రాష్ట్ర ఉత్తమ సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడిగా దారపురెడ్డి
హనుమాన్‌జంక్షన్ రూరల్: రాష్ట్ర ఉత్తమ సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడిగా దారపురెడ్డి భాస్కరరావు పురస్కారం అందుకున్నారు. బాపులపాడు మండలం రేమల్లే జెడ్పీ హైస్కూల్‌లో పనిచేస్తున్న ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ స్టడీస్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో విజయనగరంలో జరిగిన కార్యక్రమంలో ఆదివారం అవార్డుకు అందజేశారు. విద్యార్థులకు వినూత్నంగా సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాలను బోధించటం, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నందుకు గానూ ఈ అవార్డు దక్కినట్లు భాస్కరరావు తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసనాయుడు, ఆర్జేడీ కె.విజయభాస్కర్ చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడిగా అవార్డును స్వీకరించినట్లు పేర్కొన్నారు.
పిల్లలకు ఆస్తి కాదు..
చదువు కావాలి
ఆటోనగర్(విజయవాడతూర్పు): పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా ఫర్వాలేదుగానీ .. తల్లిదండ్రులు చదివించాలని అప్పుడే అభివృద్ధి చెందుతారని రిటైర్డ్ జడ్జి గూడూరి రామకృష్ణ అన్నారు. ఆదివారం శెట్టిబలిజ, గౌడ, ఈడిగ, శ్రీశయన, యాత సంఘీయుల కార్తిక వనసమారాధన నున్నలోని యజ్ఞాన్ గార్డెన్స్‌లోని మామిడి తోటలో జరిగింది. జడ్జి గూడూరి మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపాలన్నారు. ఆటోనగర్ శెట్టిబలిజ అధ్యక్షుడు బొక్కా సత్యనారాయణ, కార్యదర్శి డి.వాసు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment