కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు సెటైర్లు | Ex Minister Harish Rao Tweet On Congress Government | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు సెటైర్లు

May 21 2024 12:07 PM | Updated on May 21 2024 5:21 PM

Ex Minister Harish Rao Tweet On Congress Government

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఏడు వేల మంది నర్సింగ్ ఆఫీసర్ల రిక్రూట్‌మెంట్‌ ఘనతను తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. నాలుగు నెలలుగా వారికి జీతాలు మాత్రం చెల్లించడం లేదంటూ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా నిలదీశారు మాజీమంత్రి హరీశ్‌రావు.

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఏడు వేల మంది నర్సింగ్ ఆఫీసర్ల రిక్రూట్‌మెంట్‌ ఘనతను తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. నాలుగు నెలలుగా వారికి జీతాలు మాత్రం చెల్లించడం లేదంటూ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా నిలదీశారు మాజీమంత్రి హరీశ్‌రావు.

‘‘ఎల్‌బీ స్టేడియం వేదికగా అట్టహాసంగా నియామక పత్రాలు అందించి గాలికి వదిలేసింది తప్ప.. వారి జీత భత్యాల గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. దీంతో డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో నియమితులైన 4 వేల మంది నర్సింగ్ ఆఫీసర్లకు జీతాలు అందక అష్టకష్టాలు పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు‘‘ అని హరీశ్‌రావు ట్వీట్‌ చేశారు.

‘‘ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నట్లు లేని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న నాలుగు నెలల జీతాలును తక్షణం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నానని హరీశ్‌రావు అన్నారు.

కాంగ్రెస్ పై హరీష్ రావు ఫైర్

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement