నిధులు మంజూరు చేయండి
గోదావరిఖని: రామగుండం నియోజకవర్గ అ భివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ కోరారు. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డిని హైదరాబాద్‌లో ఎమ్మెల్యే శుక్రవారం కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రా మగుండం అభివృద్ధి కోసం అండగా ఉంటా మని హామీ ఇచ్చారని ఠాకూర్ పేర్కొన్నారు.
పరీక్షలకు సిద్ధం చేయాలి
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): పదో తరగతి విద్యార్థులను వార్షిక పరీక్షలకు మానసికంగా సంసిద్ధులను చేయాలని జిల్లా విద్యాధికారి మాధవి సూచించారు. కనుకుల ప్రభుత్వ ఉన్న త పాఠశాలతోపాటు ప్రాథమికోన్నత పాఠశాలను శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీచేశా రు. మధ్యాహ్న భోజనం, విద్యార్థులు, టీచర్ల హాజరు రిజిష్టర్లను పరిశీలించారు. వందశాతం మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించేందుకు ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షింయాలరి సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి రాజయ్య, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలును ఆపండి
రామగుండం: హైదరాబాద్ – హజ్రత్ ని జాముద్దీన్ మధ్య నడి చే దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రై లుకు రామగుండంలో హాల్టింగ్ పునరుద్ధ రించాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్య క్షుడు మద్దెల దినేశ్ కోరారు. ఈమేరకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్, డివిజనల్ మేనేజర్‌తోపాటు రైల్వేశా ఖ మంత్రికి ఎక్స్ వేదికగా ఫిర్యాదు చేశారు. దీనికి ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైన క థనం జోడించారు. హాల్టింగ్ ఎత్తివేయడంతో హైదరాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులకు సౌ కర్యం ఉన్నా.. నాగపూర్, భోపాల్, ఇటార్సీ వై పు వెళ్లేవారు అసౌకర్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. కేవలం డౌన్‌కు హాల్టింగ్ కొనసాగిస్తూ, అప్ ఎత్తివేయడం ఏమిటన్నారు. హాల్టి ంగ్‌ను పునరుద్ధరించాలని ఆయన కోరారు.
రాష్ట్రస్థాయి ఆర్చరీలో ప్రతిభ
గోదావరిఖని: రాష్ట్రస్ధాయి పోలీస్ ఆర్చరీ పోటీల్లో రిజ ర్వ్ ఇన్‌స్పెక్టర్ సంపత్ మూ డు పతకాలు సాధించారు. క రీంనగర్‌లో జరుగుతున్న తె లంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌లో కాళేశ్వరం జోన్ తరఫున ప్రాతినిధ్యం వహించి న సంపత్.. రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ఎంటీవో ఆర్‌ఐగా పనిచేస్తున్నారు. ఆర్చరీ రికార్వ్ విభాగంలో ఒక సిల్వర్, రెండు బ్రాంజ్ మెడల్స్ సాధించారు. ఆలిండియా పోలీస్ ఆర్చరీ టీంకు ఎంపికయ్యారు. ఆయనను పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment