పామర్రులో 2 కిలోల గంజాయి పట్టివేత | Sakshi
Sakshi News home page

పామర్రులో 2 కిలోల గంజాయి పట్టివేత

Published Fri, May 24 2024 9:05 AM

-

పామర్రు: మండల పరిధిలోని పెదమద్దాలి గ్రామంలో 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... పెదమద్దాలి గ్రామంలో గంజాయి నిల్వలపై సమాచారం రావడంతో దాడులు నిర్వహించారు. ఈ దాడులలో రెండు కిలోల ఎండు గంజాయిని పట్టుకోవడంతో పాటు నిందితుల నుంచి మూడు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై కేసు నమోదు చేసి గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అది ఎక్కడ అమ్ముతున్నారు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement