
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: చంద్రబాబు పచ్చి మోసగాడంటూ దుయ్యబట్టారు ఎంపీ కేశినేని నాని. ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మగౌరవం కోసం టీడీపీ స్థాపించారన్నారు. మూడు రోజుల నుంచి అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం ఢిల్లీలో పడిగాపులు కాసిన చంద్రబాబు.. తెలుగు వారి ఆత్మ గౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టాడని మండిపడ్డారు.
‘‘ఎంత మంది కలిసొచ్చినా సీఎం జగన్‌ను ఓడించడం కల.. సీఎం జగన్ 175కి 175కి సాధించడం ఖాయం. జగన్ దెబ్బకు చంద్రబాబుకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది.. పవన్ జన సైనికుల ఆత్మ గౌరవాన్ని లోకేష్ దగ్గర తాకట్టు పెట్టాడు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో వార్ వన్ సైడే’’ అని కేశినేని తేల్చి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment