
ఏపీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా కొద్దీ.. పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది..
AP Elections Political Latest Updates Telugu..
9:29 PM, Feb 18th, 2024
విశాఖ :
పవన్ బుజ్జగింపు పర్వం
- మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఇంటికి పవన్ కల్యాణ్
- అభ్యర్ధుల ఎంపికపై కొణతాలతో సమావేశమైన పవన్ కల్యాణ్
- ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా కొణతాల నివాసానికి పవన్
- అనకాపల్లిలో నాగబాబు టూర్ కు దూరంగా ఉన్న కొణతాల
- నిన్న కొణతాల ఇంటికి వెళ్లిన నాగబాబు
- ఆసక్తిగా మారిన కొణతాల, పవన్ సమావేశం
- అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిగా నాగబాబు పేరు ప్రచారం కావడంతో పవన్-కొణతాల భేటీకి ప్రాధాన్యత
9:18 PM, Feb 18th, 2024
పార్టీ క్యాడర్‌ని ఉద్దేశించి వైఎస్సార్‌సీపీ అధినేత వైస్ జగన్ ట్వీట్
- మన పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటా
- అలానే ప్రజాసేవలో ఉన్న వారికి మరో రెండు మెట్లు పైకి ఎక్కే అవకాశం కల్పిస్తా
- ఈ ఐదేళ్లు ప్రజలకు మంచి పాలన అందించాం
- కాబట్టి, మనలో ఎవరు పోటీలో ఉన్నా ప్రజలు బ్రహ్మరథం పడతారు
మన @YSRCParty కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటా…
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 18, 2024
అలానే ప్రజాసేవలో ఉన్న వారికి మరో రెండు మెట్లు పైకి ఎక్కే అవకాశం కల్పిస్తా…
ఈ ఐదేళ్లు ప్రజలకు మంచి పాలన అందించాం. కాబట్టి, మనలో ఎవరు పోటీలో ఉన్నా ప్రజలు బ్రహ్మరథం పడతారు!#Siddham pic.twitter.com/wny9gwiYnj
9:17 PM, Feb 18th, 2024
మారణాయుధాలతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి
- పల్నాడు జిల్లా మంచికల్లు గ్రామంలో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు
- పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలు
- మేకపోతుల ఈశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి పరిస్థితి విషమం
- ప్రశాంతంగా ఉన్న పల్నాడులో గొడవలను రెచ్చగొడుతున్నారంటూ వైఎస్సార్‌సీపీ ఫైర్
9:05 PM, Feb 18th, 2024
విజయవాడ
- వాంబే కాలనీ 60వ. డివిజన్లోని టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరిక
- పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్.
5:00 PM, Feb 18th, 2024
గుడివాడ, గన్నవరంలో సైకిల్‌కు గాలి కొట్టే వారు లేరా?
- వెనిగండ్ల రాముపై దింపుడు కళ్లెం ఆశలు పెట్టుకున్న చంద్రబాబు
- గన్నవరంలో గ్రామాలకు రావడానికి భయపడుతున్న టిడిపి నేతలు
- నిస్తేజంగా మారిన కేడర్, అభివృద్ధి, సంక్షేమం గురించి చెబుతోన్న ప్రజలు
- పార్టీ అంతర్గత సర్వేల్లో తెలుగుదేశానికి ఎదురు గాలి
- గుడ్లవల్లేరు మండలంలో ఏది కలిసిరాక చతికిలబడ్డ టిడిపి
- నందివాడలో ఫ్యాన్ స్పీడ్‌కు సైకిల్‌కు చెమటలు
- గుడివాడ టౌన్, రూరల్ లో ఏం చేయాలో పాలుపోని స్థితిలో టీడీపీ
- వ్యతిరేకతను అధిగమించేందుకు బాబు, లోకేష్ మల్లగుల్లాలు
- కనీసం యార్లగడ్డ పట్ల సానుభూతి అయినా రాదా అంటోన్న బాబు
4:30 PM, Feb 18th, 2024
జూపూడి ప్రభాకర్ కామెంట్స్
- అంబేద్కర్‌పై నా వ్యాక్యలను ఎల్లో మీడియా వక్రీకరించింది... స్కీమ్‌లన్నీ వ్యాపారాలతో కాక దేనితో జరుగుతున్నాయ్
- రామోజీరావు, చంద్రబాబు వ్యాపారాలు వాళ్ల తాతల పేరుతో నడుపుతున్నారు
- తప్పుడు రాతలు రాస్తే అంబేద్కర్‌వాదులం తిరగబడితే ఎలా ఉంటదో చూస్తారు
- అబ్బా, కొడుకులిద్దరూ సిద్ధం సభల కుర్చీలను మడతపెడటానికి ఉపయోగపడతారు
- జగన్‌ను బచ్చా అన్నావ్.. ఆ బచ్చా పాలన దెబ్బకు ఫ్యామిలి మొత్తం వీధిన పడ్డారు
- మీ బావమరిది, సినీ హీరో పవన్ కళ్యాణ్‌ను కూడా సపోర్ట్ తెచ్చుకొన్నావ్
4:00 PM, Feb 18th, 2024
అసెంబ్లీ సీటు కోసం బుద్ధా వెంకన్న వినూత్న నిరసన
- విజయవాడ వెస్ట్ టికెట్ తనకు కేటాయించాలంటూ రక్తంతో చంద్రబాబు కటౌట్‌కు అభిషేకం
- సెలైన్ లోని రక్తాన్ని తీసి చంద్రబాబు ఫోటోపై వేసిన బుద్ధా వెంకన్న
- బుద్ధా వెంకన్న నివాసానికి భారీగా చేరుకున్న పార్టీ కార్యకర్తలు
- విజయవాడ వెస్ట్ నుంచి నన్ను తప్పించాలని కేశినేని నాని పట్టుబడుతూ వచ్చారు
- పోరాటం చేసే వారిలో నేను ఒక బ్రాండ్ పెడితే పెళ్లికూడు, పెట్టకపోతే చావుకూడు అనే మనిషిని కాను :బుద్ధా వెంకన్న
3:55 PM, Feb 18th, 2024
లోకేష్‌ది ఎర్ర బుక్ కాదు...ఎర్రి బుక్ : మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్
- భీమిలిలో భూకబ్జా జరిగిందని లోకేష్ ఆరోపిస్తున్నారు
- రెండు ఎకరాలు కబ్జా అయినట్టు నిరూపించినా లోకేష్‌కే ఇస్తాం
- లోకేష్ కు ధైర్యం ఉంటే భీమిలిలో పోటీ చేయాలి
- పవన్ ఆత్మాభిమానం లేకుండా వ్యవహరిస్తున్నారు : అవంతి శ్రీనివాస్
3:50 PM, Feb 18th, 2024
ఏపీలో పొత్తులపై బీజేపీ అధిష్ఠానం తేలుస్తుందా?
- ఒకట్రెండు రోజుల్లో స్పష్టత ఇస్తారని టిడిపి, జనసేన కోటి ఆశలు
- రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి క్లారిటీ ఇస్తుందన్న ఆశల్లో చంద్రబాబు
- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కోసం బోలెడు ప్రయత్నాలు చేస్తోన్న పురందేశ్వరీ
- విశాఖలో తర్వాత పర్యటించవచ్చు.. ముందు ఢిల్లీకి రావాలని పవన్‌కు సూచన
- ఇటు చంద్రబాబును కూడా ఢిల్లీలో అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సంకేతాలు
- ఈ జాతీయ సమావేశాలలోనే పొత్తుల అంశం తేల్చాలని పట్టుబడుతున్న పురందేశ్వరీ
- ఇప్పటికే నివేదిక సమర్పించిన పురందేశ్వరీ
3:47 PM, Feb 18th, 2024
చంద్రబాబు విమర్శలకు కరణం బలరాం కౌంటర్
- నన్ను దుర్మార్గుడిగా చంద్రబాబు అభివర్ణించారు
- నాపై అవాకులు, చవాకులు పేలారు
- చంద్రబాబులాంటి దుర్మార్గుడిని నేనింతవరుకు చూడలేదు
- నీ చరిత్ర ఏందో..నా చరిత్ర ఏందో తేల్చుకుందాం
- మీ ఆఫీస్ కు నన్ను రమన్నా వస్తా
- 2019లో నేను చీరాలకు వెళ్తానని అడగలేదు
- చీరాలలో పార్టీలకతీతంగా ప్రజలు నన్ను గెలిపించారు
- చీరాలలో నన్ను గెలిపించే సత్తా చంద్రబాబుకు ఉంటే మంగళగిరిలో లోకేష్ ఎందుకు ఓడిపోయారు:కరణం బలరాం
3:45 PM, Feb 18th, 2024
మంత్రాలయం టీడీపీలో ముదిరిన టికెట్ లొల్లి
- అసెంబ్లీ సీటు పై కన్నేసిన తిక్కారెడ్డి, రాఘవేంద్ర రెడ్డి
- టికెట్ తనకు రావడం ఖాయమని రాఘవేంద్ర రెడ్డి ప్రచారం
- టీడీపీ ఇంఛార్జి తిక్కారెడ్డికి క్లారిటీ ఇవ్వని పార్టీ అధిష్ఠానం
- అధిష్ఠానం పై తిరుగుబాటుకు సిద్ధమైన తిక్కారెడ్డి
- టికెట్ రాకపోతే టీడీపీకి ఓటమి తప్పదన్న తిక్కారెడ్డి వర్గీయులు
3:42 PM, Feb 18th, 2024
ఏపీలో పొత్తులపై బీజేపీ అధిష్ఠానం తేలుస్తుందా?
- ఒకట్రెండు రోజుల్లో స్పష్టత ఇస్తారని టిడిపి, జనసేన కోటి ఆశలు
- రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి క్లారిటీ ఇస్తుందన్న ఆశల్లో చంద్రబాబు
- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కోసం బోలెడు ప్రయత్నాలు చేస్తోన్న పురందేశ్వరీ
- విశాఖలో తర్వాత పర్యటించవచ్చు.. ముందు ఢిల్లీకి రావాలని పవన్‌కు సూచన
- ఇటు చంద్రబాబును కూడా ఢిల్లీలో అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సంకేతాలు
- ఈ జాతీయ సమావేశాలలోనే పొత్తుల అంశం తేల్చాలని పట్టుబడుతున్న పురందేశ్వరీ
- ఇప్పటికే నివేదిక సమర్పించిన పురందేశ్వరీ
3:36 PM, Feb 18th, 2024
సంక్షేమ పాలన కొనసాగాలంటే మళ్లీ జగనే రావాలి : మంత్రి ఉషశ్రీ చరణ్
- వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు గెలవడమే లక్ష్యం
- వచ్చే ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం
- సిద్ధం సభలు చూడాలంటే టీడీపీకి దడ పుడుతోంది
- మహిళా సాధికారతకు పెద్దపీట వేసిన ప్రభుత్వం మనది
3:33 PM, Feb 18th, 2024
చేతులు కలుపుతాం : సిపిఐ
- కాంగ్రెస్, సీపీఎంతో కలిసి కూటమిగా బరిలో దిగుతాం : సిపిఐ నారాయణ
- ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది : నారాయణ
- రైతుల ఇబ్బందులు బీజేపీ, మోదీకి కనిపించట్లేదు: సీపీఐ రామకృష్ణ
- దేశంలో ఉద్యోగాలు లేక యువత నిర్వీర్యమైంది
3:25 PM, Feb 18th, 2024
టీడీపీలో నూజివీడు పంచాయితీ
- నూజివీడు అభ్యర్ధిగా పార్ధసారధి దాదాపు ఖరారు చేసిన టీడీపీ
- ఈనెల 26న టీడీపీలో చేరికకు ఏర్పాట్లు చేసుకుంటున్న పార్థసారధి
- పార్థసారధి చేరికను వ్యతిరేకిస్తున్న ముద్రబోయిన
- కార్యకర్తల అభీష్టం మేరకే నిర్ణయాలు తీసుకోవాలంటున్న ముద్రబోయిన
- కార్యకర్తల సమావేశంలోనే కన్నీళ్లు పెట్టుకున్న ముద్రబోయిన
- ముద్రబోయినను ఒప్పించేందుకు చంద్రబాబు, యనమల, అచ్చెన్నాయుడు నానా పాట్లు
2:05 PM, Feb 18th, 2024
నా పనితీరును చూసి,నేను చేసిన అభివృద్ధిని చూసి నాకు ఓటు వేయండి
ఐటి ఉద్యోగులతో ఆత్మీయ సమావేశంలో వైఎస్సార్‌సీపీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి
- తిరుపతిలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నా చిన్నతనంలో మన ఊరు కూడా పెద్ద నగరాలుగా ఉండాలని కోరుకున్నా
- డిప్యూటీ మేయర్ అయిన తరువాత ఆ కలను సాకారం చేస్తూ 18 మాస్టర్ ప్లాన్ రోడ్లను తీసుకువచ్చా.
- మాస్టర్ ప్లాన్ రోడ్ల వల్ల నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించగలిగా..
- టిడిపి హయాంలో కేవలం శ్రీనివాస సేతు నిర్మిస్తే చాలు అనుకున్నారు
- 56 కోట్ల రూపాయల వ్యయంతో 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు వేశాం.
- నగరంలో ట్రాఫిక్ సమస్య పూర్తిగా పరిష్కారం కావాలంటే మరో 14 మాస్టర్ ప్లాన్ రోడ్లు కావాలి
- ఈ మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసే సమయంలో నన్ను తిట్టుకున్నారు
- నేను వెనక్కి తగ్గకుండా మాస్టర్ ప్లాన్ రోడ్డు వేసిన తరువాత తిట్టిన వాళ్ళే శభాష్ అభినయ్ అని అంటున్నారు.
- గత ప్రభుత్వాలు నిర్ణయాలు అభివృద్ధి జరగాలంటే నాన్చుడు ధోరణి ఉంది.
- ఐటి కంపెనీలను తిరుపతికి తీసుకురావాలన్నది నా ధ్యేయం.
- తిరుపతిని సుందరీకరణ చేసి, మెరుగైన రోడ్లు వేస్తే ఐటి కంపెనీలు ఇక్కడికి వస్తాయి.
- మొదటగా మిడ్ సైజ్ ఐటి కంపెనీలు వస్తాయి.
- భారతదేశంలోనే పరిశుభ్రతలో తిరుపతిని నెంబర్ వన్ సిటీగా ఉంచాలన్నది నా ధ్యేయం.
- టిటిడి ఒక శాతం నిధుల పై కోర్టులో కేసు గెలుస్తామన్న నమ్మకం నాకు ఉంది.
- పరిశుభ్రమైన తిరుపతిని చేస్తాం.
- ఇండోర్ ని బీట్ చేసి పరిశుభ్రతలో తిరుపతి ఉంచుతా.
- తిరుపతిని క్రైం ఫ్రీ సిటీగా చేస్తా.
- నిఘా కెమెరాల నీడలో తిరుపతి నగరాన్ని ఉంచుతా.
- మహానగరాలకు ధీటుగా ఉండాలన్న ఉద్దేశంతోనే తిరుపతికి డబుల్ డెక్కర్ బస్సును తీసుకువచ్చా.
- తిరుపతి నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా 60శాతానికి మించి పోలింగ్ కాలేదు.
- ఈ ఎన్నికల్లో మీరు ఎక్కడ ఉన్నా పోలింగ్ రోజు వచ్చి ఓటు వేయండి.
- మీ కోసం నేను ఐదేళ్లు కష్టపడతా.
- ఇక్కడున్న ప్రధాన సమస్య కులం
- ఈ ఎన్నికల్లో కులాలను దాటి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి
- శెట్టిపల్లి భూ సమస్యను 90శాతం పూర్తి చేశాం
- వారసత్వ రాజకీయాలకు ప్రతినిధిగా నేను ఇక్కడికి రాలేదు
- నా పనితీరును చూసి, నేను చేసిన అభివృద్ధిని చూసి నాకు ఓటు వేయండి
2:05 PM, Feb 18th, 2024
చంద్రబాబు మాటలు నీటి మూటలు: మంత్రి దాడిశెట్టి రాజా
- చంద్రబాబువి అన్ని అసత్యాలు..అబద్దాలే.
- చంద్రబాబు మాట మీద నిలబడడు.
- గ్రామాల్లో మౌళిక సదుపాయాల కల్పన అభివృద్ధి కాదా?
- గ్రామాల్లోకి వచ్చి కళ్ళు పెట్టుకుని చూస్తే తెలుస్తుంది.. ఎల్లో మీడియాకి అభివృద్ధి ఏం జరిగిందో.
- వైఎస్సార్‌సీపీ పాలనలో తునిలో ప్రతి గ్రామం ప్రశాంతంగా ఉంది
- అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తామని తునిలో ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి
- అంతు చూడాలంటే మీరు అధికారంలోకి రావాలి
- నేను కళ్ళు ఎర్ర చేస్తే చాలు మీ అంతు తేలుతుంది.
- నేను ప్రతిపక్షంలో ఉండగా కళ్ళ ఎర్ర చేస్తే మీరు ఇళ్ళు వాకిలి వదిలి ఎవీ నగరంలో దాకున్నారు
- యనమల సోదరుడు కృష్ణుడుకి మంత్రి దాడిశెట్టి వార్నింగ్
1:30 PM, Feb 18th, 2024
చంద్రబాబుకు ఎమ్మెల్యే బలరాం కౌంటర్
- ఇంకొల్లు సభలో చంద్రబాబు వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బలరాం కౌంటర్
- చంద్రబాబు వల్ల నేను గెలవలేదు.
- చంద్రబాబు వంటి దుర్మార్గుడు రాజకీయాల్లో మరొకరు లేడు.
- నన్ను గెలిపించానని చెబుతున్న చంద్రబాబు.. లోకేష్‌ను ఎందుకు గెలిపించుకోలేదు.
- చంద్రబాబు హద్దుల్లో ఉండి మాట్లాడాలి.
- పరిటాల, కోడెల విషయంలో నువ్వు ఏం చేశావో నాకు తెలుసు.
- చంద్రబాబుతో ఎక్కడైనా చర్చకు సిద్ధం.
- టీడీపీలో కష్టపడి పనిచేసే నాయకులు, కార్యకర్తలకు విలువలేదు.
12:45 PM, Feb 18th, 2024
మంత్రాలయం టీడీపీలో ముదిరిన టికెట్ లొల్లి
- అసెంబ్లీ సీటుపై కన్నేసిన తిక్కారెడ్డి, రాఘవేంద్ర రెడ్డి
- టికెట్ తనకు రావడం ఖాయమని రాఘవేంద్ర రెడ్డి ప్రచారం
- టీడీపీ ఇంఛార్జ్ తిక్కారెడ్డికి క్లారిటీ ఇవ్వని పార్టీ అధిష్ఠానం
- అధిష్ఠానంపై తిరుగుబాటుకు సిద్ధమైన తిక్కారెడ్డి
- టికెట్ రాకపోతే టీడీపీకి ఓటమి తప్పదన్న తిక్కారెడ్డి వర్గీయులు
11:15 AM, Feb 18th, 2024
చంద్రబాబు, లోకేష్‌పై అవంతి శ్రీనివాస్ సెటైర్లు..
- లోకేష్ శంఖారావం సభ అట్టర్ ఫ్లాప్
- లోకేష్ సభకు స్పందన జీరో.
- ఎవరో రాసిన స్క్రిఫ్ట్ లోకేష్ చదువుతున్నాడు.
- లోకేష్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు.
- రెండు వేల ఎకరాలు భీమిలిలో కబ్జా అంటున్న లోకేష్ నిరూపిస్తే ఆ భూమి లోకేష్‌కే రాసిస్తాను.
- లోకేస్‌కు ధైర్యం ఉంటే భీమిలీలో పోటీ చేయాలి..
- ముందు లోకేష్ జ్ఞానం పెంచుకోవాలి.
- విశాఖ నగరంలో భూ కబ్జాలకు పాల్పడింది టీడీపీ నేతలు
- పవన్ కళ్యాణ్ ఆత్మాభిమానం లేకుండా వ్యవహరిస్తున్నారు.
- సీఎం పదవి ఇవ్వమన్నా.. ఛీ పొమ్మన్నా పవన్ టీడీపీ వెంటే పడుతున్నారు..
- చంద్రబాబు.. జూనియర్ ఎన్టీఆర్‌ను ఎందుకు దూరంగా పెట్టారు?.
- పవన్‌ను ఎందుకు దగ్గరకు తీసుకున్నారు..
- రాజ్యసభ సీట్లతో వ్యాపారం చేసింది చంద్రబాబు, లోకేష్.
- ఒక దళితుడుకి రాజ్యసభ సీటు ఇచ్చిన చరిత్ర సీఎం జగన్‌ది.
- లోకేష్‌ది ఎర్ర బుక్ కాదు, ఎర్రి బుక్.
10:00 AM, Feb 18th, 2024
సిద్ధం సభకు ఆశయం, లక్ష్యం ఉంది: సుధాకర్ బాబు
- మేలు చేస్తేనే ఓటు వేయండని చెప్పిన నాయకుడు సీఎం జగన్.
- ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీలో అభ్యర్థులు ముందుకు రావడం లేదు.
- చంద్రబాబు జీవితమంతా కుట్రలు, కుతంత్రాలే.
9:20 AM, Feb 18th, 2024
పవన్ కల్యాణ్‌కు షాక్..
- పవన్‌పై క్రిమినల్ కేసు నమోదు
- వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్
- గుంటూరు నాలుగో అదనపు జడ్జి శరత్‌బాబు నోటీసులు
- కోర్టు డైరెక్షన్‌తో ఐపీసీ సెక్షన్ 499, 500 కింద కేసు నమోదు
- మార్చి 25న కోర్టులో హాజరుకావాలని కోర్టు నోటీసులు
- వారాహీ యాత్రలో వాలంటీర్లపై పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు
8:50 AM, Feb 18th, 2024
పచ్చ బాబు పిచ్చి పలుకులు..
- రాజ్యసభలో టీడీపీకి భంగపాటు
- టీడీపీ 41 ఏళ్ల చరిత్రలో రాజ్యసభలో ప్రాతినిధ్యం కరువైంది.
- తాను ప్రధానులను తయారుచేశానని బాబు సెల్ప్ డబ్బాలు
- నేడు రాజ్యసభలో టీడీపీ ఉనికి సున్నా..
.@JaiTDP ని స్థాపించాక 41 ఏళ్ళలో తొలిసారి రాజ్యసభలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం కరువైంది. తాను ప్రధానులను తయారు చేశానని, వాజ్‌పేయ్ ప్రభుత్వాన్ని నిలబెట్టానని బీరాలు పలికే చంద్రబాబును ఇప్పుడు రాజ్యసభలో టీడీపీకి ఉన్న సున్నా నంబర్ వెక్కిరిస్తోంది.#EndOfTDP pic.twitter.com/AggE30OTQ0
— YSR Congress Party (@YSRCParty) February 18, 2024
8:00 AM, Feb 18th, 2024
టీడీపీ నేతలకు కొత్త కష్టాలు..
- పొత్తుల్లో పోగా మిగిలిన 100 సీట్లతో సర్దుకుందాం
- చంద్రబాబు వ్యాఖ్యలతో టీడీపీలో హాహాకారాలు
- జనసేన, బీజేపీకి 75 ఎమ్మెల్యే, 10 ఎంపీ సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి
- సిట్టింగ్‌లందరికీ సీట్లు ఇవ్వాల్సిందేనంటున్న బుచ్చయ్య
- ఆర్థిక బలం ఉన్న తమకు సీట్లు ఇవ్వాలని మరికొందరి ఒత్తిడి
- పచ్చ నేతలను మానసికంగా సిద్ధం చేస్తున్న బాబు
- పలుచోట్ల టీడీపీ సీనియర్లకు నో టికెట్!
- టికెట్ ఆశ చూపిన బాబు.. ఎన్నారై నేతల ఆందోళన
- గెలవడం కష్టమే.. ఒంటరి పోరుకు బాబు ససేమిరా
తికమక పొత్తులు | Episode - 5
— YSR Congress Party (@YSRCParty) February 17, 2024
పొత్తులు - బిల్డప్ బాబు ఏడుపులు. Part-1#TikamakaPottulu#EndOfTDP pic.twitter.com/j5cicleGdH
7:40 AM, Feb 18th, 2024
పచ్చ నేతల ప్రలోభాల పర్వం..
- హిందూపురంలో కోడ్‌కు ముందే చీరల పంపిణీ మొదలు
- అక్కడ బాలకృష్ణ ఓటమి ఖాయమని తెలిసి మహిళలను ఆకట్టుకునే యత్నం
- ఇప్పుడు గుర్తొచ్చామా అంటూ నిలదీస్తున్న ప్రజలు
- రాత్రికి రాత్రే చీరల పంపిణీ మొదలుపెట్టిన పచ్చ బ్యాచ్
- ఎమ్మెల్యే బాలకృష్ణ ఫొటోతో ఉన్న బ్యాగులో చీరలు ఉంచి మహిళలకు అందజేత
7:10 AM, Feb 18th, 2024
రాప్తాడులో నేడు సిద్ధం సభ
- నేడు వైఎస్సార్‌సీపీ ఎన్నికల సన్నాహక మూడో సభ
- 250 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో ఘనంగా ఏర్పాట్లు
- రాయలసీమలో 52 నియోజకవర్గాల నుంచి తరలివెళ్లనున్న పార్టీ శ్రేణులు
- కురుక్షేత్ర యుద్ధానికి భీమిలి వేదికగా శంఖం పూరించిన సీఎం వైఎస్ జగన్
- సముద్రంతో పోటీ పడుతూ పోటెత్తిన ఉత్తరాంధ్ర ప్రజానీకం
- ఏలూరు సభకు ఉత్తర కోస్తా నుంచి కడలిలా కదలివచ్చిన జనసంద్రం
- నేటి సభలో పార్టీ ‘సీమ’ నేతలు, కార్యకర్తలకు సీఎం దిశా నిర్దేశం
7:00 AM, Feb 18th, 2024
అబద్దాల బతుకు ఇంకెంత కాలం చంద్రబాబూ..: ఎంపీ నందిగం సురేష్
- వయసు పెరిగేకొద్దీ చంద్రబాబుకు అసహనం పెరుగుతోంది
- రాజధానిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు
- చంద్రబాబు వీరుడు, శూరుడైతే పవన్ చంక ఎందుకు ఎక్కావ్?
- ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో ఏం మాట్లాడావో ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతున్నావ్?
- రాజధానిలో పచ్చటి పొలాలను సర్వనాశనం చేసింది చంద్రబాబే
- బలవంతంగా భూసేకరణ చేయలేదని మనవడిపై ఒట్టేసి చెప్పాలి
- అబద్దాల బతుకు ఇంకెంతకాలం?
- కుప్పంలో దొంగ ఓట్లతో గెలిచే చంద్రబాబు పర్చూరు గురించి మాట్లాడటం సిగ్గుచేటు
- రాష్ట్రంలో ఉన్న చెత్త చంద్రబాబు, పవన్, ఎల్లోమీడియా అధినేతలే
- తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే చంద్రబాబు గెలిచినట్టు చంకలు కొట్టుకుంటున్నారు
- రాజధాని ఫైల్స్ పేరుతో సినిమా తీసి ఆత్మవంచన చేసుకున్నారు
- రాజధానిని కుల రాజధానిగా మార్చారు
- జగన్‌ని చూసి చంద్రబాబు భయపడుతున్నారు
- పంటపొలాలను ఎవరు కాల్చారో నార్కోటెస్టులతో తేల్చుకుందామా?
- నాలుగు వందలు చొప్పున జనానికి ఇచ్చి సభకు తెచ్చుకునే దుస్థితిలో చంద్రబాబు ఉన్నారు
- ఎస్సీలను దొంగల్లాగ చిత్రీకరించాలని చంద్రబాబు చూస్తున్నారు
- ఎస్సీలు, బీసీలతో పెట్టుకునే 2019లో ఓడిపోయాడు
- ఒళ్లంతా రోగాలని చెప్పుకుని బెయిల్ పై బయటకు వచ్చిన వ్యక్తి చంద్రబాబు
- ఆయన ప్రజకు భవిష్యత్తు ఇవ్వటమేంటి?
- రాజాధానిపై చర్చకు 24 గంటల సమయం ఇస్తున్నా
- ఎవరైనాసరే చర్చకు రావాలి
- దమ్ముంటే నా సవాల్ ని స్వీకరించాలి
6:50 AM, Feb 18th, 2024
లోకేష్ శంఖారావం యాత్ర అట్టర్ ఫ్లాప్
- విశాఖ, పెందుర్తి, భీమిలి నియోజకవర్గాల్లో లోకేష్ శంఖారావం యాత్ర అట్టర్ ఫ్లాప్
- లోకేష్ సభకు ప్రజల నుంచి స్పందన కరువు
- ఖాళీగా దర్శనమిచ్చిన కుర్చీలు
- జనాలు లేకపోవడంతో వాహనానికే పరిమితమైన లోకేష్
- రాష్ట్రస్థాయి కార్యక్రమంలా కాకుండా వార్డు కార్యక్రమంలా జరుగుతున్న లోకేష్ యాత్ర