ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం
నిజామాబాద్‌అర్బన్: ఎన్నికల హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా గాంధీచౌక్‌లోని గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ మోసాలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బిగాల మాట్లాడుతూ.. డిక్లరేషన్, గ్యారెంటీల పేరుతో 420 బూటకపు హామీలను కాంగ్రెస్ ఇచ్చిందని విమర్శించారు. వంద రోజుల్లో హామీలను అమలుచేస్తామని ప్రకటించారని, 420 రోజులు అవుతున్నా అమలు చేయడం లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్‌కార్డు ఇవ్వలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నరని, మేనిఫెస్టోలో పెట్టకపోయినా తమ ప్రభుత్వ హయాంలో ఒక్కో వ్యక్తికి ఇచ్చే రేషన్ బియ్యాన్ని నాలుగు నుంచి ఆరు కేజీలకు పెంచామన్నారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో 6,47,479 నూతన రేషన్‌కార్డులు ఇచ్చామని, 2 లక్షల ఉద్యోగాలు కల్పించామని వివరించారు. నిరసన కార్యక్రమంలో నగర మాజీ మేయర్ దండు నీతూకిరణ్, నుడా మాజీ చైర్మన్ చామకూర ప్రభాకర్‌రెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు సిర్ప రాజు, సత్యప్రకాశ్, దండు శేఖర్, నవీద్ ఇక్బాల్, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment