Minister RK Roja Comments On Chandrababu Naidu Over His Manifesto - Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు ఎప్పుడు ఏ పార్టీ జెండా మోస్తారో తెలియని పరిస్థితి’

Published Thu, Nov 17 2022 3:22 PM | Last Updated on Thu, Nov 17 2022 5:09 PM

Minister RK Roja Comments On Chandrababu - Sakshi

సాక్షి, తిరుపతి జిల్లా: పుత్తూరు మండలం పరమేశ్వర మంగళంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ  సందర్భంగా ఆమె కేక్‌ కట్‌ చేశారు. నియోజకవర్గం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.

అనంతరం ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ, 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రజలకు ఏమీ చేయలేదని మండిపడ్డారు. చంద్రబాబు ఆనాడు ఎన్టీఆర్‌ను కన్నీళ్లు పెట్టించారని, చంద్రబాబు ఎప్పుడు ఏ పార్టీ జెండా మోస్తారో తెలియని పరిస్థితి అని దుయ్యబట్టారు. మేనిఫెస్టో హామీలు నెరవేర్చని బాబు మళ్లీ అవకాశం ఇవ్వమంటున్నారని ఆమె ధ్వజమెత్తారు.
చదవండి: ‘చంద్రబాబును నమ్మరు.. 14 ఏళ్లలో ఏం చేశారో అందరూ చూశారు’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement