అంధుల అక్షర శిల్పి బ్రెయిలీ | - | Sakshi
Sakshi News home page

అంధుల అక్షర శిల్పి బ్రెయిలీ

Published Fri, Jan 31 2025 2:14 AM | Last Updated on Fri, Jan 31 2025 2:14 AM

-

గుంటూరు రూరల్‌: అంధత్వం మనిషి శరీరానికే కానీ.. మానవ మేధస్సుకు ఏమాత్రం కాదని నిరూపించిన మహనీయుడు లూయి బ్రెయిలీ అని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ వైవీఎస్‌బీజీ పార్థసారథి కొనియాడారు. అంధుల అక్షర శిల్పిగా ఆయనను అభివర్ణించారు. జాతీయ అంధుల సమైక్య అమరావతి శాఖ ఆధ్వర్యంలో గురువారం గుంటూరు క్లబ్‌లో లూయి బ్రెయిలీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో జరిగిన పలు పోటీల్లో పెద్ద సంఖ్యలో అంధులు పాల్గొనడం విశేషం. ఈ పోటీలను జిల్లా జడ్జి ప్రారంభించారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా తాను అంధత్వాన్ని జయించడమే కాక యావత్‌ అంధులకు ప్రత్యేక లిపి ద్వారా సరికొత్త లోకాన్ని సృష్టించిన బ్రెయిలీ ఎందరికో ఆదర్శమని పేర్కొన్నారు. కష్టపడితే దరికి రానిది ఏదీ లేదన్న నమ్మకంతో ముందుకు సాగాలని కోరారు. సాయం అందించేందుకు సిద్ధంగా ఉంటామని తెలిపారు. అనంతరం పలు పోటీల్లో విజేతలకు ఏపీ బార్‌ కౌన్సిల్‌ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌, గుంటూరు క్లబ్‌ డైరెక్టర్‌ వి.బ్రహ్మారెడ్డి, కార్యదర్శి ఎస్‌.సాంబశివరావు, కోశాధికారి ఎం. భూపేన్‌ బహుమతులు అందజేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో క్లబ్‌ ఎప్పుడూ చురుకై న పాత్ర పోషిస్తూనే ఉంటుందన్నారు. 4వ అదనపు జిల్లా జడ్జి ఆర్‌.శరత్‌బాబు, జిల్లా లీగల్‌ సర్వీస్‌ అథారిటీ కార్యదర్శి లీలావతి, ఎన్‌ఎఫ్‌బీఐ అమరావతి కార్యదర్శి పి. లక్ష్మీనారాయణ, కన్నా స్కూల్‌ కరస్పాండెంట్‌ కన్నబాబు, షిరిడీ సాయి దీన జన సేవా సమితి చైర్మన్‌ ఏ పూర్ణచంద్రరావు, ఎన్‌ఎఫ్‌బీఐ ఏపీ స్టేట్‌ అధ్యక్షుడు ఎస్‌.నాగార్జున, ప్రధాన కార్యదర్శి ఎం. రామసుబ్బయ్య, నేషనల్‌ సెక్రటరీ కె.నాగేశ్వరయ్య, ఏపీ జనరల్‌ సెక్రటరీ బి.విజయ రామారావు, ఎన్‌.రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

జిల్లా జడ్జి పార్థసారథి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement