సాక్షి,హైదరాబాద్: సినీ హీరో అల్లు అర్జున్(AlluArjun)ను సీఎం రేవంత్‌రెడ్డి(Revanthreddy) పర్సనల్‌గా టార్గెట్ చేస్తున్నాడని మాజీ మంత్రి హరీశ్‌రావు(Harishrao) ఆరోపించారు. ఈ విషయమై హరీశ్‌రావు మంగళవారం(డిసెంబర్ 24) మీడియాతో మాట్లాడారు.
‘రేవంత్‌రెడ్డి సొంత అన్న టార్చర్ వల్ల ఒక రైతు సూసైడ్ చేసుకుంటే ఇప్పటి వరకు దానిపై కనీసం కేసు నమోదు కాలేదు. రాష్ట్రంలో 50 మంది గురుకుల విద్యార్థులు చనిపోతే,రేవంత్ రెడ్డి కనీసం దాని మీద మాట్లాడలేదు. 500 మంది రైతులు, 80 మంది ఆటో డ్రైవర్లు చనిపోతే మాట్లాడటానికి రేవంత్‌రెడ్డికి సమయం లేదు. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీని టార్గెట్ చేయడానికి మాత్రం సమయం ఉంది’అని హరీశ్‌రావు అన్నారు.
కాగా, సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో హీరో అల్లుఅర్జున్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల సీఎం రేవంత్ అసెంబ్లీలో ఈ కేసు విషయమై చేసిన వ్యాఖ్యలకు అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. అనంతరం మంగళవారం అల్లు అర్జున్‌ను పోలీసులు చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో విచారించారు.
ఇదీ చదవండి: కేసీఆర్,హరీశ్‌రావులకు హైకోర్టులో ఊరట
Comments
Please login to add a commentAdd a comment