రాష్ట్రంలో భయంకర రోజులు
ధర్పల్లి: కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో భయంకర రోజులు వచ్చాయని, అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ధర్పల్లి మండలంలోని రామడులో గురువారం ఆమె మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలన కారణంగా తెలంగాణ వందేళ్లు వెనక్కి వెళ్లే దుస్థితి వచ్చిందన్నారు.
అబద్ధపు హామీలతో సీఎం రేవంత్‌రెడ్డి కాలం వెళ్లదీస్తున్నారని, ఆర్థిక పరిస్థితి తెలిసీతెలియక హామీలు ఇచ్చామని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మాట్లాడారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ తెలంగాణ పరిస్థితులపై ఎందుకు మాట్లాడడం లేదని ఆమె ప్రశ్నించారు. సచివాలయంలోని ఏసీ గదుల్లో కూర్చొని లబ్ధిదారుల జాబితా తయారు చేయడంతో ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారన్నారు. యూరియా కోసం రైతులు మళ్లీ లైన్లు కట్టే పరిస్థితి వచ్చిందని, కరెంటు ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి నెలకొన్నదన్నారు. అర్హులందరికీ కేసీఆర్ పారదర్శకంగా పథకాలను అందించారని, బీఆర్‌ఎస్ హయాంలో మంజూరు చేసిన పనులను తాము చేశామని కాంగ్రెస్ చెప్పుకోవడం తప్ప ఏమీ లేదన్నారు. కాళేశ్వరం ప్యాకేజీ – 21 పనులను పూర్తి చేయలేని చేతగాని ప్రభుత్వంగా కాంగ్రెస్ నిలిచిందని విమర్శించారు. పసుపు పంటకు కనీస మద్దతు ధర ప్రకటించేలా ఎంపీ ధర్మపురి అర్వింద్ కృషి చేయాలని సూచించారు.
కుంభమేళాలో తెలంగాణ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలి
ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో తెలంగాణ ప్రభు త్వం హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి చెందడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తోంది
ఏసీ గదుల్లో కూర్చుని లబ్ధిదారుల
జాబితాను రూపొందించారు
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శ
Comments
Please login to add a commentAdd a comment