నందిపేట్: దశాబ్దాల క్రితం నందిపేటలో కొనసాగుతున్న వ్యభిచార గృహాలపై గ్రామస్తులంతా మూకుమ్మడిగా దాడులు జరిపి పారదోలారు. 33 ఏళ్ల తర్వాత మళ్లీ వ్యభిచార కూపాలు వెలుగు చూస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం
నందిపేటలో కొనసాగుతున్న వ్యభిచార కూపాలపై 1992లో గ్రామస్తులంతా దాడులు చేసి నిర్వాహకులను పారదోలారు. ఈ ఘటన అప్పుడు రాష్ట్రవాప్తంగా సంచలనం సృష్టించింది. 1992లో 13 ఏళ్ల బాలికను చిత్రహింసలు పెడుతూ వ్యభిచార రొంపిలోకి దింపడానికి ప్రయత్నించగా ఆమె తప్పించుకుని ప్రజలను రక్షించాలని వేడుకుంది. ఈ విషయం చిలికి చిలికి గాలివానలా గ్రామమంతా వ్యాపించింది. ఈ వార్తను పత్రికలు ప్రచురించాయి. దీంతో గ్రామపెద్దలు, యువకులు అందరూ కలిసి ఉరేగింపుగా వెళ్లి వ్యభిచార గృహాలపై దాడులు చేశారు. వారి ఇళ్లను తగులబెట్టి, నిర్వాహకులను తరిమి కొట్టారు. ఈ కూపంలో ఇరుక్కున్న అమ్మాయిలకు విముక్తి కల్పించారు. ఈ దాడుల్లో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. అండర్ గ్రౌండ్ గదుల్లో అమ్మాయిలను బంధించి వ్యభిచార కూపంలోకి దించేందుకు చిత్రహింసలు పెట్టేవారని, వినకపోతే చంపడానికి కూడా వెనుకాడబోయే వారు కాదనే వార్తలు వెలుగు చూశాయి.
నందిపేట కేంద్రంగా నిర్వహిస్తున్న వైనం
33 ఏళ్ల కిందట తరిమికొట్టిన
గ్రామస్తులు
దాడులు చేసిన పోలీసులు
గ్రామస్తుల కృషితో అంతమైన వ్యభిచార వృత్తి మళ్లీ మొదలైంది. వ్యభిచార గృహాల నిర్వాహకులు కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి కూలీ పను లు చేసుకుని బతుకుతామని నందిపేట సమీపంలోని లక్కంపల్లి ప్రాంతంలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఈ నివాసాలు మళ్లీ వ్యభిచార కేంద్రాలుగా మారాయి. అమ్మాయిలను ఎక్కడి నుంచో తీసుకువచ్చి బలవంతంగా ఈ రొంపిలోకి దింపుతున్నారు. ఐదు రోజుల క్రితం పోలీసులు దాడులు చేసి వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలతో పాటు నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment