వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరా
డిచ్‌పల్లి: వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ ఆర్ రవీందర్ తెలిపారు. డిచ్‌పల్లి మండలంలోని మిట్టాపల్లి 33/11 సబ్ స్టేషన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫీడర్ బ్రేకర్స్‌ను ఎస్‌ఈ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో మూడు గ్రామాలకు కలిపి ఒకే ఫీడర్ ఉండటంతో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అన్నింటికీ విద్యుత్ సరఫరా నిలిపి వేయాల్సి వచ్చేదన్నారు. ప్రస్తుతం సుమారు రూ.15 లక్షలతో ఫీడర్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో సమస్య వచ్చిన ఫీడర్‌కు మాత్రమే సరఫరా నిలిపి వేసి మిగిలిన ఫీడర్‌లకు యథావిధిగా విద్యుత్ సరఫరా కొనసాగించవచ్చన్నారు. కార్యక్రమంలో డీఈ ఉత్తమ్ జాడే, డీఈ (టెక్నికల్) జే రమేశ్, ఏఈడీ జీ శ్రీనివాస్, ఏఈ గంగారాం, ఎస్‌ఎల్‌ఐ అబ్బయ్య, లైన్‌మన్ మహేశ్‌కుమార్, ఏఎల్‌ఎం అనిల్‌కుమార్, ఆపరేటర్ వినయ్, వీడీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వీడీసీ ఆధ్వర్యంలో ఎస్‌ఈ, డీఈలను ఘనంగా సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment