వేర్వేరు కారణాలతో పలువురి మృతి
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్ గ్రామంలో మిర్యాల పోసాని (50) అలియాజ్ స్వప్న అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. వర్ని మండలం ఉమ్మనాపూర్ గ్రామానికి చెందిన రాజారాం, మిర్యాల పోసాని కుటుంబ 25 ఏళ్ల క్రితం ఉపాధి కోసం ఆర్మూర్ పట్టణానికి వలస వచ్చారు. రాజారాం 12 ఏళ్ల క్రితం మృతి చెందాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా స్వప్న ఐదేళ్లుగా మహబూబ్ అనే వ్యక్తితో గోవింద్‌పేట్ గ్రామంలో సహజీవనం చేస్తోంది. ఇద్దరు కలిసి కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఐదు రోజుల నుంచి వీరు ఉంటున్న ఇంటికి తాళం ఉంది. కాగా బుధవారం ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గురువారం పోలీసులు క్లూస్‌టీంతో కలిసి ఇంట్లోకి వెళ్లగా కుళ్లిపోయిన స్థితిలో స్వప్న మృతదేహం కనిపించింది. వైద్యులు అక్కడే పోస్టుమార్టం నిర్వహించి, గోవింద్‌పేట్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపారు.
నగరంలో వృద్ధుడు..
ఖలీల్‌వాడి: నగరంలోని సీతారాంనగర్ కు చెందిన అవుసుల అంజయ్య(60) మృతి చెందినట్లు ఐదో టౌన్ ఎస్సై లక్ష్మయ్య గురువారం తెలిపారు. అంజయ్యకు కొన్ని రోజుల నుంచి మతిస్థిమితం లేదన్నారు. 15 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదన్నారు. గురువారం మృతి చెందారని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
కామారెడ్డిలో గుర్తు తెలియని మహిళ..
కామారెడ్డి క్రైం: కామారెడ్డి పట్టణంలోని ఇందిరాచౌక్ వద్ద ఓ గుర్తు తెలియని మహిళ గురువారం మృతి చెందింది. 50–55 ఏళ్ల వయస్సు గల ఆమె గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. గద్దైపె పడుకున్న చోటనే ఆమె మృతి చెందగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. అనారోగ్య కారణాలతో మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు.
చికిత్స పొందుతూ..
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని సజ్జన్పల్లి గ్రామానికి చెందిన రజిత (39) చికిత్స పొందుతూ గురువారం మృతి చెందిన ట్లు ఏఎస్సై ప్రకాశ్ తెలిపా రు. వివరాలు.. ఈ నెల 25 న ముగురి శ్రీనివాస్ తన భార్య రజితతో కలిసి బైక్‌పై లింగంపేట నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఎదురుగా మరో బైక్ ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రజితను మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఏఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment