
ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నరేవంత్‌రెడ్డి
పార్టీ పెద్దలను కూడా కలిసే అవకాశం.. నామినేటెడ్ పోస్టులు, కేబినెట్ విస్తరణపై చర్చ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. మంగళవారం కొత్త ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఉదయం ఆయన ఢిల్లీ వెళతారని సీఎం కార్యాలయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ కార్యక్రమానికి హాజరుకావడంతో పాటు పార్టీ పెద్దలను కూడా రేవంత్ కలిసే అవకాశాలున్నాయి.
నామినేటెడ్ పోస్టులు, టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక, కేబినెట్ విస్తరణ లాంటి అంశాలపై పార్టీ అధిష్టానం పెద్దలతో వీలును బట్టి ఆయన చర్చించే అవకాశముందని తెలుస్తోంది. ఇక, జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు.