మోర్తాడ్(బాల్కొండ): మోర్తాడ్ మండలంలోని వడ్యాట్‌లో ఓ విద్యార్థికి ఇందిరమ్మ ఆత్మీయ భరో సా పథకం మంజూరైనట్లు గ్రామసభ ద్వారా వెల్లడైంది. అలాగే ఆర్థికంగా స్థిరపడిన కుటుంబంలోని యువకుడికీ ఆత్మీయ భరోసా మంజూరైనట్లు జాబి తాలో అధికారులు వెల్లడించడంతో తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమిలేని వ్యవసాయ కూలీలకు సాయం అందించాల్సి ఉండగా ఆర్థికంగా ఉన్నవారి పేర్లు జాబితాల్లో కనిపించడం గందరగోళానికి దారి తీసింది. ఇది ఒక్క వడ్యాట్‌లోనే చోటు చేసుకున్న ఘటన కాదు. జిల్లాలో అనేక చోట్ల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల జాబితాలో అనర్హుల పేర్లు నమోదు కావడంతో పథకం పక్కదారి పడుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఆర్థికంగా చే యూతను అందించేందుకు నిర్దేశించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అనర్హులకు అందిస్తే ప్రభు త్వ ఉద్దేశం నీరుగారుతుందనే వాదన వినిపిస్తోంది. జిల్లాలో 42 వేల మందిని ఆత్మీయ భరోసా పథకం కింద ఎంపిక చేయగా నాలుగు రోజులపాటు ని ర్వహించిన గ్రామ సభల్లో 3 వేల మంది అనర్హులు ఉన్నట్లు తేలింది. జిల్లాలో 530 (కొత్తవి కాకుండా) గ్రామ పంచాయతీల పరిధిలో 2023లో చేపట్టిన ఉపాధి పనుల్లో కనీసం 20 రోజులపాటు హాజరైన కుటుంబాలను పరిగణనలోకి తీసుకుని ఆత్మీయ భరోసా లబ్ధిదారుల జాబితాను రూపొందించారు. అప్పట్లో 85 వేల కుటుంబాలు ఉపాధి పనుల్లో పాల్గొన్నాయి. ఉపాధి కూలీల కుటుంబాల జాబ్‌కార్డులను ధరణి వెబ్‌పోర్టల్‌తో అనుసంధానం చేసి 42వేల మందికి భూమి లేదని గుర్తించారు. ధరణి వెబ్‌పోర్టల్, జాబ్‌కార్డుల అనుసంధానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో భూమి ఉన్నవారికి కూడా ఆత్మీయ భరోసా మంజూరైనట్లు జాబితాల్లో బహిర్గతమైంది.
గ్రామసభల్లో వెల్లడైన పేర్లు
జిల్లాలో ఇప్పటికే 3వేల మంది
పేర్లు బహిర్గతం
అర్హులకే అందిస్తాం
ఎంపీడీవోల ద్వారా మరోసారి అనర్హులను ఏరివేసే ప్రక్రియ నిర్వహిస్తాం. గ్రామ సభల్లో జాబితాలను బహిర్గతం చేయడం ద్వారా అర్హులు, అనర్హులను గుర్తిస్తున్నాం. ఆత్మీయ భరోసా పథకాన్ని వంద శాతం అర్హులకే వర్తింపజేస్తాం.
– సాయాగౌడ్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి
Comments
Please login to add a commentAdd a comment