సేవలకు గుర్తింపుగా పురస్కారం
పార్వతీపురం: ఉత్తమ సేవలను అందించినందుకుగాను కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న ఆర్.వెంకట మహేష్ పురస్కారం అందుకున్నారు. కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న జిల్లా కోఆర్డినేటర్ వెంకట మహేష్‌కు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ పురస్కారం అందజేశారు.
రామవరం సర్పంచ్ జాతీయ పురస్కారం
సీతానగరం: మండలంలోని రామవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ పెంట సత్యంనాయుడు జాతీయస్థాయిలో ఉత్తమ పంచాయతీ సర్పంచ్‌గా కేంద్రప్రభుత్వ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. గ్రామపంచాయతీని అభివృద్ధి చేయడంలో ప్రతిభను కనబరచడం వల్ల కేంద్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే సందర్భంగా సర్పంచ్ దంపతులతో పాటు పంచాయతీ కార్యదర్శి శశిభూషణరావును అభినందించింది.
ఎకై ్సజ్ ఎస్సై యు.నాగేశ్వరరావుకు రాష్ట్రస్థాయి అవార్డు
పార్వతీపురంటౌన్: ఎకై ్సజ్ ఎస్సై యు.నాగేశ్వరరావుకు రాష్ట్ర స్థాయి అవార్డు లభించింది. విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను అవార్డుకు ఎంపిక చేశారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివా రం విజయవాడలో ఎకై ్సజ్ కమిషనర్ నిషాంత్ కుమార్ చేతుల మీదుగా ఆయన అవార్డు స్వీకరించారు. ఆయనకు అవార్డు రావడం పట్ల ఎకై ్సజ్ సిబ్బంది అభినందించారు.
విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
వీరఘట్టం: పదో తరగతి విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన బిటివాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం సీహెచ్ రత్నాకరరావు సూచించారు. పాఠశాల ఆవరణలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్చి 17 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయని, ఈ నేపథ్యంలో విద్యార్థులు ఇంటి వద్ద ప్రశాంతంగా చదువుకునేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. టీవీలు, సెల్ఫోన్లకు విద్యార్థులను దూరంగా ఉంచాలని సూచించారు.
రహదారి భద్రతా
నియమాలు పాటించాలి
వీరఘట్టం: సురక్షిత ప్రయాణాలకు వాహన చోదకులు రహదారి భద్రతా నియమాలు పాటించాలని ఎస్సై జి.కళాధర్ సూచించారు. ఆదివారం స్థానిక కొత్త బస్టాండ్ సెంటర్లో ఆటోడ్రైవర్లకు అవగాహన కల్పించారు. వీరఘట్టం, నడుకూరు, విక్రమపురం, నడిమికెల్ల గ్రామాల్లో రోడ్డు పక్కనే పాఠశాలలు ఉన్నందున ఆయా ప్రాంతాల్లో వాహనదారులు పరిమిత వేగంతో రాకపోకలు సాగించాలని సూచించారు.
కిచ్చాడలో ఏనుగుల గుంపు
గుమ్మలక్ష్మీపురం(కురుపాం): కురుపాం మండలంలోని కిచ్చాడ గ్రామ పరిసరాల్లో ఆదివారం సాయంత్రం ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. దీంతో గ్రామాల్లోకి చొరబడతాయేమోనని పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment