కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అల్ఫోర్స్ నరేందర్‌రెడ్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: మెదక్, నిజామాబాద్, ఆది లాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అ ధినేత వూట్కూరి నరేందర్‌రెడ్డి పేరు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. నరేందర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మ ల్లికార్జున్‌ఖర్గే ఆమోదించినట్లు శుక్రవారం ఏఐ సీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికలో పార్టీ పరంగా గు ర్తులు లేనప్పటికి, పార్టీ మద్దతుతో అభ్యర్థులు పోటీపడుతారు. పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం నరేందర్‌రెడ్డితో పాటు, ప్రసన్న హరికృష్ణ, వెలిచాల రాజేందర్‌రావు పోటీపడ్డా రు. చివరకు ఏఐసీసీ నరేందర్‌రెడ్డి అభ్యర్థిత్వం వైపు మొగ్గుచూపింది. కాంగ్రెస్ అభ్యర్థిగా తన ను ప్రకటించినందున ఏఐసీసీ అగ్రనేతలు సో నియాగాంధీ, రాహుల్‌గాంధీ, అధ్యక్షుడు మల్లి ఖార్జున ఖర్గే, సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షు డు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులకు నరేందర్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment