ఫార్మసీ సిలబస్ డిజిటలీకరణ
చేబ్రోలు: పెరుగుతున్న ఇండస్ట్రీ అవసరాలు, టెక్నాలజీలకు అనుగుణంగా ఫార్మసీ సిలబస్‌ను డిజిటలైజ్ చేయబోతున్నామని ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) ప్రెసిడెంట్ డాక్టర్ మోంటుకుమార్ ఎం.పటేల్ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ ఫార్మసీ కళాశాలలో ‘‘ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ పర్సనలైజ్డ్ డ్రగ్ డిస్కవరీస్– ఏ ఫ్యూచరిస్టిక్ అప్రోచ్’’ అంశంపై మూడు రోజుల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌ను ‘‘ నెక్ట్స్‌జెన్ ఫార్మా కనెక్ట్–2025’’ అనే ఇతివృత్తంతో గురువారం ఘనంగా ప్రారంభించారు. ముందుగా సావనీర్ విడుదల చేవారు. మోంటుకుమార్ ఎం.పటేల్ మాట్లాడుతూ.. పీసీఐ ద్వారా విద్యార్థులకు, అధ్యాపకులకు సరికొత్త టెక్నాలజీపై ట్రైనింగ్, స్కిల్స్ పెంపొందించడానికి కృషి చేస్తున్నామన్నారు. ఢిల్లీలోని పీసీఐ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ ఎం.వెంకట రమణ మాట్లాడుతూ.. పర్సనలైజ్డ్ డ్రగ్ డిస్కవరీస్ వలన జన్యుపరమైన విశ్లేషణ ద్వారా ఏ ఔషధం రోగికి అనుకూలమవుతుందో ముందుగానే అంచనా వేసి సరైన మందును అందించవచ్చని చెప్పారు. వివిధ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏపీ ఫార్మసీ కౌన్సిల్ మెంబర్, ఢిల్లీలోని పీసీఐ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ ఎస్.ఎల్.ఎన్ ప్రసాద్ రెడ్డి, డాక్టర్ ఎం.విల్లియం కారే, విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య, ప్రిన్సిపల్ పి.శ్రీనివాస బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment