ఢిల్లీ: లిక్కర్‌స్కాంకు సంబంధించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదుల్ని ఆదేశించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కార్యాలయానికి రావాలంటూ ఈడీ తనకు పంపిన సమన్లను రద్దు చేయాలని కవిత ఈ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. మహిళలను దర్యాప్తు సంస్థల ఆఫీసుల్లో ఎలా ప్రశ్నిస్తారని?.. ఇంట్లోనే విచారించాలనే అంశంపై ఆమె కోర్టును ఆశ్రయరించారు. పిటిషన్‌లో నళిని చిదంబరం కేసును సైతం ఆమె జత చేశారు.
ఈ తరుణంలో ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రతివాదులకు కౌంటర్ ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణ ఆరువారాలకు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: ఈ టైంల చిల్లర రాజకీయాలేంది?
Comments
Please login to add a commentAdd a comment