అంగన్‌వాడీలకు అండగా కేంద్రం | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీలకు అండగా కేంద్రం

Published Fri, Jan 31 2025 2:14 AM | Last Updated on Fri, Jan 31 2025 2:14 AM

అంగన్‌వాడీలకు అండగా కేంద్రం

అంగన్‌వాడీలకు అండగా కేంద్రం

సత్తెనపల్లి: పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషణ్‌ అభియాన్‌ను ఇప్పటికే కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా సాక్ష్యం, పోషణ్‌ 2.0 కార్యక్రమాలు అమలు చేస్తోంది. వీటిని మరింత ప్రోత్సహిస్తూ ... ఉత్తమ ఫలితాలు సాధించిన పంచాయతీలకు ‘సుపోషిత పంచాయతీ అభియాన్‌’ పేరిట పురస్కారాలు ప్రకటించనుంది. ఎంపికై న పంచాయతీలకు రూ. లక్ష నజరానా అందజేయనుంది. ఇందుకు అంగన్‌వాడీ కేంద్రాల పనితీరే ప్రామాణికం కానుంది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. తదునుగుణంగా జిల్లా అధికారులు 70 గ్రామ పంచాయతీలను ప్రతిపాదించారు.

పరిశీలన అంశాలివే...

ఇందులో పోషణ్‌ ట్రాకర్‌ యాప్‌ నిర్వహణ కీలకం కానుంది. లబ్ధిదారులను గుర్తించి యాప్‌లో పొందుపరచడం, కేంద్రాల నిర్వహణ, రోజువారీ పనితీరు, చిన్నారుల ఎదుగుదలను పరిశీలించనున్నారు. లబ్ధిదారుల యోగక్షేమాలు తెలుసుకోవడం, పోషకాహారం సరఫరా, పూర్వ ప్రాథమిక విద్య బోధన, అభ్యాసన, కేంద్రంలో పారిశుధ్య నిర్వహణ, మౌలిక వసతులు, ఎత్తు, వయసుకు తగ్గ బరువు లేని పిల్లల (శామ్‌, మామ్‌,ఎస్‌యూడబ్ల్యూల)ను గుర్తించి లోపాల నివారణకు చర్యలు తీసుకోవడం తదితరాలను నిశితంగా పరిశీలిస్తారు. ప్రతిపాదిత పంచాయతీలు పురస్కారాలు సాధించేలా అంగన్‌వాడీ సిబ్బందికి ఐసీడీఎస్‌ జిల్లా అధికారులు మార్గ నిర్దేశం చేస్తున్నారు. ఎంపికై న పంచాయతీకి రూ. లక్ష ప్రోత్సాహక నగదు ఇస్తారు. అందులో అంగన్‌వాడీ కార్యకర్త, ఆయాలకు 25 శాతం, గ్రామంలో చైతన్య, అవగాహన కార్యక్రమాల నిర్వహణకు 25 శాతం, అంగన్‌వాడీలో పోషణ వాటికలు, సంబంధిత కార్యక్రమాలకు 50 శాతం వెచ్చించాల్సి ఉంటుంది.

కార్యక్రమాల మెరుగుకు ప్రోత్సాహం

ఉత్తమ పనితీరు చూపితే రూ.లక్ష నజరానా

జిల్లాలో 70 పంచాయతీలకు ప్రతిపాదన

ప్రతిపాదిత అంశాలు ఇవి..

ప్రాథమిక పరిశీలన: ఫిబ్రవరి 15

రాష్ట్ర కమిటీల క్షేత్ర తనిఖీ, బృంద పరిశీలన: ఫిబ్రవరి 15 – జూలై 31

మూడో విడత మూల్యాంకనం: ఆగస్టు, సెప్టెంబర్‌ నెలాఖరు

ఫలితాల వెల్లడి: సెప్టెంబరు, అక్టోబరు నెలాఖరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement