స్వాతంత్య్ర వీరులకు ఘన నివాళి
నిజామాబాద్‌అర్బన్: దేశ స్వాతంత్య్రం కో సం ప్రాణాలర్పించిన వీరులకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేతృత్వంలో గురువారం సంస్మరణ దినాన్ని నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొని స్వాతంత్య్రోద్యమ అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అమరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తామనే సంకల్పాన్ని చాటుతూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో అదన పు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, ఆయా శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
2 నుంచి రైల్వే గేట్
మూసివేత
మాక్లూర్: మాక్లూర్ మండలం అడవిమామిడిపల్లి వద్ద ఉన్న రైల్వే గేట్‌ను ఫిబ్రవరి 2 నుంచి 8 వరకు మూసివేయనున్నట్లు రైల్వే అధికారులు గురువారం తెలిపారు. రైల్వే క్రాసింగ్ గేటు వద్ద మేజర్ మరమ్మతులు చేపట్టనున్నామని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించాలని సూచించారు.
జీజీహెచ్‌కు మంచి
గుర్తింపు తేవాలి
నిజామాబాద్‌నాగారం: అధికారులు, సిబ్బంది, కార్మికులు కలిసి పనిచేస్తూ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి(జీజీహెచ్)కి మంచి గుర్తింపు తీసుకురావాలని సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. జీజీహెచ్ కాన్ఫరెన్స్ హాలులో గురువారం తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) జనరల్ బాడీ సమావేశాన్ని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅథితులుగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసుఫ్, జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, జీఎంసీ వైస్ ప్రిన్సిపాల్ జలగం తిరుపతిరావు హాజరయ్యారు. రోజురోజుకూ పెరుగుతున్న ఓపీ, ఐపీని దృష్టిలో పెట్టుకొని జీజీహెచ్‌ను ప్రభుత్వం వెయ్యి పడకలకు పెంచాలని నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలన్నారు. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన మినిమం వేజ్ బోర్డులో నూతనంగా ఎన్నికై న యూసఫ్‌ను కార్మికులు సన్మానించారు. సమావేశంలో యూనియన్ నాయకులు హైమది, భాగ్యలక్ష్మి, స్వరూప, కవిత, వెంకట్, వెంకటేశ్, రాధాకుమార్, రాజు, కార్మికులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment