వేతనాలు అందక అవస్థలు | - | Sakshi
Sakshi News home page

వేతనాలు అందక అవస్థలు

Published Fri, Jan 31 2025 1:48 AM | Last Updated on Fri, Jan 31 2025 1:48 AM

వేతనా

వేతనాలు అందక అవస్థలు

ఆర్మూర్‌: సమగ్ర శిక్ష ఉద్యోగులు రెండు నెలలుగా వేతనాలు అందక ఇక్కట్లు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 29 రోజుల పాటు సమ్మె నిర్వహించారు. ఈ సమ్మెలో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల ఉద్యోగులు సైతం పాల్గొన్నారు. సమగ్ర శిక్ష రాష్ట్ర జేఏసీ నాయకత్వంలో కొందరు చేసిన తప్పిదం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకున్నప్పటికీ సమ్మెను విరమించారు. అయితే సమ్మె విరమించే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదు కాబట్టి కాంట్రాక్టు ఉద్యోగులకు పే స్కేల్‌ వర్తింప జేయాలి అనే డిమాండ్‌ను పక్కన పెట్టి నాన్‌ ఫైనాన్షియల్‌ డిమాండ్లన్నింటిని పరిష్కరిస్తూ సమ్మె కాలానికి వేతనం సైతం చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారంటూ జేఏసీ నాయకత్వం సమ్మెను విరమింపజేసింది. డిసెంబర్‌ 7వ తేదీ నుంచి నిరసన దీక్షలు ప్రారంభించిన ఉద్యోగులు పదో తేదీ నుంచి పూర్తి స్థాయిలో విధులను బహిష్కరిస్తూ సమ్మె బాట పట్టారు. అయితే సమ్మె కారణంగా డిసెంబర్‌ నెల వేతనం పొందలేకపోయారు. జనవరి 6వ తేదీ నుంచి విధుల్లో చేరినప్పటికీ జనవరి నెల వేతనం సైతం అందే పరిస్థితులు లేవు. సమగ్ర శిక్ష జేఏసీ నాయకులు ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థాయి అధికారులను కలుస్తూ సమ్మె డిమాండ్ల సాధనతో పాటు సమ్మె కాలంలో వేతనం చెల్లింపుకు ఉత్తర్వులు జారీ చేయాలని విన్నవిస్తున్నా అధికారుల్లో కదలిక లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగుల వివరాలు

విభాగం నిజామాబాద్‌ కామారెడ్డి

కేజీబీవీ బోధనేతర,

బోధన సిబ్బంది 571 480

యూఆర్‌ఎస్‌,

బోధనేతర సిబ్బంది 10 10

డీపీవో సిబ్బంది 9 7

ఎంఐఎస్‌ సమన్వయకర్తలు 22 22

సీసీవోలు 29 22

సీఆర్పీలు 94 76

ఐఈఆర్పీలు 35 26

మెసెంజర్లు 19 18

పీటీఐలు 88 71

సీజీవీలు 19 18

మొత్తం 896 750

సమగ్ర శిక్ష ఉద్యోగులకు

రెండు నెలలుగా అందని జీతం

సమ్మె కాలంలో వేతనాల చెల్లింపుపై స్పష్టత కరువు

ప్రతిసారి మోసపోతూనే ఉన్నాం

ఎన్నికలకు ముందు, తరువాత రాజకీయ నాయకులు, పాలకుల హామీలను నమ్మి ప్రతి సారి మోసపోతూనే ఉన్నాం. సమగ్ర శిక్ష ఉద్యోగులకు సమ్మె కాలం వేతనాలతో పాటు పే స్కేల్‌ ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.

– ప్రకాశ్‌, సమగ్ర శిక్ష జేఏసీ నాయకుడు,

నిజామాబాద్‌

వేతనాలు చెల్లించాలి

చాలీచాలని వేతనాలతో ఇక్క ట్లు పడుతున్న సమగ్ర శిక్ష ఉ ద్యోగులకు సమ్మె కాలం వేత నాలు చెల్లిస్తామన్న అధికారులు స్పష్టమైన ఉత్తర్వులు జా రీ చేయాలి. ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేశారు అనే భావన సరైంది కాదు. న్యాయమైన మా డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి సమ్మె చేశాం.

– రాజు, సమగ్ర శిక్ష జేఏసీ అధ్యక్షుడు, నిజామాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
వేతనాలు అందక అవస్థలు 1
1/2

వేతనాలు అందక అవస్థలు

వేతనాలు అందక అవస్థలు 2
2/2

వేతనాలు అందక అవస్థలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement