విచారణ వేగవంతం
సీతంపేట: బోగస్ కుల ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి విచార ణ వేగవంతం చేస్తున్నట్లు ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి అన్నా రు. ఈ మేరకు సోమవారం ఆయన తన కార్యాలయంలో ఈ తరహా ధ్రువీకరణ పత్రాలపై విచారణ ప్రారంభించారు. గతంలో అందిన ఫిర్యాదుల మేరకు మూడు ఫిర్యాదులపై ఇరువర్గాల వద్ద ఉన్న ఆధారాలపై అధికారుల సమక్షంలో విచారణ చేపట్టారు. త్వరలో ఈ విచారణపై చర్యలు ఉంటాయని పీఓ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఐటీడీఏ డీడీ అన్నదొర, సూపరింటెండెంట్ దేశ్ తదితరులు పాల్గొన్నారు.
హాల్‌టికెట్ల పంపిణీ నిలిపివేయవద్దు
● కలెక్టర్ హెచ్చరిక
పార్వతీపురం: ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తం మంజూరు కాలేదని విద్యార్థుల హాల్‌టికెట్లు, ధ్రువీకరణ పత్రాల పంపిణీని నిలిపివేయవద్దని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో అధికారులతో సోమవారం ఆయన సమీక్షించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నెపంతో విద్యార్థులను తరగతులు, ప్రాక్టికల్స్‌కు దూరంగా ఉంచకూడద ని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నేరుగా కళాశాలలకు విడుదలవుతుందని విద్యార్థులపై ఒత్తి డి తేవడం సరికాదన్నారు. కళాశాలల యాజ మాన్యం విద్యార్థులపై ఒత్తిడి తెస్తే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
గణారాధన
వేపాడ: మండలంలోని వల్లంపూడి సాంభమూర్తి ఆలయం ప్రాంగణంలో సోమవారం రాత్రి గణారాధనను భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అర్చకులు ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. రాత్రికి వేపాడ–వల్లంపూడి జంట గ్రామాలకు చెందిన వందలాదిమంది భక్తులు కాగడాలను వెలిగించి శివ, హరినామస్మరణలో తరించా రు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా సాంభమూర్తి సేవా సంఘం సభ్యులు, గ్రామస్తులు ఏర్పాట్లు చేశారు.
ఆర్టీసీ జోనల్ చైర్మన్ బాధ్యతల స్వీకరణ
విజయనగరం అర్బన్: ఆర్టీసీ విజయనగరం జోనల్ చైర్మన్‌గా జోనల్ కార్యాలయంలో సియ్యారి దొన్నుదొర మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలో జిల్లా కేంద్రం నుంచి అరకు మీదుగా పాడేరుకు బస్సు సదుపాయం కల్పిస్తామన్నారు. ఆర్టీసీ నష్టాలను తగ్గించేందుకు సంస్థ ఉద్యోగుల సహకారం తీసుకుంటామన్నారు. రాష్ట్ర అర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర రవాణా సంస్థను మరింతగా బలోపేతం చేసి రాష్ట్రంలో ప్రజా రవాణా ను, ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తామని అన్నారు. అనంతరం శ్రీకాకుళం–విశాఖ మధ్య నాన్ స్టాప్‌లుగా నడిపేందుకు రెండు ఆల్ట్రా డీలక్స్ బస్సు సర్వీసులను, శ్రీకాకుళం–విజయనగరం మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ సర్వీసును ప్రారంభించారు. అనంతరం డిపో ప్రాంగణంలో మొక్కలు నాటారు.
కార్యక్రమంలో జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్, ఆర్టీసీ ఈడీ పి.విజయకుమార్, జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్.అప్పలనారా యణ, జిల్లా డీపీటీఓ కె.శ్రీనివాసరావు, అనకాపల్లి డీపీటీఓ కె.పద్మావతి, డిప్యూటీ సీఏఓ పి.వి. నాగేశ్వరరావు, డిప్యూటీ సీపీఎం సుధాబిందు, అధికారులు వరలక్ష్మి, ఐ.లక్ష్మీకాంత్, బి.రాజశేఖర్, కే.అరుణ్‌కుమార్, ఐ.దుర్గాప్రసాద్, కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment