ఒడిశా: మహా శివుడికి ఇష్టమైన శ్రావణ సోమవారం సందర్భంగా గంజా జిల్లా అస్కా నుంచి బెజ్జిపుట్ గ్రామంలోని శివాలయానికి కారులో బయల్దేరిన బోల్‌భం భక్తుల దీక్షలో అపశృతి చోటుచేసుకుంది. శివాలయానికి వెళ్తున్న 10 మంది బోల్‌భం దీక్షలు చేపట్టిన మహిళల కారు విద్యుత్ స్తంభానికి ఢీకొంది. దీంతో పొలాల్లోకి కారు పల్టీలు కొట్టింది.
ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కలెక్టర్ దివ్య జ్వోతి ఫరిడా మరియు గంజాం ఎస్పీ జగమోహన్ మీనా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వీరి ఆదేశాలతో అగ్నిమాపక సిబ్బంది మరియు ఓడ్రాప్ బృందం పల్టీలు కొట్టిన కారులో చిక్కుకున్న మృతదేహాలు, క్షతగాత్రులను వెలికి తీశారు.
వారిని బంజనగర్ ప్రభుత్వ ప్రాథమిక ఆస్పత్రికి తరలించి క్షతగాత్రులకు చికిత్స అందించారు. అనంతరం పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో 8 మంది క్షతగాత్రులను బరంపురం ఎంకేసీజీ మెడికల్ కళాశాలకు అంబులన్స్‌ల్లో తరలించారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి ఆందోళకరంగా ఉన్నట్లు ఎంకేసీజీ మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ మిశ్రా తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment