పంట రుణ లక్ష్యం రూ.1,864 కోట్లు
● కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి
పెద్దపల్లిరూరల్: జిల్లాలో రూ.1,864 కోట్ల పంట రుణాలు అందించడం లక్ష్యమని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం అడి షనల్ కలెక్టర్ అరుణశ్రీతో కలిసి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్నారు. గతేడాది రూ.1,037కోట్ల ను పంట రుణాలు అందించామని వివరించారు. పెండింగ్ లక్ష్యాన్ని మార్చిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని 54మంది రైతులకు రు ణమాఫీ కాలేదని, వెనక్కి వెళ్లిన ఆ నిధులను తె ప్పించాలని అన్నారు. వ్యాపార రుణాలుగా రూ.650కోట్లు పంపిణీ చేశామని తెలిపారు.
స్వశక్తి సంఘాలకు రూ.386.99కోట్లు
జిల్లాలోని 4,559 స్వశక్తి సంఘాలకు రూ.386.99 కోట్లు, 411 మెప్మా సంఘాలకు రూ.49.34 కోట్ల రుణం అందించినట్లు వివరించారు. సంఘాలకు పూర్తి రుణాలు అందించకపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. స్టాండప్ ఇండియా ద్వారా డిసెంబర్ వరకు 20 యూనిట్లకు రూ.3.62 కోట్లు, ముద్ర రుణాలను 20,417 మందికి రూ.156.94 కోట్లు అందించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment