పోలీస్ ట్రైనింగ్ సెంటర్లోకి చిరుత
ఎడపల్లి(బోధన్): ఎడపల్లి మండలం జానకంపేట శివారులో ఉన్న పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఆవరణలోకి బుధవారం రాత్రి చిరుత వచ్చి కుక్క పిల్లను ఎత్తుకెళ్లింది. చిరుతను చూసిన హోంగార్డు అక్కడి సిబ్బందిని అప్రమత్తం చేసేలోగా అది అటవీప్రాంతంలోకి పారిపోయింది. ట్రైనింగ్ సెంటర్ సీఐ శివరాం జిల్లా అటవీ శాఖ అధికారులకు సమాచా రం అందించగా ఫారెస్ట్ రేంజ్ అధికారి సంజయ్గౌడ్తోపాటు పది మంది అటవీ శాఖ సిబ్బంది గురువారం పోలీస్ ట్రైనింగ్ సెంటర్ పరిసరాలను పరిశీలించి పాదముద్రల ఆనవాళ్లను సేకరించారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్వో మాట్లాడుతూ.. చిరుత సంచారం నిజమేనని అన్నారు. రాత్రి వేళలో చిరుత సంచరిస్తుంటుందని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఠాణాకలాన్ – జానకంపేట్, ఠాణాకలాన్ – బాపూనగర్, జానకంపేట్ – దూపల్లిగేట్ రోడ్లపై రాకపోకలు సాగించే ద్విచక్ర వాహన దారులు ఒంటరిగా ప్రయాణించొద్దన్నారు. చిరుత కనిపిస్తే దగ్గరికి వెళ్లకుండా ఆగిపోవాలని, గట్టిగా శబ్దం చేస్తే చిరుత వెళ్లిపోతుందని సూచించారు.
కుక్క పిల్లను ఎత్తుకెళ్లిన వైనం
అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఫారెస్ట్ అధికారుల సూచన
Comments
Please login to add a commentAdd a comment