ఎయిర్‌పోర్ట్‌కు సీఎం చంద్రబాబు | - | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్ట్‌కు సీఎం చంద్రబాబు

Published Sat, Jan 25 2025 1:54 AM | Last Updated on Sat, Jan 25 2025 1:54 AM

-

గన్నవరం: దావోస్‌ పర్యటన పూర్తి చేసుకుని శుక్రవారం గన్నవరం విమానాశ్రయానికి విచ్చేసిన సీఎం చంద్రబాబుకు పలువురు మంత్రులు స్వాగతం పలికారు. తొలుత ఆయన న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 3.45 గంటలకు ఇక్కడికి చేరుకున్నారు. విమానాశ్రయంలో సీఎంకు రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, కొల్లు రవీంద్ర, సత్యకుమార్‌ యాదవ్‌, కందుల దుర్గేష్‌, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, పలువురు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం హెలికాఫ్టర్‌లో ఉండవల్లి బయలుదేరి వెళ్లారు.

విశ్రాంత బ్యాంక్‌ మేనేజర్‌ వద్ద రూ.78.33 లక్షలు స్వాహా

పెనమలూరు: తాడిగడపకు చెందిన విశ్రాంత బ్యాంక్‌ మేనేజర్‌ వద్ద సైబర్‌ నేరగాళ్లు రూ 78.33 లక్షల సొమ్ము స్వాహా చేశారు. పెనమలూరు సీఐ జె.వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం తాడిగడప పద్మజానగర్‌ విజయలక్ష్మి రెసిడెన్సీలో బ్యాంక్‌ విశ్రాంత మేనేజర్‌ తల్లం ఉమామహేశ్వరగుప్తా కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు. కొన్నేళ్లుగా షేర్‌ మార్కెట్‌లో అనుభవం ఉంది. గతేడాది సెప్టెంబర్‌లో ఎస్‌ సెక్యూరిటీకి సంబంధించి పి 302 వైఎస్‌ఐఎల్‌ ఆఫీషల్‌ స్టాక్‌ ఎకై ్సంజ్‌ కమ్యూనిటీ నుంచి వాట్సాప్‌కు మెసేజ్‌ వచ్చింది. ఉమామహేశ్వరగుప్తా ప్రమేయం లేకుండానే గ్రూప్‌లో సభ్యుడిగా చేర్చారు. దీనిలో ఏడుగురు సభ్యులు ఉండగా, గ్రూప్‌కు ఎస్‌ఈబీఐ ఇచ్చినట్లుగా సర్టిఫికెట్‌ రిజిస్ట్రేషన్‌ కంపెనీ కాపీ కూడా షేర్‌ చేశారు. దీంతో ఉమామహేశ్వరగుప్తా వారిని నమ్మి గత ఏడాది సెప్టెంబర్‌ 18 నుంచి అక్టోబర్‌ 14వ తేదీ వరకు ప్రైమరీ మార్కెట్‌లో 9 సార్లుగా రూ.78.33 లక్షలు డిపాజిట్‌ చేశాడు. షేర్‌లో అమ్మగా ఆయనకు రూ.86.57 లక్షలు లాభం చూపించారు. దీంతో వచ్చిన లాభంలో రూ.20 లక్షలు విత్‌ డ్రా చేయడానికి యత్నించగా గ్రూప్‌ నుంచి ఎటుంవటి సమాధనం రాలేదు. దీంతో తాను మోసపోయాననని బాధితుడు గత అక్టోబర్‌ 23వ తేదీన సైబర్‌ క్రైమ్‌కు ఫిర్యాదు చేశాడు. అనంతరం పెనమలూరు పోలీసులకు ఆలస్యంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement