క్రీడలతో మానసిక ఆరోగ్యం
● ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్ విజయలలిత
విజయనగరం ఫోర్ట్: ఉద్యోగంలో బిజీగా ఉన్న వారికి మానసిక ఆరోగ్యం కల్పించేందుకు క్రీడలు దోహదపడతాయని ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్ విజయలలిత అన్నారు. ఈ మేరకు సోమవారం స్థానిక రాజీవ్ గాంధీ క్రీడా మైదానంలో రాష్ట్రస్థాయి విద్యుత్ ఉద్యోగుల క్రీడాపోటీలను ఆమె ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి విద్యుత్ ఉద్యోగులు ఈ పోటీలకు హాజరయ్యారు. అఽథ్లెటిక్స్, టేబుల్ టెన్నిస్ విభాగాల్లో పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గెలుపోటములతో సంబంధం లేకుండా క్రీడాస్ఫూర్తితో క్రీడాకారులు ఆడాలని పిలుపునిచ్చారు. క్రీడల నగరం విజయనగరంలో క్రీడాపోటీలు జరగడం ఆనందంగా ఉందన్నారు. ఏపీఈపీడీసీఎల్ ఆపరేషన్ సర్కిల్ డైరెక్టర్ రామచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగంతోపాటు ఆరోగ్యం కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉందన్నారు. క్రీడలు ఆడడం ద్వారా పట్టుదల, క్రమశిక్షణ ,పోటీతత్వం ఏర్పడతాయని చెప్పారు. పోటీల్లో బాగా ఆడి జాతీయస్థాయి పోటీలకు ఎంపికకావాలని అకాంక్షించారు. ఓటమి గురించి అలోచించకుండా అందరు విజేతలుగా భావించి క్రీడల్లో పాల్గొనాలన్నారు. విద్యుత్ శాఖ ఎస్‌ఈ మువ్వల లక్ష్మణరావు మాట్లాడుతూ జిల్లాలో క్రీడాపోటీల నిర్వహణకు అవకాశం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఏపీ ట్రాన్స్‌కో ఎస్‌ఈ బాలాజీ, ఈఈ పెద్దింటి త్రినాఽథరావు, వడివేలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment