
AP Elections Political Latest Updates Telugu..
5:45 PM, Jan 27, 2024
షర్మిల గురించి ఎవరిని అడిగినా చెబుతారు
- చంద్రబాబు వదిలిన బాణం షర్మిల
- షర్మిల వ్యాఖ్యలు బాధ కలిగించాయి
- తెలంగాణలో పార్టీ అని అప్పుడు తిరిగారు
- పోటీ చేయకుండానే.. ఇప్పుడు ఏపీకి వచ్చి తిరుగుతున్నారు: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
5:30 PM, Jan 27, 2024
పొత్తుల పంచాయతీ మాకొద్దు
- నెల్లూరు : జనసేనను వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అదిరింది ఫేమ్, కమెడియన్ రింగ్ రియాజ్
- వైసిపి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన ఎంపి, రూరల్ ఇంచార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి
- దివ్యాంగుల కమిటీ నెల్లూరు నగర అధ్యక్షులుగా రింగ్ రియాజ్ ను ఎంపిక చేసిన ఎం.పి ఆదాల ప్రభాకర్ రెడ్డి
5:15PM, Jan 27, 2024
తిరుగుతోంది ఫ్యాన్ హవా
- సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో కర్నూలు అభివృద్ధి : కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్
- ప్రత్యేక నిధులతో కొండారెడ్డి బురుజు ఆధునీకరణ పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులో తెచ్చాము
- అభివృద్ధి సంక్షేమ పేరుతో రెండు వేల కోట్ల రూపాయలను కర్నూలులో వెచ్చించాం
- ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కర్నూలు టిడిపి పార్టీ నేతలు ఉచితంగా అవి ఇవి ఇస్తామని ప్రజలను మభ్యపెట్టెందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
- వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు కొండా రెడ్డి బురుజు పై మరోసారి జెండా ను ఎగరేస్తాం.
4:50PM, Jan 27, 2024
సంగివలస వైఎస్సార్‌సీపీ ఎన్నికల శంఖారావంలో సీఎం జగన్
- చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు
- అందుకే దత్తపుత్రుడిని వెంట వేసుకుని తిరుగుతున్నాడు
- గత ఎన్నికల్లో వచ్చిన 23 స్థానాలు కూడా టీడీపీకి రావు
- మన మేనిఫెస్టోలో 99 శాతం హామీలను నెరవేర్చాం
- పేదరికాన్ని, అసమానతలను పోగొట్టిన బాధ్యతల ప్రభుత్వం మనది అని గర్వంగా చెబుతున్నా
- 75 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగబోతోంది
- ఆలోచన చేయండి.. ప్రతీ ఒక్కరి భుజస్కందాలపై బాధ్యత పెడుతున్నాను
- ఇంటింటికీ వెళ్లి మన ప్రభుత్వం చేసిన మంచిని చెప్పండి.. ప్రతీ పేద కుటుంబానికి వివరించండి
- ఈ యుద్ధం అబద్ధానికి, నిజానికి మధ్య జరుగుతోంది
- ఈ యుద్ధం మోసానికి, నిజాయితీకి మధ్య జరుగుతుంది
- మీరే చూడండి.. చంద్రబాబు ఇచ్చిన 650 హామీల్లో కనీసం 10 శాతం కూడా నెరవేర్చలేదు
- మన ప్రభుత్వం 99 శాతం హామీలను నెరవేర్చి ప్రజల పట్ల విశ్వసనీయతతో ఉన్నాం
- చంద్రబాబు ఏమి చేశాడో చెప్పడానికి ఏమీ కనిపించదు.. చేసింది ఏమీ లేదు కాబట్టి ఆ పెద్ద మనిషి ఏమీ చెప్పలేడు
- మన ప్రభుత్వం అలా కాదు.. ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చాం
- ఇచ్చాపురం నుంచి కుప్పం వరకూ చంద్రబాబు చేసేందేమీ లేదు
- ప్రతీ గ్రామానికి మీ బిడ్డ సంక్షేమం అందించాడు
- 56 నెలల కాలంలోనే సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించాం
3:56 PM, Jan 27, 2024
అంబేద్కర్: రాజోలు టీడీపీ కార్యకర్తల్లో అలజడి
- మలికిపురంలో టీడీపీ కార్యకర్తల సమావేశం
- విజయవాడ టీడీపీ కార్యాలయం దగ్గర మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు అనుచరుల నిరసన
- మళ్లీ సూర్యరావుకే టికెట్ కేటాయించాలని డిమాండ్
- రాజోలు టికెట్ జనసేనకు కేటాయిస్తూ పవన్ ప్రకటన
3:30 PM, Jan 27, 2024
సీఎం జగన్, పేదల సొంతింటి కలను నెరవేర్చారు: మంత్రి ధర్మాన ప్రసాదరావు
- సీఎం జగన్ పాలనలో కార్యకర్తలకు గౌరవం పెరిగింది
- చంద్రబాబు మోసపూరిత హామీలను ప్రజలు గమనించాలి
- కుల, మత పార్టీలకతీంగా అందరికీ సంక్షేమం అందించాం
3:14PM, Jan 27, 2024
టీడీపీ-జనసేన పొత్తుపై మంత్రి వేణు స్పందన
- టీడీపీ రెండు సీట్లు ప్రకటిస్తే జనసేన కూడా రెండు సీట్లు ప్రకటించడం విడ్డూరం
- టీడీపీ 150 సీట్లు ప్రకటిస్తే జనసేన కూడా 150 ప్రకటిస్తుందా?
- ఇది కేవలం దిగజారుడు రాజకీయం మాత్రమే
- మాకు ఎవరితో పొత్తు లేదు
- జనంతోనే మా పొత్తు
3:12PM, Jan 27, 2024
కృష్ణాజిల్లా:
చంద్రబాబు డ్వాక్రా మహిళలను మోసం చేశాడు: మంత్రి జోగి రమేష్
- చంద్రబాబుని నమ్మే పరిస్థితులో ప్రజలు లేరు
- ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ జగన్ నెరవేర్చారు
- జగన్‌ని ఓడించాలని యెల్లో మీడియా కుట్ర చేస్తుంది.
- ఎన్ని పార్టీలు కలిసివచ్చినా జగన్ ను ఏమిచేయలేరు
- వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జగన్ సీఎం అవుతారు
- జనం గుండెల్లో జగన్ ఉన్నారు
- వాలంటీర్ల పై చంద్రబాబు, పవన్ విషం చిమ్ముతున్నారు
- కోడి కూయకముందే వాలంటీర్సు పెన్షన్ ఇస్తున్నారు
- వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేస్తానని చంద్రబాబు అంటున్నాడు
- పెనమలూరులో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తాం
3:00, Jan 27, 2024
పొత్తు ధర్మానికి టీడీపీ తూట్లు పొడుస్తోంది: మాజీ మంత్రి హరిరామ జోగయ్య
- పొత్తులపై స్పందించిన హరిరామ జోగయ్య
- జనసేనకు 50 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాలు కేటాయించాలి.
- 20-30 సీట్లు ఇస్తే పవన్ ఆశయాలకు భంగం కలుగుతుంది.
- పొత్తు ధర్మానికి టీడీపీ తూట్లు పొడుస్తోంది.
- 2019లో ఓడిపోయిన జనసేన నేతలు అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.
- జనసేనకు తక్కువ సీట్లు కేటాయిస్తే నిరాశపరిచినట్టే.
2:40, Jan 27, 2024
టీడీపీపై పవన్ కల్యాణ్ కామెంట్స్ ఎఫెక్ట్
- టీడీపీ ఆఫీస్‌కు వచ్చిన రాజోలు, రాజానగరం టీడీపీ కార్యకర్తలు.
- ఆందోళనలో రెండు నియోజకవర్గాల టీడీపీ కేడర్.
- బొడ్డు వెంకట రమణ చౌదరి, గొల్లపల్లి సూర్యారావు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు.
- రెండు నియోజకవర్గాల కార్యకర్తలకు సర్దిచెబుతోన్న పార్టీ ముఖ్యనేతలు.
- అచ్చెన్నాయుడుతో భేటీ అయిన రాజోలు, రాజానగరం నేతలు. - సర్ధిచెప్పిన అచ్చెన్నాయుడు.
- పొత్తులో భాగంగా ఆ రెండు స్థానాలను జనసేనకు కేటాయించామని వెల్లడి.
- బొడ్డు వెంకట రమణ చౌదరి, గొల్లపల్లి సూర్యారావులతో చంద్రబాబు మాట్లాడతారన్న అచ్చెన్నాయుడు
1:55, Jan 27, 2024
చంద్రబాబులా చేసే దమ్ముందా పవన్?: మంత్రి వేణుగోపాల్
- పవన్ కళ్యాణ్ కులగణనకు అనుకులమా? వ్యతిరేకమా స్పష్టం చేయాలి
- అవగాహన రాహిత్యంతో పవన్ కులగణనపై వ్యాఖ్యలు చేశారు
- రాష్ట్రంలో సమగ్ర కులగణన చేస్తున్నాం
- బీహార్‌లో కులగణనపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగానే కులగణన జరుగుతుంది
- రాష్ట్ర పౌరుల సామాజిక, విద్యా, నివాస స్థితి తెలుసుకోవడంలో తప్పేముంది
- చంద్రబాబు, పవన్ కులగణనతో భయపడుతున్నాయి, అందుకే ఇలాంటి ప్రశ్నలు చేస్తున్నారు
- దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కులగణన ఎక్కడ జరగలేదు, ఏపీలో మాత్రమే సాహసోపేతంగా చేస్తున్నాం
- సామాజిక, న్యాయ, రూప శిల్పం అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ రోజున రాష్ట్రంలో కులగణన చేపట్టాం
- రాష్ట్రంలో 67% కులగణన పూర్తైంది.
- కోటి 20 లక్షల కుటుంబాలకు ఇప్పటికే కులగణన పూర్తయింది
- కులగణన జరిగితే బీసీలు టీడీపీకి దూరమవుతారని చంద్రబాబు బయపడుతున్నారు
- చంద్రబాబు.. జనసేన కార్యకర్తలను మోసం చేయడానికే టికెట్లు ముందు ప్రకటించారు
- చంద్రబాబు ఎనౌన్స్ చేసే సీట్ల సంఖ్యకు తగ్గట్టు పవన్ అదే సంఖ్య ప్రకటించే ధైర్యం ఉందా?
- 15 లేదా 20 సీట్లలో పవన్ దిగజారి పోటీ చేస్తారు, అంతకు మించి ఏమీ లేదు.
- సీఎం జగన్‌ను ఓడించడమే లక్ష్యంగా పవన్ పనిచేస్తున్నాడు కానీ.. ప్రజలపై చిత్తశుద్ధి లేదు.
1:40, Jan 27, 2024
చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- సత్యవేడు నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గురుమూర్తిని గెలిపించాలి
- మన నాయకుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా మంచి నిర్ణయమే తీసుకుంటారు
- ఇచ్చిన ప్రతీ హమీ, మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీ 99 శాతం అమలు చేశారు
- మన రాష్ట్రంలో ఉన్న విద్యా, వైద్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు సీఎం జగన్
- కాంగ్రెస్ పార్టీ ముసుగులో చంద్రబాబు.. వైఎస్సార్ కుటుంబాన్ని చీల్చారు
- చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌నే షర్మిల చదువుతున్నారు
- ఉరవకొండ సభలో ప్రజలే మద్దతుదారులు అని సీఎం జగన్ అన్నారు
- ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, వచ్చేది సీఎం జగన్ ప్రభుత్వమే
- 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అనేది చంద్రబాబు చెప్పాలి
- చంద్రబాబు పాలనలో జన్మభూమి సభల పేరుతో ప్రజలకు ఇబ్బంది కలిగేది.. నేడు ఆ పరిస్థితి లేదు
- 66 లక్షలు పైచిలుకు పెన్షన్లు అందిస్తున్నాం
- నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాము.
- చంద్రబాబు నాయుడు చెప్పేవి అన్నీ అబద్ధాలే, ప్రజలు ఎవరు నమ్మవద్దు
- అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట, అధికారంలో లేనపుడు మరోమాట చంద్రబాబు నైజం.
- కుప్పంలో చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదు.
- కుప్పంతో పాటు మరోచోట చంద్రబాబు పోటీ చేసే ఆలోచనలో ఉన్నాడు
1:20, Jan 27, 2024
చంద్రబాబుకు ఎమ్మెల్యే ద్వారంపూడి కౌంటర్
- ఎన్నికలకు సీఎం జగన్ సిద్దం అంటున్నారు
- మేము ఈ ఎన్నికలతో చంద్రబాబు ఖతం అంటున్నాం
- చంద్రబాబు ఖతం అయితే గత 30 ఏళ్లుగా రాష్ట్రానికి పట్టిన పీడ విరగడ అవుతుంది.
- కుట్రలు.. కుతంత్రాలు.. కులాలను విడదీసే చంద్రబాబు ఈ ఎన్నికల్లో గెలవకూడదు.
- మాట మీద నిలబడే వైఎస్ జగన్ లాంటి ముఖ్యమంత్రి దొరకడం ప్రజల అదృష్టం
1:15, Jan 27, 2024
టీడీపీ Vs జనసేన.. మరోసారి విబేధాలు..
- పిఠాపురంలో తెరపైకి లోకల్-నాన్ లోకల్ చర్చ
- టీడీపీ, జనసేన మధ్య మరోసారి బయటపడ్డ వర్గ విభేదాలు
- ఉప్పాడలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో బీసీల సమావేశం
- తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటూ జనసేన నేతల నిరసన
- పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన ఉమ్మడిగా కార్యక్రమాలు చేయాలని జనసేన నేతల డిమాండ్
- జనసేన వస్తే మంచిదేనంటూ వర్మ వివరణ
- పిలవకుండా ఎలా వస్తామంటూ జనసేన నేతల ఆగ్రహం
- సమావేశంలో లోకల్, నాన్ లోకల్ అంశాన్ని తెరపైకి తెచ్చిన అయ్యన్నపాత్రుడు
- లోకల్ అభ్యర్థి వర్మను గెలిపించాలంటూ అయ్యన్న కామెంట్స్
టీడీపీ- జనసేన మధ్య పైకి మాత్రమే పొత్తులు కనిపిస్తున్నాయి. కానీ.. లోపల మాత్రం ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు.
— YSR Congress Party (@YSRCParty) January 27, 2024
పిఠాపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ జయహో బీసీ కార్యక్రమం నిర్వహించాడు. కానీ.. దానికి @JanaSenaParty వాళ్లని పిలవలేదు. దాంతో వెళ్లి ప్రశ్నిస్తే మీకు దిక్కున్న…
12:45, Jan 27, 2024
జనసేన-బీజేపీ పొత్తుల వ్యవహారంలో మరో ట్విస్ట్..
- విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించిన బీజేపీ
- టికెట్ ఆశిస్తూ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి విష్ణుకుమార్ రాజు ప్రచారం
- మంచి ముహుర్తం ఉండటంతో ప్రచారం ప్రారంభించానంటున్న విష్ణు
- విష్ణుకుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ జీవీఎల్
- ఇప్పటికే పొత్తులో ఉన్న బీజేపీ, జనసేన
- సీట్ల సర్దుబాటుపై క్లారిటీ రాకుండానే బీజేపీ ప్రచారంతో ఆసక్తికర చర్చ
12:20, Jan 27, 2024
టీడీపీ నేతల బాధ్యతారాహిత్యం..
- ఉరవకొండలో టీడీపీ నేతల బాధ్యతారాహిత్యం
- రోడ్డుపై నేలకొరిగిన చంద్రబాబు ఫ్లెక్సీలు
- ఉరవకొండలో నేడు చంద్రబాబు రా.. కదలిరా సభ
- అనంతపురం-బళ్లారి హైవేపై నేలకొరిగిన చంద్రబాబు కటౌట్లు
- ప్రయాణికులకు తృటిలో తప్పిన ప్రమాదం
- టీడీపీ నేతలపై వాహనదారుల ఆగ్రహం
12:00, Jan 27, 2024
టీడీపీ, జనసేనపై విజయసాయి సెటైర్లు
- టీడీపీ, జనసేన పేరుకు మాత్రమే పొత్తులు ప్రకటించుకున్నారు.
- ఒకరినొకరు సంప్రదించకుండానే అభ్యర్థుల ప్రకటన జరిగింది.
- దీన్ని బట్టి చూస్తే వారి మధ్య ఏ మాత్రం సఖ్యత లేదు.
- ఇక, ఇలాంటి వారి ప్రజలు ఏం ఆశిస్తారు?.
- పొత్తులకు సంబంధించి ఇది ట్రైలర్ మాత్రమే.. ముందు చాలా ఉంది.
- ఎల్లో కూటమినే నిర్వహించలేకపోతున్నారు.. ఇక రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారు?
- ఏపీకి బలమైన, నిర్ణయాత్మకమైన, ముందుచూపు ఉన్న ప్రభుత్వం అవసరం.
- అది కేవలం వైఎస్సార్‌సీపీ, సీఎం జగన్‌తోనే సాధ్యం.
- 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీదే మరోసారి ఘన విజయం.
The declaring of candidates by the opposition coalition without consulting each other is a trailer of what can be expected of them. If they cannot manage their coalition, how can they be trusted with the state? AP needs a strong, decisive & forward looking govt. in 2024 that the…
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 27, 2024
11:50, Jan 27, 2024
బోండా ఉమాకు వెల్లంపల్లి కౌంటర్
- బోండా ఉమాకి ఎందుకు ఓటేయాలని ప్రజలే ప్రశ్నిస్తున్నారు.
- భూ కబ్జాలు, అక్రమ దందాలు, బైక్ రేసింగ్‌లు చేసినందుకా బోండా ఉమాకి ఓటెయ్యాలి.
- ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా విస్మరించాడు.
- ఇంట్లో ఉన్న బోండా ఉమాను రోడ్డు మీదకు తీసుకు వచ్చింది నేనే
- బోండా ఉమాకు భయం పుట్టి ఓటు కోసం రోడ్డుమీద తిరుగుతున్నాడు
- సెంట్రల్ నియోజకవర్గంలో డిపాజిట్లు కూడా రావని ఉమాకి అర్థమైంది
- సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం
11:45 AM, Jan 27, 2024
మేం కూడా వెన్నుపోటే పొడుస్తాం..
- అమరావతి : టీడీపీకి నాగబాబు కౌంటర్
- పవన్ ప్రకటనను సమర్దిస్తూ నాగబాబు ట్వీట్
- చర్యకు ప్రతిచర్య ఉంటుందన్న నాగబాబు
- చంద్రబాబు ఇద్దరు అభ్యర్థులను ప్రకటించాడు..
- పోటీగా ఇద్దరు అభ్యర్థులను పవన్ కల్యాణ్ ప్రకటించాడు
- విషయాన్ని నేరుగా చెప్పకుండా డొంకతిరుగుడు భాషలో సోషల్ మీడియాలో నాగబాబు పోస్టింగ్
Sharing what I'm familiar with. pic.twitter.com/iXMjzvEYFj
— Naga Babu Konidela (@NagaBabuOffl) January 26, 2024
11:30 AM, Jan 27, 2024
ఎలాగైనా ఒప్పించాలి.. పవన్‌ను ఢిల్లీకి పంపిన చంద్రబాబు
- నేడు ఢిల్లీలో పవన్ కల్యాణ్ పర్యటన
- అమిత్ షా, జేపీ నడ్డాతో భేటీకానున్న పవన్ కల్యాణ్
- ఎలాగైనా బీజేపీని ఒప్పించాలని పవన్‌కు చంద్రబాబు సూచించినట్టు సమాచారం
- బీజేపీ మనకు అండగా లేకపోతే.. అసలుకే మోసం అంటోన్న చంద్రబాబు
- పురందేశ్వరీ మన తరపున మాట్లాడుతుంది.. ఢిల్లీ పెద్దలను పవన్ ఒప్పించాలంటోన్న చంద్రబాబు
11:15 AM, Jan 27, 2024
సొంత జిల్లాలో చంద్రబాబు గట్టెక్కుతాడా?
- నేడు పీలేరు, ఉరవకొండలో చంద్రబాబు పర్యటన
- గన్నవరం నుంచి తిరుపతికి ప్రత్యేక విమానంలో చంద్రబాబు
- తిరుపతి నుంచి హెలికాఫ్టర్ లో పీలేరుకు వెళ్లనున్న చంద్రబాబు
- పీలేరు సభలో పాల్గొననున్న చంద్రబాబు
- సా.4 గంటలకు ఉరవకొండలో చంద్రబాబు బహిరంగ సభ
- రాత్రికి ఉరవకొండలోనే చంద్రబాబు బస
11:05 AM, Jan 27, 2024
కాంగ్రెస్ సీనియర్ల కోసం వెతుకులాట
- ప్రకాశం:నేడు వైఎస్ షర్మిల ఒంగోలు పర్యటన
- ఒంగోలులో కాంగ్రెస్ కార్యకర్తల భేటిలో పాల్గొననున్న షర్మిల
- ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ షర్మిల పర్యటన
11:00 AM, Jan 27, 2024
ఇది కదా అభివృద్ధి అంటే..
- పచ్చ బ్యాచ్‌కు దిమ్మ తిరిగే కౌంటర్
- నాడు అన్ని గ్రాఫిక్స్..
- నేడు శరవేగంగా పోర్టులు, ఫిషింగ్ హార్బ్లు, పరిశ్రమలు, మెడికల్ కాలేజీలు
ఇది కాదా అభివృద్ధి?#YSJaganDevelopsAP#YSJaganAgain#AndhraPradesh pic.twitter.com/DoI6XLYCwW
— YSR Congress Party (@YSRCParty) January 27, 2024
10:15 AM, Jan 27, 2024
టీడీపీ, జనసేనది అమామాస్య పొత్తు: మంత్రి కారుమూరి సెటైర్లు
- పార్టీ కేడర్ ఎన్నికలకు సిద్ధమయ్యేలా సీఎం జగన్ ఏలూరు సభ నుండి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు.
- ఏలూరు జిల్లాలో ఒకటో తేదీన ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు
- ప్రభుత్వంపై ఎల్లో మీడియా దుష్ట ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారు
- వలంటీర్ వ్యవస్థ తెచ్చి ఆడవాళ్లు గడప దాటకుండా వారికి సంక్షేమాన్ని చేర్చిన గొప్ప వ్యక్తి సీఎం జగన్
- మేము చేసిన సంక్షేమం, టీడీపీ చేసిన అవినీతి ప్రజలకు తెలియజేస్తాం
- టీడీపీ, జనసేనది అమావాస్య పొత్తు.
- జైల్లో దొంగలు లాగా కలిశారు.
- రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీకి షర్మిల తొత్తుగా మారింది.
- తెలంగాణలో పార్టీని తగలబెట్టి ఇక్కడికి వచ్చింది.
- రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరిగిందో నీతి అయోగ్ నివేదికలు చూస్తే షర్మిలకు తెలుస్తుంది
- సింహం సింగిల్‌గానే వస్తుంది.
- సోనియా గాంధీని సీఎం జగన్ ఏవిధంగా ఢీకొన్నాడో షర్మిలకు బాగా తెలుసు.
- ఆంధ్ర రాష్ట్రం మూలాలు, పోలవరం అంటే కూడా ఏమిటో షర్మిలకు తెలియదు
9:45 AM, Jan 27, 2024
చంద్రబాబుకు షాకిస్తున్న తెలుగు తమ్ముళ్లు!
- నేడు పీలేరులో రా.. కదలిరా.. చంద్రబాబు సభ
- రాజంపేటలో రానే రామంటున్న కార్యకర్తలు.
- కార్యకర్తలు రాకపోవడంతో దినసరి కూలీలను బస్సుల్లో ఎక్కించుకువెళ్తున్న దేశం నేతలు
- నేతల బలం చూపించుకునేందుకు కార్యకర్తలంటూ దినసరి కూలీలను తరలింపు..
- అన్నంపెట్టి.. వెయ్యి నగదు.. మందు ఇస్తామన్న టీడీపీ నేతలు...
- దినసరి కూలీ పనుల కోసం అనంతపురం జిల్లా గుత్తి నుంచి రాజంపేటకు వచ్చిన 1500 మంది కూలీలు
9:30 AM, Jan 27, 2024
సంగవలస సీఎం జగన్ సభకు సర్వం సిద్ధం
- ఉత్తరాంధ్ర నుంచి భారీగా సభకి తరలిరానున్న ప్రజలు
- ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా ముందుగానే అప్రమత్తమైన పోలీసులు
- శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల నుంచి వచ్చే బస్సులకు అర్. తాళ్ళవలస వైపు నుండి రావడానికి ఏర్పాట్లు చేసిన అధికారులు
- విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లా నుంచి వచ్చే బస్సులు కరోమ మార్కెట్ వైపు నుండి ఏర్పాట్లు చేసిన అధికారులు
- శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల నుంచి వచ్చే వీఐపీలు వలండపేట వైపుగా సభకి చేరుకోవడానికి ఏర్పాట్లు చేసిన అధికారులు
- విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లాల నుంచి వచ్చే కార్లు తగరపువలస వైఎస్సార్ జంక్షన్ వైపు నుంచి ప్రయాణించే విధంగా ఏర్పాట్లు
- ఆటోల్లో ప్రయాణించే వారికి వేములవలస నుంచి ప్రయాణించే విధంగా ఏర్పాట్లు
వైసీపీ కార్యకర్తలారా Song Teaser! 🎵🎶#Siddham ✊🏻 pic.twitter.com/WuNN3wPWCz
— YSR Congress Party (@YSRCParty) January 26, 2024
9:15 AM, Jan 27, 2024
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు 29 వరకు గడువిచ్చిన ఏపీ స్పీకర్
- పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని నోటీసులు
- ఈ నెల 29న స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని నోటీసులు
- ఈ నెల 29న వివరణ ఇవ్వని వారిపై చర్యలకు సిద్ధం
- 29న ఏపీ స్పీకర్ కార్యాలయంలో అనర్హత పిటిషన్లపై విచారణ
- వైసీపీ, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు విచారణకు రావాలని నోటీసులు
- ఉదయం విచారణకు రావాలని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు నోటీసులు
- మధ్యాహ్నం విచారణకు రావాలని టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు నోటీసులు
8:45 AM, Jan 27, 2024
టీడీపీ పెత్తందార్లపై యుద్ధానికి సిద్ధం..
- సైంధవుడిలా చంద్రబాబు అడ్డుపడినా..
- పేదల సొంతింటి కలను సాకరం చేసిన సీఎం జగన్
- పేదలకు జరుగుతున్న మంచిని అడ్డుకుంటున్న టీడీపీ, జనసేన
- పెత్తందార్లపై యుద్ధానికి సిద్ధమైన జగనన్న
సైంధవుడిలా చంద్రబాబు అడ్డుపడినా… పేదల సొంతింటి కలను సాకారం చేసిన జగనన్న. 🙌🏻
— YSR Congress Party (@YSRCParty) January 26, 2024
పేదలకు జరుగుతున్న ఈ మంచిని అడ్డుకుంటున్న ఈ టీడీపీ జనసేన పెత్తందారులపై యద్ధానికి సిద్ధం….✊🏻#Siddham#JaganannaIllaPattalu pic.twitter.com/igBRqTTE4C
8:00 AM, Jan 27, 2024
టీడీపీలో చేరిన ముసుగు మేధావి..
- టీడీపీలో చేరిన కొలికపూడి
- ఎట్టకేలకు ముసుగు తొలగించి, టీడీపీ కండువా కప్పుకున్న ముసుగు మేధావి
ఎట్టకేలకు ముసుగు తొలగించి, టీడీపీ కండువా కప్పేసుకున్న ముసుగు మేధావి కొలికపూడి! #EndOfTDP pic.twitter.com/E7blryj3QY
— YSR Congress Party (@YSRCParty) January 26, 2024
7:10 AM, Jan 27, 2024
పోరుకు ‘సిద్ధం’
- నేడు ‘భీమిలి’లో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
- 175కు 175 అసెంబ్లీ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యం
- టీడీపీ–జనసేన పొత్తుల జిత్తులు.. కుతంత్రాలను చిత్తు చేసేందుకు శ్రేణులకు దిశానిర్దేశం
- రాష్ట్రంలో 4 ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలతో 4 భారీ సభలు
- మొదటి సభ ఉత్తరాంధ్ర భీమిలి నియోజకవర్గం సంగివలసలో..
- శ్రేణులతో జగన్ మాటామంతి
జగనన్న పాలనలో పేదలకు జరుగుతున్న మంచిని అడ్డుకుంటున్న పెత్తందార్లపై యుద్ధానికి సిద్ధం…✊🏻
— YSR Congress Party (@YSRCParty) January 26, 2024
పేదలకు జరుగుతున్న మంచిని అడ్డుకునేందుకు జెండాలు జతకట్టే టీడీపీ, జనసేన దోపిడీదారులపై యద్ధానికి సిద్ధం….✊🏻#Siddham#JaganannaAgenda pic.twitter.com/ypxwmcgfY7
7:00 AM, Jan 27, 2024
పవన్ ఎందుకంత ఏడుపు.. భయం?
- ఎందుకు ఉలిక్కిపడుతున్నావ్ పవన్..
- ఒక కులాన్ని పట్టుకుని రాజకీయం చేయాలనుకునే నువ్వు, ఆ కులాన్ని చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టాలని చూస్తున్నదీ నువ్వు..
- ఇప్పుడు కులగణన అనగానే ఉలిక్కిపడుతున్నావ్ ఎందుకు?
- ప్రతి ఇంటికీ వెళ్లి సేవలు అందించే సచివాలయం సిబ్బంది అంటే మీకెందుకంత దుగ్ధ? ఎందుకంత భయం?
- నీకన్నా పెద్ద చదువులు చదువుకున్న సచివాలయం ఉద్యోగులు చేపడుతున్న ఈ ప్రక్రియ మీద మీకెందుకంత ఏడుపు?
- అసలు కులాల వారీగా కులగణన జరిగితేనే కదా ఏయే కులాల ఆర్థిక, సామాజిక స్థితిగతులు ఏపాటివో తెలుస్తుంది.
- అసలు ఈ కులగణన ప్రక్రియ 2011లోనే చేపట్టారు.
- ఆయా కులాల ఆర్థిక స్థోమత, వారి వెనుకబాటుతనం ఇతర వివరాలు క్రోడీకరించి కొత్త ప్రణాళికలు..
- విధానాలు అమలు చేసేందుకు ఈ కులగణన ఒక సమగ్రమైన సమాచారం అందిస్తుంది.
- ఇలాంటి సమాచారం ఉంటేనే వారి ఆర్ధిక, సామాజిక స్ధితిగతులకు అనుగణంగా ప్రభుత్వ పథకాలు అందేలా చేయవచ్చు..
- ఎవరైనా మిగిలిపోయినా వారికి కూడా పథకాలు అందించవచ్చు.
- అయినా పార్టీని అద్దెకు ఇచ్చి డబ్బు చేసుకునే నీకు ఇవన్నీ ఎలా అర్థం అవుతాయిలే!
6:50 AM, Jan 27, 2024
కాంగ్రెస్, టీడీపీకి మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్
- ఎవరో వచ్చి ఏదో చెబితే నమ్మడానికి జనం పిచ్చోళ్లు కాదు.
- తమతో ఉంటున్నదెవరో.. తమ సమస్యల కోసం పోరాడిందెవరు.. అధికారంలోకి వచ్చాక పరిష్కరించిందెవరో ప్రజలకు తెలుసు.
- ఇచ్చిన హమీలు నెరవేర్చిన నేతలు వైఎస్సార్, వైఎస్ జగన్ మాత్రమే.
- ఇక్కడే పుట్టి.. ఇక్కడే పెరిగి.. ఇక్కడే ఓటు.. ఇక్కడే ఇల్లు కట్టుకుని ప్రజల మధ్య ఉంటున్న ప్రజా నాయకుడు జగనన్న
- రాజన్న రాజ్యం తెస్తానని పావురాల గుట్టలో జగనన్న తన తండ్రికి ప్రామిస్ చేశారు.
- ఎన్ని కష్టాలు ఎదురైనా.. కేసులు పెట్టి జైల్లో పెట్టినా.. ఏరోజు తలొగ్గలేదు.
- ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు. ఏ పార్టీలో విలీనం చేయలేదు. అదీ నాయకుడి లక్షణం.
- పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టి.. ప్రజలు ఛీ కొడితే.. ఇక్కడకొచ్చి కాంగ్రెస్‌లో చేరి మాట్లాడితే ప్రజలు నమ్మరు
- కాంగ్రెస్‌కు ఏపీలో ఓటు అడిగే అర్హత లేదు.
- బాగున్న రాష్ట్రాన్ని ముక్కలు చేసిన పార్టీ కాంగ్రెస్.
- రెండు సార్లు కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన వైఎస్సార్ పేరును ఆయన చనిపోయాక ఎఫ్ఆఐర్‌లో పెట్టి అవమానించిన పార్టీ కాంగ్రెస్.
- వైఎస్సార్ లేని సమయం చూసి ఆయన కుటుంబాన్ని రోడ్డుకీడ్చింది కాంగ్రెస్.
- ఆ పార్టీలోకి వచ్చి ఎవరు విమర్శలు చేసినా జీరోలే అవుతారు.
- సామాన్య కార్యకర్తను కూడా తన కుటుంబ సభ్యుడిగా చూసే వ్యక్తి సీఎం జగన్.
- ఇష్టానుసారంగా మాట్లాడే నోర్లకు 2024 సమాధానం చెబుతుంది
6:40 AM, Jan 27, 2024
ఎల్లో బ్యాచ్ ప్రలోభాల పర్వం..
- పర్చూరులో టీడీపీ ప్రలోభాల పర్వం
- ఎమ్మెల్యే ఏలూరి నిర్వాకాలు వెలుగులోకి
- ‘నోవా అగ్రి టెక్’ కేంద్రంగా నల్లధనం పంపిణీ
- పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్లకు ఎర
- డీఆర్‌ఐ తనిఖీల్లో ఆధారాలతో బట్టబయలు
- గుట్టు రట్టు చేసిన కీలక ‘డైరీ’
- ఐటీ, ఈడీ, సెబీలకు నివేదించిన అధికారులు
ఇది చదవండి: దొంగ ఓట్లు.. ‘పచ్చ’ నోట్లు
6:30 AM, Jan 27, 2024
చంద్రబాబుకు షాక్.. పవన్ సంచలన కామెంట్స్
- టీడీపీ అభ్యర్తుల ప్రకటనపై చంద్రబాబు పొత్తు ధర్మం పాటించలేదని అసంతృప్తి
- మండపేటలో చంద్రబాబు టీడీపీ అభ్యర్థిని ప్రకటించడాన్ని పవన్ కల్యాణ్ తప్పుబట్టారు.
- టీడీపీ పొత్తు ధర్మం పాటించాలి.
- కానీ, విస్మరించి అభ్యర్థుల్ని ప్రకటించింది.
- బలం ఇచ్చేవాళ్లం అవుతున్నాంగానీ.. తీసుకునే వాళ్లం కాలేకపోతున్నాం.
- 50, 70 స్థానాలు తీసుకోవాలంటే నాకు తెలియనివికావు.
- పవన్ జనంలో తిరగడు.. వాస్తవాలు తెలియని కొందరు అంటారు.
- తెలియకపోతే రాజకీయాల్లోకి ఎలా వస్తాను?
- ఇద్దరు వ్యక్తులను కలపడం కష్టం.. విడదీయడం తేలిక.
- అందుకే నాకు నిర్మించడం ఇష్టం
- జనసేనతో పొత్తు ఉన్నప్పటికీ మండపేట అభ్యర్థిగా వేగుళ్ల జోగేశ్వరరావు పేరును చంద్రబాబు ఏకపక్షంగా ప్రకటించారు.
- టీడీపీ ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారు.
- మేము కూడా ఇద్దరు అభ్యర్థులను ప్రకటిస్తున్నాం
- రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్