కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్‌రెడ్డి..!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఆదిలాబాద్–నిజామాబాద్–కరీంగనర్–మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా కరీంనగర్‌కు చెందిన అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డిని ఖరారు చేసినట్లు సమాచారం. ఈ నియోజకవర్గ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ రానుంది. అదే రోజు నుంచి నామినేషన్ల దాఖలు మొదలు కానుంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీతో పోలిస్తే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల సంఖ్య ఎక్కువ కావడంతో ఈ ఎన్నిక మీద ఆసక్తి ఎక్కువగా ఉంటోంది. ఇందుకు సంబంధించి రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే పోటీ ఉండనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే ఇప్పటికే బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సంగారెడ్డి జిల్లాకు చెందిన సీ అంజిరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్క కొమరయ్యను ప్రకటించింది. కాగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి అభ్యర్థిని పెట్టే విషయంలో ఆలోచన చేయడం లేదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిపై ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. రెండునెలల క్రితమే నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ప్రచారం ప్రారంభించిన అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి కాంగ్రెస్ మద్దతు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఈ నెల 29న పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మరో ఇద్దరు మంత్రులు కలిసి ఈ విషయమై సుదీర్ఘ చర్చ జరిపారు. నరేందర్‌రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రెండుమూడు రోజుల్లో నరేందర్‌రెడ్డి పేరును ప్రకటించేందుకు కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ నుంచి అభ్యర్థిని బరిలోకి దించే విషయంలో ఇప్పటివరకు స్పష్టత లేదు. బీఆర్ఎస్ తన అభ్యర్థిని బరిలోకి దించేది అనుమానమే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో స్వతంత్రంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న సంగారెడ్డి జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ మాచర్ల గిరిధర్‌గౌడ్ బీఆర్ఎస్ నుంచి పరోక్ష మద్దతు కోరుతున్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీకి దాదాపు
ఖరారు చేసిన పార్టీ నాయకత్వం
రెండుమూడు రోజుల్లో
వెలువడనున్న ప్రకటన
ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ
స్పష్టత లేని బీఆర్ఎస్ అభ్యర్థిత్వం
బీఆర్ఎస్ మద్దతు కోరిన గిరిధర్‌గౌడ్
Comments
Please login to add a commentAdd a comment