
సాక్షి, హైదరాబాద్: అమిత్ షా వ్యాఖ్యలపై మంత్రి హరీష్‌రావు స్పందించారు. ‘మాకు నూకలు చెల్లడం కాదు.. మీకు నూకలు చెల్లిపోయాయి’ అంటూ ట్వీట్ చేశారు. ‘‘తెలంగాణ ప్రజలు నూకలు తినాలని పీయూష్ గోయల్ వెక్కిరించినప్పుడే తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లిపోయాయి. బ్యాట్ సరిగా పట్టడం చేతకాని మీ అబ్బాయికి బీసీసీఐలో కీలక పదవి ఎలా వరించిందో అందరికీ తెలుసు. అమిత్‌షా.. కుటుంబ పాలన గురించి మాట్లాడటం.. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది’’ అని హరీష్‌రావు విమర్శలు గుప్పించారు.
‘‘పెద్ద ఎత్తున రైతులు ఉద్యమిస్తే కార్పొరేట్ కొమ్ముకాసే చట్టాలను ఉపసంహరించుకుని తోకముడిచిన మీరా.. కేసీఆర్‌ను విమర్శించేది. కేంద్రంలో దశాబ్ద కాలంగా నాజీలను మించిన నియంతృత్వ పాలన మీది.
బీజేపీకి సీఎం పదవి కాదు.. ముందు తెలంగాణలో సింగిల్ డిజిట్ తెచ్చుకొండి. తెలంగాణ అభివృద్ధి విషయంలో రాజీలేని యోధుడు కేసీఆర్. అమిత్‌షావి అబద్ధపు విమర్శలు.. అవుట్ డేటెడ్ ఆరోపణలు’’ అంటూ మంత్రి హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు.
చదవండి: కేసీఆర్ సర్కార్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది: అమిత్ షా
మాకు నూకలు చెల్లడం కాదు..
— Harish Rao Thanneeru (@BRSHarish) August 27, 2023
తెలంగాణ ప్రజలు నూకలు తినాలని మీ మంత్రి పియూష్ గోయల్ వెక్కిరించినప్పుడే బిజెపికి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయి
బ్యాట్ సరిగా పట్టడం చేతకాని మీ అబ్బాయికి ఏకంగా బీసీసీఐలో కీలక పదవి ఎలా వరించిందో అందరికీ తెలుసు. అలాంటిది మీరు కుటుంబ పాలన గురించి మాట్లాడడం…
Comments
Please login to add a commentAdd a comment