రైతు భరోసా రూ.15 వేలు అని.. రూ.12 వేలకు కుదిస్తారా?
అన్నదాతను మరోసారి దగా చేసిన కాంగ్రెస్ సర్కారు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: రైతు భరోసా పేరుతో ఏటా ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని ఆశచూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. రైతులను దారుణంగా మోసం చేసిందని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు. ఈ మేరకు శనివారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘శనివారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం రైతుల ఆశలను అడియాశలు చేసింది.
రైతు భరోసా పథకాన్ని రైతు గుండె కోతగా మార్చారు. రైతు భరోసా కింద ఎకరానికి ప్రతి సీజన్‌లో రూ.7,500 చొప్పున ఇస్తామని చెప్పి.. ఇప్పుడు రూ.6 వేలకు కుదించారు. కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి ఇది పరాకాష్ట. మోసానికి పర్యాయపదం రేవంత్‌రెడ్డి అనే విషయం నగ్నంగా బయటపడింది’అని హరీశ్‌రావు మండిపడ్డారు.
కేబినెట్‌లో కౌలు రైతుల ఊసేలేదు
కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతులకు కూడా గుండెకోత మిగిల్చిందని హరీశ్‌రావు ఆరోపించారు. ‘కౌలు రైతులకు కూడా రెండు వ్యవసాయ సీజన్లలో కలిపి ఎకరా కు రూ. 15 వేలు పంట పెట్టుబడి సహాయం అందిస్తా మని కాంగ్రెస్ ప్రమాణం చేసింది.
కానీ తాజా కేబినెట్ సమావేశంలో ఈ అంశమే చర్చించలేదు. కౌలు రైతులకు గుండె కోత కలిగిస్తూ దారుణంగా ధోకా చేశారు. తెలంగాణ రైతాంగం ఈ ద్రోహాన్ని క్షమించదు. తగిన సమయంలో బుద్ధి చెబుతారు’అని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment