చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి

Published Thu, May 9 2024 5:05 AM

-

భోగాపురం: మండలంలోని అమటాం రావివలస పంచాయతీ దల్లిపేట గ్రామానికి చెందిన దల్లి అప్పలరాములు (60) విజయనగరం ప్రభత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు హెచ్‌సీ పీవీఎస్‌ఎన్‌ఎన్‌ మూర్తి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. దల్లిపేటకు చెందిన దల్లి అప్పలరాములు భార్య ఏడాది కిందట అనారోగ్యంతో చనిపోయింది. ఉన్న ఇద్దరు కుమారులు బతుకుదెరువు కోసం విశాఖపట్నం వెళ్లిపోయారు. అప్పటినుంచి మద్యానికి బానిసైన అప్పలరాములు మంగళవారం ఉదయం అనుకోకుండా ఫినాయిల్‌ తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈ సమయంలో ఇంటికి వచ్చిన ఆయన చెల్లి నరసయ్యమ్మ అన్న పరిస్థితి చూసి స్థానికుల సహాయంతో విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుమారుడు దల్లి ఆదినారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెచ్‌సీ పీవీఎస్‌ఎన్‌ఎన్‌ మూర్తి తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement