భోపాల్ : తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని షాహ్‌డోల్‌లో ఎన్నికల ర్యాలీని ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ మాట్లాడారు.
అగ్నిపథ్ పథకం గురించి ప్రస్తావిస్తూ బీజేపీపై ప్రభుత్వంపై మండిపడ్డారు. కేవలం ఆరు నెలల శిక్షణ పొందిన అగ్నివీర్‌లు..ఐదేళ్లపాటు శిక్షణ పొందిన చైనా సైనికులపై ఎలా పోరాడాలి? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, సైనికుల కోసం పాత రిక్రూట్‌మెంట్‌ను అమలు చేస్తామని, స్వల్పకాలిక రిక్రూట్‌మెంట్ పథకాన్ని రద్దు చేస్తుందని రాహుల్ గాంధీ చెప్పారు.
రాహుల్ గాంధీ ఆశ్చర్యం
‘ఇంతకుముందు పేదలు సైన్యంలో చేరేవారు. వారికి (సైనికులు) పెన్షన్, అమరవీరుల హోదా వచ్చేవారు. క్యాంటీన్ సౌకర్యం కూడా వారికి అందుబాటులో ఉందని అన్నారు. కానీ ఇప్పుడు అలా లేవు.అగ్నివీరులు మరణిస్తే వారికి ఎలాంటి పెన్షన్ ఉండదు, క్యాంటీన్ ఉండదు. కేంద్రం అగ్నివీర్‌లను రిక్రూట్‌మెంట్ చేసుకుంటుంది. ఆరునెలల శిక్షణ ఇస్తుంది. ఇలా శిక్షణ పొందిన అగ్నివీర్ చైనా సైనుల్ని ఎలా ఎదుర్కొగలరంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
మేం అధికారంలోకి వస్తే అగ్నిపథ్‌ను రద్దు చేస్తాం
‘అగ్నివీర్ (స్కీమ్) కావాలా అని మీరు సైన్యాన్ని అడగండి. వారు ఈ పథకం వద్దు అని చెబుతారు . ఈ పథకం వల్ల మనతో పాటు దేశానికి కూడా నష్టం వాటిల్లుతోంది. అగ్నిపథ్ పథకం ప్రధానమంత్రిచే రూపొందించబడింది. పీఎంఓ ద్వారా నిర్ణయం తీసుకుంది. సైన్యం ఈ పథకానికి వ్యతిరేకం’ అని ఆయన పేర్కొన్నారు. అగ్నిపథ్‌ను రద్దు చేయాలని సైన్యం కోరుతోంది. కాబట్టి మేం అధికారంలోకి వచ్చిన వెంటనే దానిని రద్దు చేస్తామని రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ షాహ్‌డోల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment