![BJP Kishan Reddy Serious Comments On Congress Govt - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/01/28/kishn%20reddy.jpg.webp?itok=p0b6_FP1)
ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
గచ్చిబౌలి (హైదరాబాద్): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం ఆరు గ్యారంటీలను అమలు చేయలేదని, పార్లమెంట్ ఎన్నికల అనంతరం మొండి చెయ్యి చూపడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్‌లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లా డుతూ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని బీజేపీ అభ్యర్థులకు దాదాపు మూడున్నర లక్షల ఓట్లు వచ్చాయని, పార్టీకి ఓట్ల శాతం గణనీయంగా పెరిగిందని వెల్లడించారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే బూడిదలో పోసిన పన్నీరుగా మారుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి విజన్, కార్యాచరణ లేదని, ఇచ్చిన హమీలు అమలు చేయలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలోనే ప్రతి నెలా ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఇప్పుడు అదనంగా ఆరు గ్యారంటీలు చెప్పిన కాంగ్రెస్ వాటిని ఎలా అమలు చేస్తుందని ప్రశ్నించారు.
కాంగ్రెస్‌ను అడుగడుగునా ఎదుర్కోవాలని, బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీయే అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథ కాలను ప్రజలకు వివరింరాలని పార్టీ కేడర్‌కు దిశా నిర్దేశం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడు తూ బూత్‌స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలలో తక్కువ ఓట్లు వచ్చిన బూత్‌లపై సమీక్ష చేసుకోవా లన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం కన్వీనర్ మల్లారెడ్డి, ఇన్‌చార్జి ఏవీఎన్ రెడ్డి, నాయ కులు వీరేందర్‌గౌడ్, సునీతారెడ్డి, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment