AP Political News Jan 19th: పొలిటికల్‌ అప్‌డేట్స్‌ | AP Elections Today Political News Updates And Headlines On Jan 19th In Telugu - Sakshi
Sakshi News home page

AP Political News Jan 19th: పొలిటికల్‌ అప్‌డేట్స్‌

Published Fri, Jan 19 2024 7:02 AM | Last Updated on Fri, Feb 2 2024 8:34 PM

AP Elections Political News Updates Headlines 19th Jan 2024 Telugu - Sakshi

AP Elections Political Latest Updates Telugu

6:41 PM, Jan 19, 2024
పెత్తందారులకు దళితులంటే చులకన: సీఎం జగన్‌

  • పెత్తందారుల పత్రికలు చరిత్రను కూడా వక్రీకరిస్తున్నాయి.
  • ఎల్లో మీడియాను చూస్తే పాత్రికేయం ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు
  •  పేదవాడి పిల్లలు ఎప్పటికీ పనివాళ్లుగా ఉండిపోవాలా?
  • పేదలు చదివే ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకోకపోవడం అంటరానితనమే.
  • పేదలకు ఇళ్లు ఇస్తుంటే అడ్డుకోవడం కూడా అంటరానితనమే
  • పేదపిల్లలకు ట్యాబ్‌లు ఇస్తుంటే కుట్రపూరిత వార్తలు రాయడం అంటరానితనమే
  • దళితులకు చంద్రబాబు సెంటు భూమి కూడా ఇచ్చింది లేదు.
  • బీసీ, ఎస్సీ, ఎస్టీలపై చంద్రబాబుకు ఏ కోశానా ప్రేమలేదు
  • మన ప్రభుత్వం బడుల రూపురేఖలు మారిస్తే పెత్తందారులకు నచ్చడం లేదు
  • అంబేద్కర్‌ భావజాలం పెత్తందారులకు నచ్చదు
  • పెత్తందారులకు దళితులంటే చులకన
  • పెత్తందారీ పార్టీలకు, పెత్తందారి నేతలకు పేదలు అవసరం లేదు
  • రియల్‌ ఎస్టేట్‌ రాజధాని కోసం పేదల భూములు లాక్కున్నారు
  • రాష్ట్రాన్ని దోచుకోవడమే పెత్తందారుల లక్ష్యం
  • గతంలో చంద్రబాబు ఎందుకు బటన్‌ నొక్కలేకపోయారు
  • చంద్రబాబు ఎందుకు సామాజిక న్యాయం అమలు చేయలేకపోయారు?

4:05 PM, Jan 19, 2024
తిరుపతి.. నీదా..? నాదా.?

  • తిరుపతి సీటుపై జనసేన నేతల పట్టు
  • ఓ ప్రైవేట్ హోటల్ లో సమావేశమైన జనసేన జిల్లా నేతలు
  • జనసేన సమావేశంలో అయోమయంలో టిడిపి నేతలు
  • ఇక్కడ మేమే పోటీ చేస్తామని జనసేనకు చెప్పామంటున్న టిడిపి
  • కాదు.. కాదు.. తిరుపతిలో మా అభ్యర్థే ఉంటాడంటున్న జనసేన
  • తిరుపతిలో కుల సమీకరణాల దృష్ట్యా జనసేన అభ్యర్థి ఉండాలంటున్న ఆ పార్టీ నేతలు
  • టిడిపికి ఈ సీటు ఇస్తే.. జనసేన ఓట్లు పడవని చెబుతోన్న నేతలు
  • త్వరలోనే బూత్, వార్డు కమిటీలతో జనసేన నేతల సమావేశం

3:45 PM, Jan 19, 2024
ఫిబ్రవరి 12న స్కిల్‌ కేసు విచారణ

  • చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • కౌంటర్ దాఖలుకు 4 వారాల సమయం కోరిన చంద్రబాబు తరపు న్యాయవాది
  • ఫిబ్రవరి 9కి వాయిదా వేయాలన్న చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే 
  • ఫిబ్రవరి 9న తనకు మరో కేసు ఉందన్న ప్రభుత్వ న్యాయవాది రంజిత్ కుమార్
  • ఫిబ్రవరి 12న విచారణ చేయాలన్న హరీష్ సాల్వే విజ్ఞప్తికి అంగీకరించిన కోర్టు

3:24 PM, Jan 19, 2024
సుప్రీంకోర్టులో చంద్రబాబు స్కిల్‌ కేసు.. విచారణ వాయిదా

  • స్కిల్ కేసులో చంద్రబాబుకు హైకోర్ట్ ఇచ్చిన బెయిల్‌ను సుప్రీం కోర్టులో సవాలు చేసిన ఏపీ సీఐడీ
  • కేసు విచారణ జరిపిన జస్టిస్ బేలా ఎం త్రివేదీ, జస్టిస్ పంకజ్ మిట్టల్
  • కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరిన బాబు తరపు న్యాయవాదులు
  • ఫిబ్రవరి 12కు వాయిదా వేసిన ధర్మాసనం

2:56 PM, Jan 19, 2024
అన్నమయ్య జిల్లా కలికిరిలో టీడీపీ నేతలు గూండాగిరి

  • దళితుల గృహ నిర్మాణాలపై దాడులు
  • అర్ధరాత్రి బీభత్సం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
  • టీడీపీ జాతీయ కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రధాన అనుచరుడు అవినాష్ రెడ్డి నేతృత్వంలో దాడి
  • సర్వేనెంబర్1098/2 గృహ నిర్మాణాలను ధ్వంసం చేసిన పచ్చ మూకలు
  • కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బాధితులు
  • టీడీపీ నేత అవినాష్‌రెడ్డితో పాటు దాడిలో పాల్గొన్న వారిపై పోలీసులకు బాధితులు ఫిర్యాదు
  • తక్షణమే టీడీపీ గుండాలను అరెస్ట్ చేయాలని దళిత సంఘాలు డిమాండ్

2:40 PM, Jan 19, 2024
చంద్రబాబుకు అంబేద్కర్‌ని తాకే అర్హత లేదు: మంత్రి ఆర్కే రోజా

  • దేశంలో ఏ సీఎం చేయని సామాజిక న్యాయం వైఎస్‌ జగన్ చేస్తున్నారు
  • అంబేద్కర్ ఆశయాలను తూచా తప్పకుండా సీఎం జగన్ ఆచరిస్తున్నారు
  • అద్భుతమైన అంబేద్కర్‌ విగ్రహాన్ని సీఎం జగన్ ఏర్పాటు చేశారు
  • సీఎం జగన్‌కి వస్తున్న ప్రజా మద్దతు చూసి ఓర్వలేక పచ్చ పత్రికలు పిచ్చి రాతలు
  • చంద్రబాబు 100 అడుగుల విగ్రహం పెడతానని పెట్టకుండా అంబేద్కర్‌ని అవమానించారు
  • అంబేద్కర్ విగ్రహం కాళ్లు పట్టుకుని చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
  • ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబుకి అంబేద్కర్‌ని తాకే అర్హత లేదు

2:31 PM, Jan 19, 2024
చంద్రబాబు ‘రా కదిలిరా’ సభకు స్పందన కరువు

  • వెంకటగిరిలో టీడీపీ అధినేత చంద్రబాబు ‘రా కదిలిరా’ సభకు స్పందన కరువు
  • స్పీచ్ ప్రారంభించగానే  వెళ్లిపోయిన జనాలు
  • జనాలు వెళ్లిపోతున్నా పట్టించుకోకుండా చంద్రబాబు ప్రసంగం
  • సీఎం జగన్‌పై చంద్రబాబు అసత్య ఆరోపణలు
  •  ఖాళీగా దర్శనమిచ్చిన కుర్చీలు
  • సభ అట్టర్ ప్లాప్ కావడంతో నిరాశలో టీడీపీ క్యాడర్

1:45 PM, Jan 19, 2024
పచ్చ మీడియా ముందు ఇది తెలుసుకోండి..

సీఎం జగన్‌ పాలన అంటే ఇది..

1:13 PM, Jan 19, 2024
ఈనాడు విషపు రాతలు.. రామోజీ నీచుడు

  • అంబేద్కర్‌ విగ్రహంపై ఈనాడు విషపు రాతలు
  • వైఎస్సార్‌సీపీ ఆగ్రహం
  • ఈనాడు పేపర్‌ను తగలబెట్టిన వైఎస్సార్‌సీపీ నేతలు
  • దళితుల్ని అణిచివేసిన చంద్రబాబుకి బ్రోకర్‌ రామోజీ: మేరుగ
  • దళితుల భూముల్ని ఆక్రమించిన నీచుడు రామోజీ: మేరుగ
     

1:09 PM, Jan 19, 2024
ఈ వయసులో ఇవేం రోత రాతలు రామోజీ

  • ఈనాడు పత్రికా లేక.. ! చంద్రబాబు టాయిలెట్ పేపరా..?
  • పరిశ్రమల & ఐటీ శాఖ మంత్రి మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపాటు
  • మనందరి ముఖ్యమంత్రి జగన్ గారు విజయవాడ నడిబొడ్డున రాజ్యాంగ స్ఫూర్తికి చిహ్నంగా.. ఆకాశమంత ఎత్తున అంబేడ్కర్ మహా శిల్పం నెలకొల్పారు 
  • రామోజీకి పచ్చ కామెర్లు వచ్చాయి
  • అందుకే అంబేడ్కర్ విగ్రహంపైనా విషం చిమ్మటానికి బరితెగించాడు.
  • ఈ వయసులో ఇదేం పాడు పని.. ఇవేం రోత రాతలు రామోజీ ..!?

1:06 PM, Jan 19, 2024
జాలేస్తోంది.. యెల్లో మీడియాకు అంబటి చురకలు

  • బడుగు బాంధవుడి విగ్రహంపైనా పచ్చ మంద ఏడుపులు
  • జగన్‌కు అంబేడ్కర్‌ విగ్రహం తాకే అర్హత లేదంటూ కథనాలు
  • యెల్లో మీడియాకు వైఎస్సార్‌సీపీ నేతల కౌంటర్‌
  • ఎక్స్‌ వేదికగా జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చురకలు
  • డా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణని చూసి బోరున విలపిస్తున్నారు 
  • ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియాని చూస్తే జాలి వేస్తుందంటూ అంబటి ట్వీట్‌
     

1:00 PM, Jan 19, 2024

పిచ్చి రాతలు రాస్తే చెప్పుతో కొడతారు: కొడాలి నాని

  • అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం సందర్భంగా గుడివాడలో సంబరాలు
  • అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి, వేడుకల ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని.
  • ఎమ్మెల్యే కొడాలి నాని కామెంట్స్..
  • ప్రపంచంలో అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహం విజయవాడలో ఏర్పాటు కావడం సంతోషకరం
  • అంబేద్కర్ చూపిన మార్గంలో పయనిస్తూ, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి చేస్తున్నారు
  • జనవరి 19వ తేదీ క్యాలెండర్‌లో అంబేద్కర్ డేగా చరిత్రలో నిలిచిపోతుంది
  • ఇంతటి గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం సంతోషకరం
  • రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వ్యతిరేకంగా రామోజీ, రాధాకృష్ణ కుట్రలు చేస్తున్నారు
  • పిచ్చి రాతలు రాస్తున్న వారిద్దరూ రోడ్లపైకి వస్తే యువత చెప్పులతో కొడతారు. 

12: 40 PM, Jan 19, 2024
రామోజీ.. వయసుకు తగినట్టు నడుచుకో: మంత్రి పెద్దిరెడ్డి 

  • రామోజీరావుకు ఏం అర్హత ఉందని సీఎం జగన్‌ గురించి రాశారు. 
  • రామోజీరావు అగ్రవర్ణాల అహంకారి.  
  • వయసుకు తగ్గట్టుగా రామోజీ నడుచుకుంటే మంచింది. 
  • నేను 2009లో ఫారెస్ట్‌ మంత్రిగా పనిచేశాను. 
  • ఎర్రచందనం అక్రమ తరలింపు కట్టడికి నేనే మొదటగా చర్యలు తీసుకున్నాను. 
  • ఎవరి హయాంలో ఎర్ర చందనం స్మగ్లింగ్‌ ఎక్కువగా జరిగిందో అందరికీ తెలుసు. 
  • చంద్రబాబు హయాంలోనే ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది.
  • చంద్రబాబు తన పక్కన తెచ్చిపెట్టుకున్న కిషోర్ కుమార్  రెడ్డి ఎవరు?. 
  • 2009లో మహేశ్వర్ నాయుడు, రెడ్డి నారాయణలపై టాడా కేసులు పెట్టాం. 
  • ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి వారి పేర్లతో రామోజీరావు వార్తలు రాస్తున్నాడు. 
  • ఎన్నికల కోసమే రామోజీ తాపత్రయం. 
  • సీఎం జగన్‌ను మీరు ఎంత తిడితే ఆయనకు అంత ఆశీర్వాదం. 
  • గతంలో కంటే ఎక్కువ సీట్లను వైఎస్సార్‌సీపీ సాధిస్తుంది. 
  • చంద్రబాబుకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్ధులున్నారా? సమాధానం చెప్పాలి. 
  • మేం తీసేసినోళ్లను, పనికిరానోళ్లను చంద్రబాబు తన దగ్గర చేర్చుకుంటున్నాడు. 
  • ముఖ్యమంత్రి జగన్‌ వద్ద క్వాలిటీ లీడర్ షిప్ ఉంది. 
  • చంద్రబాబు ఏ రకంగానూ మాకు ధీటుగా లేడు.

12: 20 PM, Jan 19, 2024
రామోజీకి కడుపు మంట: మంత్రి ఆదిమూలపు సురేష్

  • చంద్రబాబుకి, ఈనాడుకి అంబేద్కర్ పేరు ఉచ్చరించే అర్హత లేదు
  • దళితుల భూములు లాక్కుని ఫిల్మ్ సిటీ కట్టిన దళిత వ్యతిరేకి రామోజీరావు
  • రామోజీరావు కడుపు మంటతో ఇష్టానుసారంగా రాతలు రాస్తున్నారు
  • ఎస్సీలుగా ఎవరు పుట్టాలని అనుకుకుంటారని చంద్రబాబు దళితులను అవమానించారు
  • 100 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెడతానని చంద్రబాబు రాజకీయం చేశాడు
  • ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్లలో విగ్రహం పెట్టడా?
  • సీఎం జగన్ అంబేద్కర్‌కు అత్యున్నత గౌరవం ఇచ్చారు
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల గుండెల్లో సీఎం జగన్ స్థానం సంపాదించారు
  • అంబేద్కర్ జీవిత చరిత్రను భావితరాలకు అందించేలా అంబేద్కర్‌ స్మృతివనం రూపొందించారు

12: 05 PM, Jan 19, 2024
పచ్చ మీడియా ఏడుపే.. ఏడుపు..

  • పచ్చ బ్యాచ్‌కు ఏదీ చాతకాదు.. ఇంకొకరు చేస్తే చూడలేరు. 
  • ఇదీ చంద్రబాబుకు మొదటి నుంచీ ఉన్న రోగమే కదా!.
  • సీఎం జగన్‌ దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. 
  • అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ లక్షలాది పేద, దళిత, గిరిజన, అణగారిన వర్గాల ఇంటి పండుగ. 
  • పచ్చ బ్యాచ్‌ మీరు ఏడుస్తూనే ఉండండి.
  • మేము ఆ వర్గాలను ప్రగతిపథం వైపు నడిపిస్తూ ముందుకు సాగుతాం: వైఎస్సార్‌సీపీ

11: 40 AM, Jan 19, 2024
అంబేద్కర్ విగ్రహం, సీఎం జగన్‌పై విషం కక్కిన ఎల్లోమీడియా

  • ఈనాడు వార్తలపై మంత్రి మేరుగ నాగార్జున ఆగ్రహం
  • తప్పుడు వార్తలు రాసిన ఈనాడు పత్రికను తగులపెట్టిన మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్
  • మంత్రి మేరుగ నాగార్జున కామెంట్స్..
  • దళితుల భూములను ఆక్రమించి ఫిల్మ్‌సిటీ కట్టుకున్న నీచుడు రామోజీ
  • దళితులను అణచివేసిన చంద్రబాబుకు రామోజీ బ్రోకర్ 
  • ఈనాడును నమ్మటం కాదు కదా.. కనీసం ఆ పత్రికను చదివే పరిస్థితులు కూడా రాష్ట్రంలో లేవు
  • చంద్రబాబుకు ఇక అధికారం రాదనే అక్కసుతో సీఎం జగన్‌పై విషం కక్కుతున్నారు. 
  • ఎంపీ నందిగం సురేష్ కామెంట్స్..
  • రాష్ట్రంలో అభివృద్ధిని తట్టుకోలేక రామోజీ విషం కక్కుతున్నాడు
  • దళితులు తమ ఇళ్లలో పాచి పనులు చేయటానికే బతకాలనేది రామోజీ, చంద్రబాబుల నైజం
  • ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ కామెంట్స్
  • అంబేద్కర్ విగ్రహావిష్కరణతో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది
  • ఇది తట్టుకోలేక రామోజీ, చంద్రబాబు ఏడుపులు పీక్ స్థాయికి చేరాయి
     

11: 20 AM, Jan 19, 2024

పచ్చ మీడియా చెత్త రాతలు.. సామాన్యుడు సీరియస్‌

  • తన కులపోడు సీఎంగా లేడని రామోజీ చెత్త రాతలు
  • ఎల్లో మీడియాపై ఉమ్మేసినంత పనిచేసిన సామాన్యుడు
  • రాష్ట్రం బాగుపడుతుంటే పచ్చ మీడియా తట్టుకోలేకపోతుందని ఆగ్రహం
     

11: 00 AM, Jan 19, 2024

ఎల్లో మీడియా అసత్య ప్రచారం నమ్మకండి: ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి 

  • చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మరు
  • వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం ఖాయం
  • పుట్టపర్తి నియోజకవర్గంలో ఆరు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి
  • 193 చెరువులకు నీటి సరఫరా చేసే ప్రాజెక్టును సీఎం జగన్‌ ఆమోదించారు. 
  • టీడీపీ, ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తోంది. 

10: 30AM, Jan 19, 2024
సీఎంవోకు వచ్చిన కాకినాడ ఎంపీ వంగ గీత

  • ఇప్పటికే వంగా గీతకు పిఠాపురం ఇన్‌చార్జ్‌ బాధత్యలు అప్పగింత
  • నియోజకవర్గ పరిస్థితిని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లనున్న వంగ గీత.

09: 53AM, Jan 19, 2024
లోకేష్‌ పెళ్లిపై చంద్రబాబు నాన్‌సెన్స్‌ అన్నారు

  • యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆసక్తికర ‍వ్యాఖ్యలు
  • గతంలో బాలకృష్ణ కూతురును లోకేష్ కు ఇచ్చి పెళ్లి చేస్తున్నారా? చంద్రబాబును అడిగా 
  • నాన్సెన్స్ అని నన్ను చంద్రబాబు తిట్టారు
  • మేనరికం సంబంధాలు మంచివి కాదని చెప్పారు
  • తరువాత లోకేష్ బాలకృష్ణ కూతురినిచ్చి చంద్రబాబు వివాహం చేశారు
  • జూనియర్ ఎన్టీఆర్ ఆకాశమంత ఎత్తు ఎదిగారు..
  • ఆకాశం మీద ఉమ్ము వేయాలని చూస్తే వారి మొహం మీదనే పడుతుంది..
  • తారక్ ప్లెక్సీలు తొలగిస్తే తారక్ ఏమీ నష్టం లేదు..
  • తారక్ పై ఎవరు విమర్శలు చేస్తే  వారికే నష్టం..
  • జూనియర్ ను ఆమె తల్లి జిజియా బాయిలా పెంచింది..
  • అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ మంచి నిర్ణయం
  • అంబేడ్కర్ దేశానికి ఒక ఐకాన్
  • సీఎం జగన్ అంటే నాకు వ్యక్తిగతంగా అభిమానం
  • సీఎం జగన్ పై పిచ్చి కేసులు పెట్టారు.
  • లక్ష కోట్లు అవినీతిని అని తప్పుడు ప్రచారం చేశారు..
  • సీఎం జగన్ ఒక హీరో
  • నేను మంచి చేస్తేనే ఓటు వేయండని దైర్యంగా చెప్పిన నేత జగన్
  • అలాంటి నేత దేశంలో మరొకరు లేరు

08: 45AM, Jan 19, 2024
175 స్థానాల్లో గెలుపే లక్ష్యం: ఉషశ్రీ చరణ్‌

  • సీఎం జగన్ ఆదేశాల మేరకు పెనుగొండలో నాకు సీటు ఇచ్చారు
  • సీఎం చేసిన సంక్షేమ పథకాలే మా పార్టీని గెలిపిస్తుంది.
  • 175 స్థానాలలో గెలవడం ఖాయం. 
  • పార్టీలో విభేదాలు లేవు, అందరం కలిసి పని చేస్తాం.

08:30AM, Jan 19, 2024
మీ బ్రతుకంతా గ్రాఫిక్స్‌లేనా? పచ్చ బ్యాచ్‌కు కౌంటర్‌

  • సంక్రాంతి వేళ పచ్చ మీడియా చెత్త రాతలు
  • ఏపీలో రోడ్లపై తప్పుడు రాతలు
  • సోషల్‌ మీడియాలో పచ్చ మీడియా చెత్త రాతలకు వైఎస్సార్‌సీపీ కౌంటర్‌

07:47 AM, Jan 19, 2024
చంద్రబాబుకు కౌంటర్‌

  • దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు అంటే..
  • దళితుల ఆత్మగౌరవాన్ని సీఎం జగన్‌ నిలబెట్టారు.
  • విజయవాడలో 206 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేసిన సీఎం 

07:47 AM, Jan 19, 2024
జగన్‌ సుపరిపాలన..  పుట్టిపర్తి ఎమ్మెల్యే పాదయాత్ర

  • నేటి నుంచి పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పాదయాత్ర
  • పుట్టపర్తి నియోజకవర్గంలో 193 చెరువులకు నీటి సరఫరా చేసే పనులకు  ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పై హర్షం
  • పుట్టపర్తి నియోజకవర్గంలో 9 రోజుల పాటు పాదయాత్ర చేయనున్న ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి
  • నల్లమాడ, ఓబుళదేవరచెరువు, అమడగూరు, పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాల్లో సాగనున్న ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పాదయాత్ర
  • జగన్ పాలన లో రైతులకు జరిగిన మేలును వివరిస్తూ పాదయాత్ర చేపట్టిన ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి

07:30 AM, Jan 19, 2024
నాలుగో జాబితా ఇన్‌ఛార్జ్‌లు వీరే..
పలు అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాలకు సంబంధించి నాలుగో జాబితా విడుదల 

07:05 AM, Jan 19, 2024
చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నాడు: మేరుగ నాగార్జున

  • అంబేద్కర్‌ స్మారక చిహ్నాన్ని సీఎం జగన్‌ ఏర్పాటు చేస్తే బాబు జీర్ణించుకోలేకపోతున్నాడు
  • రూ. 400 కోట్లు పెడితే ఎందుకంత ఖర్చు అని టీడీపీ నేతలు అవమానకరంగా మాట్లాడుతున్నారు. 
  • అంబేద్కర్‌ విగ్రహంపై చంద్రబాబు చేస్తున్న రాజకీయాలను ప్రజల్లో ఎండగడతాం. 

07:00 AM, Jan 19, 2024
‘ఉమ్మడి’గా మాయ!

  • 2014లో రాష్ట్ర ప్రజలను ఉమ్మడిగా వంచించిన చంద్రబాబు, పవన్‌ 
  • 600కు పైగా హామీలతో మేనిఫెస్టో విడుదల.. అందులో చంద్రబాబుతో పాటు పవన్‌ ఫొటో కూడా.. 
  • చంద్రబాబు సీఎం అయ్యాక హామీలన్నీ బుట్ట దాఖలు.. ఒక్క హామీ సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను నిలువునా వంచించిన ద్వయం 
  • రుణమాఫీ పేరుతో రైతులు, మహిళలను మోసం చేసిన వైనం 
  • జాబుల పేరుతో యువతకు టోకరా 
  • పింఛన్లు ఇవ్వడానికీ వృద్ధులు, దివ్యాంగులను తిప్పలు పెట్టిన ఘనులు 
  • చివరకు మేనిఫెస్టోనే వెబ్‌సైట్‌ నుంచి తొలగించేశారు.. ఇప్పుడు మళ్లీ ఇద్దరూ కలిసి మాయ చేసేందుకు యత్నం 
  • ఉమ్మడి మేనిఫెస్టో, కార్యక్రమాలు అంటూ ప్రజల ముందుకు 
     

06:45 AM, Jan 19, 2024
బాబు అవినీతిపై టీడీపీ సైలెన్స్‌!

  • 2019లో రూ.150 కోట్లు తీసుకున్నారని రాయపాటి రంగారావు ఆరోపణ
  • పోలవరం ప్రాజెక్టు పేరుతో బాబు, లోకేశ్‌ వారం వారం డబ్బు వసూలు చేశారని వెల్లడి 
  • అమరావతి జేఏసీ డబ్బు వసూలు చేశారని మరో ఆరోపణ
  • లెక్కలు చెప్పాలన్న రాయపాటి 
  • నోరు మెదపని చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలు
  • తాము చేసిన అవినీతిపై మాట్లాడితే తమకే మరింత నష్టం వస్తుందన్న ఆలోచనతో వారంతా సైలెంట్‌
  • ఇంత పెద్ద అవినీతి ఆరోపణలపై టీడీపీ, చంద్రబాబు, లోకేశ్‌ నుంచి సమాధానం రాలేదు.
  • వారు మౌనంగా ఉండటంతో డబ్బులు వసూలు చేసిన మాట నిజమేనని తెలుగుతమ్ముళ్లు సైతం అభిప్రాయం

06:30 AM, Jan 18, 2024
పరిటాల సునీతకు గట్టి షాక్‌

  • రాప్తాడు రేసులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి
  • రెండ్రోజుల్లో టీడీపీ అధిష్టానంతో భేటీ
  • పరిటాల సునీత వర్గంలో కలవరం
  • రాప్తాడులో సునీతకు అనుకూలంగా లేదని టీడీపీ ప్రచారం మొదలు
  • తమ కుటుంబానికి రెండుచోట్ల ఎమ్మెల్యే టికెట్లు వస్తున్నట్టు ప్రచారం చేసుకున్న పరిటాల సునీత
  • 2009, 2014 ఎన్నికల్లో రాప్తాడు నుంచి గెలిచిన సునీత 2019లో ఓటమిపాలు
  • నాలుగోసారి కూడా రాప్తాడు నుంచి టీడీపీ తరఫున సునీత పోటీ చేస్తారని భావిస్తూ వచ్చిన ఆమె అనుచరుల్లో సన్నగిల్లుతున్న ధీమా
  • రోజుకో సమీకరణంతో టికెట్‌ ఎక్కడిస్తారో నమ్మకం లేకుండాపోయింది.
  • మొన్నటివరకు రాప్తాడుతో పాటు ధర్మవరం టికెట్‌ తమకేనని చెప్పుకున్న పరిటాల కుటుంబం
  • ఇప్పుడు అందులో ఒక టికెట్‌పై ఆశలు వదులుకోవాల్సి వస్తుండటంతో మొదలైన కలవరం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement