‘సాక్షి’ స్పెల్‌బీ, మ్యాథ్‌బీలకు విశేష స్పందన
● ఉమ్మడి జిల్లా నుంచి భారీగా విద్యార్థుల రాక ● ఇంగ్లిష్‌తో పాటు గణితంపై పట్టు సాధించేందుకు దోహదం
ప్రీ మెచ్యూర్ చిన్నారులకు అధునాతన వైద్యం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యార్థులకు లెక్కలపై ఉన్న భయాన్ని పోగొట్టడంతో పాటుగా ఇంగ్లిష్ భాషపై మక్కువ పెంచేందుకు సాక్షి మీడియా గ్రూప్ నిర్వహించిన మ్యాథ్‌బీ సెమీ ఫైనల్ రౌండ్, స్పెల్ బీ క్వార్టర్ ఫైనల్ రౌండ్ పరీక్షలు ఆదివారం ఉత్సాహంగా సాగాయి. విజయవాడ పిన్నమనేని పాలి క్లినిక్ రోడ్డులోని నలందా విద్యానికేతన్ స్కూల్ ఆవరణలో జరిగిన ఈ పరీక్షలకు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 18 పాఠశాలల నుంచి 1158 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థులతో పాటుగా వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో నలందా విద్యానికేతన్ ఆవరణ మొత్తం సందడిగా మారింది. స్పెల్‌బీ క్వార్టర్ ఫైనల్ రౌండ్‌లో 547 మంది, మ్యాథ్‌బీ సెమీ ఫైనల్ రౌండ్‌లో 611 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజెంటింగ్ స్పాన్సర్‌గా డ్యూక్స్ వాఫే, అసోసియేట్ స్పాన్సర్‌గా ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ రాజమండ్రి వారు వ్యవహరిస్తున్నారు.
పిల్లల ఏ స్థాయిలో ఉన్నారో తెలుస్తుంది..
‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెల్ బీ, మ్యాథ్ బీ పరీక్షల వల్ల విద్యార్థులకు ఆయా సబ్జెక్టులపై ఎంత స్థాయిలో పట్టు ఉందో తెలుస్తుంది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు పిల్లల స్థితిని తెలుసుకోడానికి అవకాశం ఏర్పడింది. పిల్లలకు పోటీ పరీక్షలపై కూడా ఒక అవగాహన ఏర్పడుతుంది.
– శ్రీదివ్య, విద్యార్థి తల్లి
మ్యాథ్ బీ పరీక్షకు హాజరు కావడం వల్ల కొత్త విషయాలు తెలుసుకున్నా. పరీక్షలో టైమ్‌ను ఎలా మేనేజ్ చేయాలనే విషయంపై అవగాహన ఏర్పడింది. మ్యాథ్‌లో ఫార్ములాల ప్రాధాన్యం అర్థమైంది. స్కిల్స్ ఎలా పెంచుకోవాలో తెలిసింది.
– సీహెచ్ మేఘన, 8వ తరగతి,
కేకేఆర్ గౌతమ్ స్కూల్, గూడవల్లి
స్పెల్ బీ పరీక్షకు హాజరు కావడానికి ప్రిపేర్ అవుతున్న సమయంలో ఇంగ్లిషు భాషలోని చాలా కొత్త పదాలను నేర్చుకున్నా. పరీక్షలో మరికొన్ని కొత్త పదాలను తెలుసుకున్నా. ఇంగ్లిష్ సబ్జెక్టుతో పాటుగా స్పెల్లింగులను కూడా చదవాలని అర్థమైంది.
–పి.యుక్తశ్రీ, 7వ తరగతి,
సిద్ధార్థ పబ్లిక్ స్కూల్, విజయవాడ
మ్యాథ్ బీ పరీక్షకు హాజరు కావడం వల్ల లెక్కలపై ఉన్న భయం తగ్గింది. మ్యాథ్స్ ఫార్ములాలపై పట్టు సాధించాలనే విషయం తెలిసింది. ఈ పరీక్షకు హాజరు కావడం వల్ల టైమ్ మేనేజ్‌మెంట్‌పై అవగాహన వచ్చింది.
–తీర్థరాజ్,7వ తరగతి,
నలందా విద్యానికేతన్, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment