
AP Elections Political Latest Updates Telugu..
9:40 PM, Mar 3rd, 2024
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీలోకి చేరికలు
- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తూర్పు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్
- కార్తకర్తలే జగన్‌మోహన్‌రెడ్డి బలం
- చంద్రబాబు కుటిల బుద్ధి సామాన్య కార్యకర్తలకు సైతం అర్థమవుతోంది
- పవన్ కల్యాణ్‌కు ఎప్పుడు ఆర్థం అవుతుందో
- పేద ప్రజల జీవితాలకు భరోసా కల్పించే విధంగా జగన్ సిద్ధాంతాలు
- చంద్రబాబుతో కలశాకే పవన్ గ్రాఫ్ పడిపోయింది
- పెత్తందారీ వ్యవస్థకు బ్రాండ్ అంబాసిడర్ టీడీపీ
- రాష్ట్ర ప్రజల అభివృద్ధికై జగన్ అనేక సార్లు బటన్ నొక్కారు
- రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్ లు నొక్కాలి
9:30 PM, Mar 3rd, 2024
విశాఖ..
టిడిపి జనసేన ఒడిపోతాయని ప్రజల గట్ ఫీలింగ్: మంత్రి గుడివాడ అమర్నాథ్
- రెండున్నర లక్షల కోట్లు ప్రజలకు ఇవ్వడం వలన సీఎం జగన్ గెలడు అని చెపుతున్నారు..
- చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు ఎందుకు ఇస్తామంటున్నారు..
- చంద్రబాబును బహిరంగంగా కలిసిన తరువాత ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు..
- బీహార్‌లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా
- మాయల ఫకీరు మాటలను ఇక్కడ ప్రజలు నమ్మరు.
- ఒక పికే సరిపోలేదని మరొక పికేను చంద్రబాబు తెచ్చుకున్నారు..
- ఇంట గెలవని పీ కే మాటలను ఇక్కడ ప్రజలు నమ్ముతారా.
- బీహార్‌లో పికే పరిస్థితి ఎలాగ ఉందో చంద్ర బాబు పరిస్థితి రాష్ట్రంలో ఉంది..
- మాయల ఫకీరు మాటలను ప్రజలు ఎవరు నమ్మరు..
- ప్రజల్లో బలం లేని వారే ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు..
- గతంలో లగడపాటి టీడీపీకి 130 సీట్లు వస్తాయని చెప్పారు.. ఏమైంది.
- ప్రజలు సీఎం జగన్ నాయకత్వం ను కోరుకుంటున్నారు..
- ఐ ప్యాక్ అనేది ప్రశాంత్ కిషోర్‌తో లేదు
- ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు
8:50 PM, Mar 3rd, 2024
విజయవాడ:
పొత్తులపై మరోసారి ఏపీ బీజేపీ క్లారిటీ
- రెండు రోజుల సమావేశాల్లో పొత్తుల గురించి ఎలాంటి చర్చ జరగలేదు: పురందేశ్వరి, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు.
- అభ్యర్ధుల ఎంపికపై కసరత్తులు చేశాం
- 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్ధానాలలో అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియని చేపట్టాం
- 26 జిల్లాలు.. 175 అసెంబ్లీ స్థానాల్లో రాజకీయ, సామాజిక పరిస్థితులపై ఆరా తీశాం.
- అభ్యర్థుల ఎంపిక.. సామాజిక సమీకరణ సహా అన్ని అంశాలపై చర్చించాం.
- సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి జాతీయ నాయకత్వానికి నివేదిస్తాం
- పార్టీ పార్లమెంటరీ బోర్డులో చర్చిస్తారు.. నిర్ణయిస్తారు
- పొత్తులు సహా ఎలాంటి నిర్ణయమైనా పార్టీ హైకమాండుదే.
- 175 సెగ్మెంట్లకు గాను 2 వేల పైచిలుకు అప్లికేషన్లు ఇచ్చాయి
- జన్ మత్ లేఖలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నాం
- మేనిఫెస్టో నిమిత్తం జన్ మత్ లేఖ కార్యక్రమం చేపట్టనున్నాం
- 50 వేల మంది నుంచి అభిప్రాయాలు తీసుకుంటాం
- రాజ్ నాధ్ ఇప్పటికే వచ్చారు.. మరి కొందరి అగ్ర నేతల పర్యటనలు కూడా త్వరలో ఉంటాయి.
8:00 PM, Mar 3rd, 2024
బీసీలకు, మైనార్టీలకు పెద్ద పీట వేసే ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ: కొడాలి నాని
- పేదల ఇళ్ల స్ధలాల కోసం ఒక్క ఎకరా సేకరించని చంద్రబాబుతో నాకు పోలికేంటి
- పవన్‌ను చూస్తే జాలేస్తుంది
- వెన్ను పోటుకు బ్రాండ్ అంబాసిడర్ అయిన నాదెండ్ల, చంద్రబాబును వెంటేసుకుని తిరుగుతున్నాడు
- కోట్లాది మంది పేద వర్గాలకు కుల మతాలకతీతంగా మేలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ
- గుడివాడలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి
- కొత్తగా వచ్చిన ఎన్నారై నాయకులు గుడివాడలో చేసేదేముంది
7:50 PM, Mar 3rd, 2024
పశ్చిమగోదావరి జిల్లా:
భీమవరం పట్టణంలో జనసేనకు షాక్
- పలు వార్డులలోని 100 మంది జనసేన కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరిక
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్
6:34 PM, Mar 3rd, 2024
అల్లూరి జిల్లా:
గిరిజనులకు మేలు చేయని పార్టీకి ఓడించండి: రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి
- గిరిజన ప్రాంతానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సమూల అభివృద్ధి చేసిన ఘనత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి
- గిరిజనుల హక్కుల కోసం 1/70 రాజశేఖర్ రెడ్డి తెచ్చారు
గిరిజన ప్రాంతాల్లో ఖనిజ సంపదను దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు కుట్రలు జనం మర్చిపోలేదు
6:24 PM, Mar 3rd, 2024
ఎన్టీఆర్ జిల్లా:
మైలవరంలో 6వ తేదీ వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ ఏర్పాట్లు
నియోజకవర్గ ఆత్మీయ సమావేశ సభా ప్రాంగణాన్ని పరిశీలించిన ఎంపీ కేశినేని నాని,మైలవరం ఇంఛార్జి సర్నాల తిరుపతిరావు
ఆత్మీయ సమావేశానికి 50 వేల మంది కార్యకర్తలు వస్తారని అంచనా వేస్తున్నాం: ఎంపీ కేశినేని నాని
- మైలవరంలో అపర కుభేరుడికి సామాన్య పేద కుటుంబం నుంచి వచ్చిన సర్నాల తిరుపతిరావు యాదవ్ కు మధ్య జరగబోతోంది
- ఈ పోటీలో నెగ్గేది తిరుపతిరావే
- మైలవరంలో ఇప్పటి వరకూ కమ్మవారే ప్రాతినిధ్యం వహించారు
- సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పేదల పక్షపాతి
- పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన సర్నాల తిరుపతిరావును నిలబెట్టడమే విజయం సాధించినట్లు
5:50 PM, Mar 3rd, 2024
కోనసీమ:
రామచంద్రాపురంలో టీడీపీ-జనసేన కార్యకర్తల మధ్య తోపులాట
- రెడ్డి సుబ్రమణ్యం, బొలిశెట్టి చంద్రశేఖర్ వర్గీయుల మధ్య ఘర్షణ
- సుబ్రమణ్యం భార్య అభ్యర్థి అని ప్రచారం చేయడంపై జనసేన ఆగ్రహం
- పార్టీ అభ్యర్థిని ప్రకటించకుండా ప్రచారం చేయడమేంటని ప్రశ్నించిన జనసేన కార్యకర్తలు
- దీంతో టీడీపీ-జనసేన కార్యకర్తల మధ్య తోపులాట, ఉద్రిక్తత
5:35 PM, Mar 3rd, 2024
గుడివాడలో టీడీపీకి భారీ షాక్
- టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు
- సీనియర్ టీడీపీ నాయకుడు మహమ్మద్ ఖాసిం అబూ నాయకత్వంలో వైఎస్సార్‌సీపీలో చేరిన పలువురు మాజీ కౌన్సిలర్లు,టీడీపీ నేతలు, వెయ్యి మంది మైనార్టీ కార్యకర్తలు
- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీమంత్రి కొడాలి నాని
5:15 PM, Mar 3rd, 2024
నన్ను ఆంబోతు అంటున్నావ్.. నీ చరిత్ర ఏంటో తెలుసుకో చంద్రబాబు: మంత్రి అంబటి రాంబాబు
- ఆంబోతులకు ఆవులను సప్లయి చేసిన వ్యక్తి చంద్రబాబు
- చంద్రబాబు మాట్లాడేటప్పుడు నాలుక జాగ్రత్త
- చంద్రబాబు ఒక చీటర్
- చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నాడు
- చంద్రబాబు చెత్త పాలన చేశారు కాబట్టే చిత్తుచిత్తుగా ఓడిపోయారు
- చంద్రబాబు ఓ మోసగాడు, ఓ 420
- కోడెల ఆత్మహత్యకు కారణం చంద్రబాబు
- చంద్రబాబు కుట్రలకు కోడెల భయపడ్డారు
- కోడెల కుటుంబాన్ని చంద్రబాబు వేధించారు
- కోడెల చనిపోయినా ఆ కుటుంబంపై చంద్రబాబుకు కక్ష పోలేదు
- కోడెల కుటుంబానికి టికెట్ ఎందుకు ఇవ్వలేదు
- మీకు, మీ పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్ లేదు
4:20 PM, Mar 3rd, 2024
వైఎస్సార్‌జిల్లా:
- ఆధినారాయణ రెడ్డి దమ్ముంటే జమ్మలమడుగు ఎమ్మెల్యే అబ్యర్తిగా పోటీచేయ్: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
- మీడియముందు మాట్లాడే వాడు పులికాదు ప్రజల్లో తిరిగి ప్రజలకష్టాలు తెలుసుకునే వాడు పులి
4:10 PM, Mar 3rd, 2024
వైఎస్సార్‌జిల్లా:
జమ్మలమడుగులో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో యాదవ ఆత్మీయ సమ్మేళన సభ
సభలో పాల్గొన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి,కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు,ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి
చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడు: రామసుబ్బారెడ్డి
- చంద్రబాబు ఒక్క పథకం చెప్పి ప్రజల్లోకి వెళ్లలేని పరిస్తితిలో ఉన్నాడు
- వైఎస్ కుటుంబం అనే మంచి మొక్క మీద పెరిగి కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఆదినారాయణరెడ్డి
- వైఎస్ కుటుంబం అనే మంచి మొక్క మీద పెరిగి వారి కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచిన ఆదినారాయణ రెడ్డి
- దేవగుడి కుటుంబాన్ని నమ్మే పరిస్తితిలో జనాలు లేరు
3:10 PM, Mar 3rd, 2024
చంద్రబాబును ఆర్యవైశ్యులు దగ్గరకు రానివ్వరు: వెలంపల్లి శ్రీనివాస్
- నేను 20 రోజుల్లో ఎమ్మెల్యే అయ్యాను
- 2009లో నా రాజకీయ జీవితం ప్రారంభమైంది
- కోగంటి సత్యంకు మాకు రాజకీయ విభేదాలు లేవు
- బోండా ఉమా ఎన్నో విధాలుగా నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు
- బోండా ఉమా నన్నేం చేయలేడు
- సెంట్రల్ నియోజకవర్గంలో ఆర్యవైశ్యుల అండతో 40 వేల మెజార్టీతో గెలుస్తాం
- ఆర్యవైశ్యు లకు సీఎం జగన్ అండగా ఉంటారు
- సీఎం జగన్ ముగ్గురు ఆర్యవైశ్యు లకు అవకాశం కల్పించారు
- చంద్రబాబు ప్రభుత్వంలో ఆర్యవైశ్యలకు అభివృద్ధి లేదు
- చింతామణి నాటకం బ్యాన్ చేసింది.. సీఎం జగన్
- చంద్రబాబు ఎందుకు చింతామణి నాటకం ఆపలేదు
- రఘురామకృష్ణం రాజు చింతామణి నాటకం మళ్లీ విడుదల చేయాలని రాద్ధాంతం చేస్తున్నాడు
- ఆర్థికంగా వెనుక బడిన వర్గాలకు సీఎం జగన్ అండగా ఉన్నారు
- సీఎం జగన్ నాకు సెంట్రల్ నియోజకవర్గం సీటు ఇచ్చారు.
- నెల రోజుల నుండి బోండా ఉమాకి చెమటలు పడుతున్నాయి
- బోండా ఉమాకి ఓటమి భయం పట్టుకుంది
- చంద్రబాబుకి ఓటు వేస్తే ప్రయోజనం లేదు
- అందరు ఫ్యాన్ గుర్తికే ఓటు వేయండి.
- పశ్చిమ నియోజకవర్గం సీఎం జగన్ నాయకత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం
- సెంట్రల్ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో గెలుస్తున్నాం.
- 2009-2024 నా ఆస్తుల చూడండి.
- బోండా ఉమా దుర్మార్గుడు
- బోండా ఉమా మాటలు ఎవరూ నమ్మొద్దు
2:17 PM, Mar 3rd, 2024
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ కంచుకోట: ఎంపీ కేశినేని
- పశ్చిమ నియోజకవర్గానికి అభ్యర్ధి షేక్ ఆసిఫ్
- అభ్యర్ధిని మారుస్తారనేది అపోహలు పెట్టుకోవద్దు
- రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైన ప్రాంతం పశ్చిమ నియోజకవర్గం
- నేను మొదటిసారి ఎంపీగా గెలిచినపుడు 13 వేల మెజార్టీ పశ్చిమ నుంచే వచ్చింది
- రెండవ సారి ఎంపీగా గెలిచినపుడు 9 వేల మెజార్టీ పశ్చిమ నుంచే వచ్చింది
- ఈసారి కూడా గెలుపు మనదే
- పశ్చిమ నుంచి గెలిచిన వెలంపల్లి శ్రీనివాసరావు జగన్‌మోహన్‌రెడ్డి సహకారంతో ఎంతో అభివృద్ధి చేశారు
- షేక్ ఆసిఫ్ అంటే సీఎంకు చాలా ఇష్టం
- ఓసీ మేయర్ సీటులో బీసీ మహిళను కూర్చోబెట్టిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిది
- కృష్ణాజిల్లా జడ్పీ చైర్మన్ బీసీ మహిళకు కేటాయించారు
- సోషల్ ఇంజనీరింగ్ చేయడంలో జగన్ మోహన్ రెడ్డి నెంబర్ వన్ లీడర్
- కరోనా సమయంలోనూ ఇచ్చిన మాటను తప్పకుండా పనిచేసిన కమిట్ మెంట్ ఉన్న నాయకుడు జగన్
- సంక్షేమం పేరుతో అభివృద్ధి చేయడం లేదని చంద్రబాబు విమర్శిస్తున్నారు
- చంద్రబాబు వంద కోట్లైనా విజయవాడకు ఇచ్చాడా?
- డ్రైనేజ్ వ్యవస్థ కోసం 400 కోట్లు తెస్తే...ఆ నిధులను చంద్రబాబు నిర్లక్ష్యం చేశారు
- నా పలుకుబడి ఉపయోగించి నిధులు తెచ్చినవే
- చంద్రబాబుతో చర్చకు నేను సిద్ధం
- రియల్ ఎస్టేట్ వ్యాపాపరం కోసం 33 వేల ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నాడు
- తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ,కోర్టు తప్ప ఐదేళ్లలో నువ్వు కట్టిందేంటి
- నేను వైఎస్సార్‌సీపీలోకి వచ్చాక 100కు పైగా సచివాలయాలు ప్రారంభించా
- అమరావతి కోసం చంద్రబాబు 3వేల కోట్లైనా ఖర్చు చేశాడా అని ప్రశ్నిస్తున్నా
- ప్రతీ గ్రామానికి ఒక సచివాలయం కట్టి జగన్ ప్రజలకు మంచి పాలన అందిస్తున్నారు
- 80 వేల కోట్లతో మెడికల్ కాలేజ్‌లు కట్టిస్తున్న వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి
- జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సంక్షేమాన్ని చెప్పుకోవడంలో మనం వెనకబడ్డాం
- చంద్రబాబు ఏం చేశాడో...ఈ ఐదేళ్లలో జగన్‌మోహన్‌రెడ్డి ఏం చేశారో ప్రజలకు మనం వివరించాలి
- అభివృద్ధి అంటే బిల్డింగ్‌లు, హోటళ్లు కాదు
- మానవ అభివృద్ధే అసలైన అభివృద్ధి
- చంద్రబాబు,రామోజీరావుకు జగన్ చేసే అభివృద్ధి కనిపించదు
- చంద్రబాబును సీఎంగా చేసుకోవడమే ఈనాడు లక్ష్యం
- సామాన్యులను పదవుల్లో కూర్చోబెట్టిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిది
- విజయవాడ వెస్ట్,మైలవరం,తిరువూరులో 30 వేల మెజార్టీతో గెలవబోతున్నాం
- పవన్‌ను చూస్తే నిజంగా జాలేస్తోంది
- కేవలం 24 సీట్ల కోసం చంద్రబాబు, లోకేష్ నాయుడి దగ్గర జనసేన కార్యకర్తల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడు
- 2009లో పంచలూడగొడతానన్నాడు
- ఇప్పుడు పాతాళానికి తొక్కేస్తానంటున్నాడు
- జగన్‌మోహన్‌రెడ్డిపెట్టిన అభ్యర్ధుల పై ఓడిపోయి ప్రగల్భాలు పలుకుతున్నాడు
- గ్లాసు గుర్తును ఓడించడానికి చంద్రబాబు చాలు
- పవన్ నిలబెట్టిన 24 మంది అభ్యర్ధుల్ని చంద్రబాబే ఓడిస్తాడు
1:30 PM, Mar 3rd, 2024
చంద్రబాబు, పవన్‌పై ఆదిమూలపు సెటైర్లు..
- పొత్తులు ఉదయించే సూర్యుడు అనుకొంటాన్నారు.
- అస్తమించే సూర్యుడు అని తెలుసుకోవాలి
- పార్టీ పెట్టిన వాళ్లు ముఖ్యమంత్రి కావాలనుకొంటారు.
- చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం కోసం పార్టీ పెట్టిన నేత పవన్ కళ్యాణ్
- ఇంతవరకూ ఎక్కడ పోటీ చేస్తాడో తెలియని వ్యక్తి సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నాడు.
- పవన్ స్థానమేంటో ముందు తెలుసుకోవాలి.
- పవన్ వామనుడు అయితే చంద్రబాబు బలిచక్రవర్తి.
- అది పవన్‌కు త్వరలోనే అర్దం అవుతుంది
12:40 PM, Mar 3rd, 2024
మరో డ్రామాకు రెడీ అంటున్న చంద్రబాబు.. ఎంపీ భరత్ సెటైర్లు..
- చంద్రబాబు నయా డ్రామాకు మళ్లీ తెరలేపుతున్నాడు.
- గతంలో ధర్మ పోరాట దీక్ష అని చేసి ఇప్పుడు ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకోవడానికి వెళ్తున్నాడు.
- చంద్రబాబు మళ్లీ కొత్తగా ధర్మ యుద్ధం అనే కార్యక్రమం మొదలుపెట్టాడు.
- డ్వాక్రా మహిళలకు రుణమాఫీలు చేస్తానని చేయకపోవడం ధర్మ యుద్ధమా?.
- జాబ్స్ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేయడమా ధర్మ యుద్ధమా?.
- గత ప్రభుత్వంలో పెన్షన్లు తీసుకోవాలంటే ఎలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఉందో ఒక్కసారి ఆలోచించుకోవాలి.
- చంద్రబాబును నమ్మే పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు.
- సీఎం జగన్ బటన్ నొక్కితే నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి మూడు లక్షల కోట్ల రూపాయలు వెళ్లాయి.
- సీఎం జగన్ ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వం.
- ముఖ్యమంత్రి జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక గుంట నక్కలన్నీ ఏకమవుతున్నాయి.
- ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి.
12:15 PM, Mar 3rd, 2024
చంద్రబాబు నోరులో అదుపులోకి పెట్టుకుని మాట్లాడాలి: మంత్రి కాకాణి
- నెల్లూరు జిల్లాలో పోటీ చేసేందుకు టీడీపీకి ఓటర్లు లేరు.
- ఎవరి వల్ల సామాన్య ప్రజలకు మేలు జరిగిందో చెప్పలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నారు.
- ఆత్మ స్తుతి.. పరనింద అన్నట్లుగా నిన్న చంద్రబాబు నెల్లూరులో మాట్లాడారు.
- ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి మేము సిద్ధం.. ప్రజల్ని మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు.
- చంద్రబాబు మోసగాడని.. ప్రజల్లో ఒక ఇమేజ్ ఉంది.
- గత ఐదేళ్ల కాలంలో నెల్లూరు జిల్లాకి చంద్రబాబు ఏం చేశారో చెప్పే దమ్ము ఉందా..?
- సొంత నియోజకవర్గంగా ఉన్న చంద్రగిరిలో పోటీ చేసి గెలిచే దమ్ము లేక చంద్రబాబు కుప్పానికి పారిపోయాడు.
- నారా లోకేష్‌ని తంతే మంగళగిరిలో ఎందుకు పడ్డాడు..?
- సీట్లను కూడా ప్రకటించుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు.
- పార్టీ జెండా మోసిన సొంత నేతల్ని గొంతు కోసి.. జనసేన నేతలకి టికెట్ ఇస్తున్నాడు.
- నాయకులు పార్టీ మారితే.. ఓటర్లు కూడా మారతారు అనుకోవడం చంద్రబాబు భ్రమ.
- చంద్రబాబు నాయకత్వాన్ని నెల్లూరు జిల్లా ప్రజలు అంగీకరించరు.
- తన అవినీతి అక్రమాలపై సీబీఐ విచారణకు సిద్దమని చంద్రబాబు నెల్లూరులో ప్రకటిస్తారని భావించా..
- కానీ, తోక ముడిచి బాబు పారిపోయారు.
- చంద్రబాబును జనాలు తన్ని తరిమెసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.
- మాట్లాడేటప్పుడు చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకోవాలి.
- నెల్లూరులో చంద్రబాబు తన స్థాయికి దిగజారి మాట్లాడారు.
11:40 AM, Mar 3rd, 2024
పేదలపై టీడీపీ నేతలది సవిత తల్లి ప్రేమ.. దేవినేని అవినాష్
- పేదల సొంతింటి కల నెరవేర్చడమే సీఎం జగన్ ప్రభుత్వ లక్ష్యం
- టీడీపీ నేతలది పేదలపై సవితి తల్లి ప్రేమ
- టీడీపీ హయాంలో పేదలను నిర్లక్ష్యం చేశారు
- ప్రతీ మహిళ పేరు మీదనే సీఎం జగన్ ఇంటి పట్టాలు ఇస్తున్నారు
- టీడీపీ హయాంలో ఇళ్ల పేరుతో డబ్బులు వసూలు చేసి ప్రజలను మోసం చేశారు
- పేదలకు ఇస్తున్న ఇళ్ల స్థలాలపై టీడీపీ నేతలు రాజకీయం చేయటం దుర్మార్గం
- మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 99% హామీలను జగన్ ప్రభుత్వం నెరవేర్చింది
- టీడీపీ నాయకుల చిల్లర చేష్టలు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు
- రానున్న ఎన్నికల్లో ప్రజలే టీడీపీ, జనసేన కూటమికి బుద్ధి చెబుతారు
11:00 AM, Mar 3rd, 2024
వైఎస్సార్‌సీపీ దెబ్బకు చంద్రబాబు యూటర్న్..
- వైఎస్సార్‌సీపీ రాప్తాడు సిద్ధం సభ గ్రాండ్ సక్సెస్
- రాప్తాడు తరహాలో అక్కడ మీటింగ్‌కు చంద్రబాబు ప్లాన్.
- లక్షల్లో కూడా జనం రారని తేల్చేసిన టీడీపీ నేతలు
- బీరాలకి పోయి పరువు పోగొట్టుకోవద్దని పచ్చ నేతల హితవు.
- భయంతో ఉన్నఫళంగా పెనుకొండకి సభా స్థలి మార్పు.
ఫిబ్రవరిలో 10 లక్షల మందితో జరిగిన రాప్తాడు సిద్ధం జగనన్న స్టామినాని ఈ ప్రపంచానికి చాటింది
— YSR Congress Party (@YSRCParty) March 2, 2024
పోటీగా అక్కడే ఓ సభ పెట్టాలనుకున్నా.. జనం రాకపోతే పరువు పోతుందని బాబు యూటర్న్..!#TDPJSPCollapse#MosagaduBabu#PoliticalBrokerPK#EndOfTDP pic.twitter.com/ExUHTW4Y78
10:30 AM, Mar 3rd, 2024
చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి కౌంటర్
- సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన సీఎం జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందాం.
- అబద్ధపు హామీలతో మరోసారి ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు మీ ముందుకు వస్తున్నాడు.
- గతంలో ఇచ్చిన 600 హామీలలో ఏ ఒక్క హామీ అయిన నెరవేర్చాడా?.
- నావల్ల మంచి జరిగిందని అనిపిస్తేనే నన్ను ఆశీర్వదించండి అంటూ సీఎం జగన్ మీ ముందుకు వస్తున్నాడు
- సంక్షేమ పథకాలు అమలు కావాలంటే అది సీఎం జగన్‌తోనే సాధ్యం. మోహన్ రెడ్డి తోనే మాత్రమే సాధ్యం.
10:00 AM, Mar 3rd, 2024
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రెండోరోజు ప్రారంభమైన జిల్లాల వారీ సమావేశాలు
- నేడు 11 పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో సమీక్షించనున్న శివప్రకాష్ జీ
- ఒంగోలు, నెల్లూరు, బాపట్ల పార్లమెంట్ నేతలతో సమీక్షలు ప్రారంభం
- మధ్యాహ్నం నుంచి అనకాపల్లి, విజయనగరం, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు, మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని నేతలతో సమీక్ష
- నిన్న 14 పార్లమెంట్ పరిధిలో సమీక్షలు పూర్తి
- నిన్న 14 లోక్‌సభ స్ధానాలు, 98 అసెంబ్లీ స్ధానాలకి పూర్తైన అభ్యర్దుల ఎంపిక
- ప్రతీ అసెంబ్లీ, లోక్‌సభ స్ధానాలకి ముగ్గురేసి చొప్పున అభ్యర్ధుల ఎంపిక
- స్ధానిక రాజకీయ పరిస్ధితులు, సామాజిక వర్గాల వారీ ఓటర్లు, పార్టీ స్ధితిగతులపై సమీక్షించిన తర్వాత అభ్యర్ధుల ఎంపిక
9:30 AM, Mar 3rd, 2024
టీడీపీ నేత ఓవరాక్షన్..
- వాలంటీర్‌పై టీడీపీ నేత ప్రవీణ్‌రెడ్డి ఓవరాక్షన్ కామెంట్స్..
- ఈడ్చుకెళ్లి వాలంటీర్లను కొడతామని ప్రవీణ్ అనుచిత వ్యాఖ్యలు...
- స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మహిళా వాలంటీర్.
- నీకు రంగస్థలం సినిమా చూపిస్తామంటూ కౌంటర్
నీకు రంగస్థలం సినిమా చూపిస్తామంటూ మహిళా వాలంటీర్ కౌంటర్🔥
— YSR Congress Party (@YSRCParty) March 2, 2024
అంకుశం సినిమాలో రామిరెడ్డిని ఈడ్చుకెళ్లి కొట్టినట్టు కొడతానని గ్రామ వాలంటీర్లను బెదిరించిన ప్రొద్దుటూరు టీడీపీ నేత ప్రవీణ్‌రెడ్డి#APVillageWarriors#APVolunteers #TDPGoons#EndOfTDP pic.twitter.com/q6xbwcjlsH
8:30 AM, Mar 3rd, 2024
ఏపీ బీజేపీలోని తెలుగు నేతలకి ఝలక్
- మరోసారి ఒంటరి పోటీపై స్పష్టమైన సంకేతాలిచ్చిన బీజేపీ హైకమాండ్
- సమావేశంలో పొత్తులపై ఎక్కడా చర్చించలేదని కుండబద్దలు కొట్టిన బీజేపీ
- ఎన్నికల కసరత్తులు, అభ్యర్దుల ఎంపికపై జిల్లాల వారీ బీజేపీ జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ జీ నేతృత్వంలో సమావేశాలు
- తొలిరోజు 14 పార్లమెంట్ నియోజకవర్గాలలో సమీక్ష పూర్తి
- నేడు మిగిలిన 11 పార్లమెంట్ నియోజకవర్గాలపై సమీక్షించనున్న శివప్రకాష్ జీ
- పొత్తులపై చర్చించామని, పొత్తులు కోరుకుంటున్నట్లు సమావేశంలో చెప్పామన్న సీఎం రమేష్, ఆదినారాయణ రెడ్డి, విష్ణుకుమార్ రాజు
- టీడీపీ, జనసేనతో పొత్తులో వెళ్లి 2014లో గెలిచామని, 2024లో మరోసారి పొత్తులో వెళ్తామని విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు
- సమావేశంలో అసలు పొత్తుల ప్రస్తావన రాలేదని బీజేపీ ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ ప్రకటన
- 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్ధానాలలో పోటీపై కసరత్తులు జరుగుతున్నాయన్న శివన్నారాయణ
8:00 AM, Mar 3rd, 2024
చంద్రబాబు ‘ఫ్యామిలీ’ డ్రామా
- కుటుంబానికి ఒక్క సీటే పేరుతో బాబు రాజకీయం
- అదే సూత్రంతో జేసీ, పరిటాల, అయ్యన్నలకు చెక్
- తమతోపాటు తమ వారసులకు సీట్లు ఇవ్వాలని కోరుతున్న ఆ కుటుంబాల సీనియర్లు
- పనబాకకు కూడా చెప్పిందొకటి, చేసేదొకటి
- ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే సీటిస్తానని చంద్రబాబు పట్టు
- కానీ, తన కుటుంబంలో మాత్రం నలుగురికి కేటాయింపు
- తనతో సహా తన కుమారుడు, బావమరిది, బావమరిది అల్లుడికి సీట్లు
- అలాగే, కింజరాపు కుటుంబంలోనూ ఇద్దరికి..
- మాకో నిబంధన, చంద్రబాబుకో నిబంధనా అంటూ సీనియర్ల రుసరుస
7:30 AM, Mar 3rd, 2024
పవన్‌ను నమ్ముకుంటే గోదారే!
- తాడేపల్లిగూడెం సభ అనంతరం గోదావరి జిల్లాల్లో జనసైనికుల డీలా
- చంద్రబాబు మాయలో పడి తమను కించపర్చడంపై కేడర్‌లో తీవ్ర అసంతృప్తి
- తాను పోటీ చేసే స్థానంపై స్పష్టత ఇవ్వకపోవడంతో పవన్‌పై సన్నగిల్లుతున్న నమ్మకం
- జారుకుంటున్న ఆశావహులు.. గోదావరి జిల్లాల్లో పడిపోతున్న గ్రాఫ్
- తణుకులో స్తబ్దుగా విడివాడ.. కొత్తపల్లి చేరికతో నరసాపురంలో గ్రూపు రాజకీయాలు
- వైఎస్సార్‌సీపీలోకి చేగొండి చేరికతో పాలకొల్లు, ఆచంటలో ప్రభావం
7:15 AM, Mar 3rd, 2024
బాబు ప్లాన్.. పచ్చ బ్యాచ్ సీనియర్ల పడిగాపులు..
- టీడీపీ రెండవ జాబితా కోసం పడిగాపులు
- దేవినేని ఉమాకు సీటు కష్టమేనంటున్న బాబు
- ఇరకాటంలో యరపతినేని, పొత్తు పోటులో బండారు సత్యనారాయణ
- స్థానిక నేతల వ్యతిరేకతతో చింతమనేనికి ఎసరు
- ఇరకాటంలో జేసీ బ్రదర్స్
- ఎంపీ సీట్లపైనా చంద్రబాబు దోబూచులాట
- బీజేపీతో పొత్తుపై స్పష్టత వచ్చేదాకా ఏమీ చెప్పలేనంటున్న బాబు
7:00 AM, Mar 3rd, 2024
చంద్రబాబు రాజకీయం.. ఇచ్చుకో.. దండుకో
- డబ్బుతో రండి.. అధికారంలోకి వస్తే దండుకోండి
- బడాబాబులకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఓపెన్ ఆఫర్
- రూ.కోట్లు ఇచ్చే ఎన్నారైలు, కాంట్రాక్టర్లు, రియల్టర్లు, వ్యాపారులకే టికెట్లలో పెద్దపీట
- పెమ్మసాని, వెనిగండ్ల రాము, అమిలినేని సురేంద్రబాబు, కాకర్ల సురేష్ లకు రెడ్‌కార్పెట్
- అధికారంలోకి వస్తే ప్రజాధనాన్ని దోచుకునే వెసులుబాటు కల్పిస్తానంటూ బాబు భరోసా
- మరింతమందికి గాలం వేసేందుకు బాబు, చినబాబు రకరకాల పన్నాగాలు.. రాయ‘బేరాలు’
- ‘సిద్ధం’ సభలు సూపర్ హిట్.. టీడీపీ– జనసేన సభ అట్టర్ ఫ్లాప్‌తో వెనుకంజ
- వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయమని టైమ్స్ నౌ, జీన్యూస్ వంటి డజనుకు పైగా సంస్థల సర్వేల్లో వెల్లడి
- ఓటమి భయంతో ముందుకురాని ‘పెట్టుబడి’దారులు
- వారిలో ఉత్సాహం నింపేందుకే వైఎస్సార్‌సీపీ నుంచి బయటకు పోయినవారితో చేరికల తతంగం
- 2014లో భారీగా పెట్టుబడి పెట్టిన పొంగూరు నారాయణ.. ప్రతిఫలంగా ఎమ్మెల్సీని చేసి కేబినెట్లో కీలక మంత్రి పదవి కట్టబెట్టిన బాబు
- ఈసారి రూ.900 కోట్లు సమకూర్చిన వైనం
6:50AM, Mar 3rd, 2024
బాపట్ల సిద్ధం సభలో వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో
- వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోకు రంగం సిద్దమైంది.
- ఈనెల పదో తేదీన బాపట్లలోని మేదరమీట్ల వద్ద సిద్ధం సభలో మేనిఫెస్టో విడుదల
- వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోను విడుదల చేయనున్న సీఎం జగన్
- సిద్ధం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ విజయసాయిరెడ్డి.
- విజయసాయి కామెంట్స్..
- సిద్ధం సభలో నాలుగు సంవత్సరాల పదినెలల్లో మేము చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తాం.
- గతంలో ఏం చేశాం.. రాబోయే కాలంలో ఏం చేస్తామో సీఎం జగన్ వివరిస్తారు.
- ఈ సిద్దం సభకు 15లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నాం.
- సిద్ధం సభలకు ప్రజల నుంచి స్పందన బాగా ఉంది.
- ఒక దానిని మించి ఇంకో సభలకు ప్రజలు పోటెత్తుతున్నారు.
- వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం వైఎస్సార్‌సీపీ ఏం చేసిందో ప్రజలకు బాగా తెలుసు.
- బీసీల కోసం పాటుపడిందెవరో బీసీలకు బాగా తెలుసు.
- సిద్ధం సభకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సభను నిర్వహిస్తాం.
- మార్చి పదో తేదీ తర్వాత ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
6:40 AM, Mar 3rd, 2024
ముద్రగడ, హరిరామ జోగయ్యపై జనసేన నేతల ఫైర్
- పొత్తును చెడగొట్టాలని చూస్తున్నారని జనసేన ఆగ్రహం
- పవన్ కుటుంబాన్ని తిట్టినప్పుడు లేఖలు ఎందుకు రాయలేదు?
- 30 ఏళ్ళ క్రితం కాపులు వేరు.. ప్రస్తుతం కాపులు వేరు
- కన్న కొడుకులకి సలహాలు ఇవ్వలేరు.. పవన్ కు లేఖలు రాస్తారా?
- పవన్ కల్యాణ్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం: కిరణ్ రాయల్
6:30 AM, Mar 3rd, 2024
మూడు సిద్ధం సభలు చూసి టీడీపీ-జనసేన చల్లబడ్డాయి: మంత్రి అంబటి రాంబాబు
- జగన్‌ను ఎదిరించగలిగే స్థాయిలో జెండా సభ లేదు
- రెండు పార్టీలు కలిసినా వైసీపీని ఎదిరించలేవు
- ఇక ఈనెల 10న నాలుగో సభతో విపక్షాల రాజకీయానికి ముగింపే
- చంద్రబాబును సీఎం చెయ్యడం కాపులకు ఇష్టం లేదు
- పవన్ కల్యాణ్ అయితే కాస్తోకూస్తో ఆలోచిద్దామనుకున్నారు
- టీడీపీ-జనసేన పొత్తుతో కాపుల్లో నిరాశ అలుముకుంది
- సీఎంగా జగన్ అయితేనే మంచిదని కాపుల్లో నమ్మకం వచ్చింది
- అందుకు నిదర్శనమే వైసీపీలో చేగొండి సూర్యప్రకాష్ చేరిక
Comments
Please login to add a commentAdd a comment