్యాణ్‌కుమార్ (29) డిచ్పల్లిలోని బెటాలియన్‌లో 2018 నుంచి హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం నిజామాబాద్‌లో ఉంటూ రోజూ విధి నిర్వహణ కోసం బెటాలియన్‌కు రాకపోకలు సాగిస్తున్నారు. ఎప్పటి లాగే బుధవారం రాత్రి తన బైక్‌పై నిజామాబాద్ నుంచి డిచ్పల్లిలోని బెటాలియన్‌కు బయలుదేరాడు. మాధవనగర్ బైపాస్ రోడ్డులో వెళ్తుండగా వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ బైక్‌ను ఢీకొట్టడంతో కల్యాణ్‌కుమార్ తలకు తీవ్రంగా గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సుష్మ, మూడు సంవత్సరాల పాప, రెండు నెలల బాబు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆరీఫ్ తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
మృతుడి కుటుంబానికి అండగా ఉంటాం
హెడ్ కానిస్టేబుల్ కల్యాణ్‌కుమార్ కుటుంబానికి అండగా ఉండి అన్ని విధాల ఆదుకుంటామని బెటాలియన్ కమాండెంట్ సత్యనారాయణ తెలిపారు. గురువారం పోస్టుమార్టం అనంతరం కల్యాణ్‌కుమార్ మృతదేహాన్ని అంబులెన్స్‌లో బెటాలియన్ కు తీసుకువచ్చారు. ఆయన పార్థీవ దేహానికి బెటాలియన్ అధికారులు, సిబ్బంది నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment