సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలే ఆ ప్రభుత్వానికి గుదిబండగా మారుతాయన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో కేసీఆర్ బుద్ధి చెప్పడానికివ పదేళ్ల కాలం పట్టింది కానీ, కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పడానికి కనీసం ఐదేళ్లు కూడా పట్టదు అంటూ విమర్శలు చేశారు.
కాగా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శనివారం నిరుద్యోగుల మహాధర్నాలో మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యువత ఆత్మబలిదానం చేశారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత భావించింది. గత బీఆర్ఎస్ యువత ఆశలను నట్టేట ముంచింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యూత్ డిక్లరేషన్‌తో ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. రాహుల్ గాంధీ, ప్రియాంక, రేవంత్ సభల్లో రెండు లక్షల ఉద్యోగాలు అంటూ ఉదరగొట్టారు. రుణమాఫీ కూడా రైతులను మభ్య పెట్టేలా చేశారు. ఇచ్చిన హామీ ప్రకరం అందరికీ చేయాలి కానీ.. కొంతమందికే రుణమాఫీ చేసి పాలాభిషేకం చేయించుకుంటున్నారు.
జాబ్ కాలెండర్ ఎటు పోయింది రేవంత్ రెడ్డి?. 18 ఏళ్లు నిండిన కాలేజీ అమ్మాయిలకు స్కూటీ అన్నారు మర్చిపోయారు. నిరుద్యోగ భృతి చెల్లిస్తామని నట్టెట ముంచారు. ప్రజాపాలనలో సెక్రటేరియట్‌లోకి సామాన్యులకు ఎంట్రీ లేదు. కాంగ్రెస్ పైరవీకారులకు మాత్రమే ఉంది. విద్యా భరోసా కార్డులు ఎటు పోయాయో రేవంత్ రెడ్డి చెప్పాలి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలే ఆ ప్రభుత్వానికి గుదిబండగా మారుతాయి. కేసీఆర్‌కి బుద్ది చెప్పడానికి పదేళ్లు పట్టింది కానీ, కాంగ్రెస్‌కు బుద్ది చెప్పడానికి కనీసం ఐదేళ్లు కూడా పట్టదు.
చిక్కడపల్లి లైబ్రరీకి రాహుల్ గాంధీని తీసుకెళ్ళి రేవంత్ నిరుద్యోగులకు హామీ ఇచ్చి మోసం చేస్తున్నారు. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది తెలంగాణ పరిస్థితి. కేసీఆర్ పోయి రేవంత్ అధికారంలోకి వచ్చాక ఢిల్లీ కాంగ్రెస్‌కు, రేవంత్‌కు లాభం జరిగింది. నిజమైన మార్పు రాష్ట్రంలో రాలేదు. వచ్చిన మార్పు కేసీఆర్ కుటుంబం పోయి సోనియా కుటుంబం వచ్చింది. గులాబీ జెండా పోయి చెయ్యి గుర్తు జెండా వచ్చింది. ప్రజలను దోపిడీ చేసే స్వేచ్చ కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చింది. బీఆర్ఎస్ చేసినట్లే కాంగ్రెస్ చేస్తుంది. ఎమ్మెల్యేల ఫిరాయింపులు కాంగ్రెస్ చేస్తోంది. అవినీతి పాలనలో, దోపిడీలో, ఫిరాయింపుల్లో ఎలాంటి మార్పు రాలేదు. నిరుద్యోగులకు అండగా బీజేపీ ఉంటుంది. బీజేవైం ద్వారా మా పోరాటాలు యువత కోసం కొనసాగుతాయి అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment