భయపడొద్దు.. అది ‘ఫేక్’ పులి
పర్లాకిమిడి: గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి బ్లాక్ జిరంగో గ్రామంలో బౌద్ధమందిర ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్టు పలు చిత్రాలు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ప్రాంతాలకు ఎవరూ వెళ్లవద్దని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. ఈ విషయమై జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్.ఆనంద్ మాట్లాడుతూ కొందరు ఆకతాయిలు చంద్రగిరి ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్టు ఫొటోషాప్‌లో చిత్రాలను సృష్టించి పర్యాటకులను భయపెడుతున్నారని చెప్పారు. అసత్య ప్రచారాలని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి అసత్య ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, గజపతి– గంజాం సరిహద్దు ప్రాంతంలో మహారాష్ట్రకు చెందిన పులి సంచరిస్తూ ప్రజలకు భయందోళనలు గురి చేస్తుండటంతో చంద్రగిరి, మోహనా అటవీ శాఖ అధికారులు నిఘా పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment