పార్వతీపురం: రైతులకు అసౌకర్యం కలగకుండా ధాన్యం కొనుగోలును వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ ఎ. శ్యామ్‌ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆయన కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోళ్లు, పోస్టల్, బ్యాంక్ ఖాతాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాలు రాకముందే రైతులనుంచి పూర్తిస్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారంటీలు వచ్చేలా చూడాలని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి డీబీటీ ద్వారా లబ్ధిపొందేందుకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని స్పష్టం చేశారు. జిల్లాలో 6,46,371 ఖాతాలకు గాను 90700 మంది ఖాతాలు ఇంకా అనుసంధానం కావాల్సి ఉందన్నారు. సమావేశంలో సబ్‌కలెక్టర్ ఎస్‌ఎస్ శోభిక, జిల్లా మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment