లోకేష్ భవిష్యత్తుకు లైన్‌క్లియర్..!
పార్లమెంటు వైపు పవన్‌ను నెట్టిన బాబు
టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు కుదిరిన తర్వాత ఒక్క విషయం అయితే క్లియర్‌గా అర్థమైపోతుంది. చంద్రబాబు వేసిన పాచికలో పవన్ కల్యాణ్ ఎటూ కాకుండా ఇరుక్కుపోయాడనే విషయం జనసేనలోనే మాట్లాడుకుంటున్నారు. బీజేపీ పెద్దల వద్దకు పవన్ కల్యాణ్‌ను వెంటబెట్టకుని మరీ వెళ్లిన చంద్రబాబు.. సైలెంట్‌గా తనపని తాను కానిచ్చేశాడు. పవన్‌ను జాగ్రత్తగా పార్లమెంటుకు ఎక్స్‌పోర్ట్ చేసే పనిని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసినట్టున్నాడు.
ఆ విధంగా పార్లమెంటు వైపు.!
జనసేనతో పొత్తు అంటూనే ఆ పార్టీ జెండా పీకేద్దాం అన్న చంద్రబాబు వ్యూహంలో పవన్ పూర్తిగా చిక్కుకున్నాడు. ఒకప్పుడు ముఖ్యమంత్రి అవుతానని గొప్పలకు పోయిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు పార్లమెంటుకు పోటీ చేస్తాడని ఖాయమయిందట. పవన్‌కు ఆ ఆలోచన రావడానికి చంద్రబాబే కారణమట. జాతీయ రాజకీయాల్లోకి వెళితే ఆ మజానే వేరుగా ఉంటుందని పవన్‌కు చంద్రబాబు నూరిపోశాడట. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చేది డౌటు కాబట్టి ఢిల్లీకి వెళ్తే మంచిదని హితబోధ చేశాడట. బీజేపీతో పొత్తు కుదిరిన పక్షంలో ఎంపీగా పోటీ చేస్తే కేంద్ర మంత్రి కూడా అయిపోవచ్చని చంద్రబాబు పదే పదే పవన్‌కు చెప్పాడట. ఇప్పటివరకూ రెండు ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేస్తాడనుకున్న పవన్.. ఇప్పుడు రూటు మార్చి ఎంపీగా బరిలోకి దిగుతున్నాడని తెలిసింది.
లోకేష్‌కు తప్పిన పవన్ భయం..
ఇంతకాలం(టీడీపీ-జనసేన పొత్తు కుదిరిన దగ్గర్నుంచి) పవన్ కళ్యాణ్‌కు ప్రాధాన్యత పెరిగిందని తెలుగుదేశం వర్గాల్లో.. ముఖ్యంగా లోకేష్ వర్గంలో ఆందోళన ఉంది. ఎక్కడ చూసినా చంద్రబాబుకు సమానంగా పవన్ కళ్యాణ్ బొమ్మ కనిపిస్తోందన్నది వీరి ఆందోళన. రేపు పార్టీ నాయకత్వం గానీ, పదవుల్లో గానీ పవన్ నుంచి ముప్పు ఉంటుందన్నది లోకేష్ వర్గం అంచనా. ప్రజల్లో ఎటువంటి ప్రజాదరణ తెచ్చుకోలేకపోయినా.. లోకేష్‌ను ఏదో రకంగా నాయకుడిని చేయాలన్నది చంద్రబాబు తాపత్రయం. పవన్‌ను రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పిస్తే, లోకేష్‌కు లైన్ క్లియర్ చేసినట్లు ఉంటుందని భావించిన చంద్రబాబు.. తన వెన్నుపోటు రాజకీయాలకు మరింత పదునుపెట్టి అసెంబ్లీ వైపు రాకుండా చేసినట్టు అర్థమవుతోంది.
జనసేనతో పొత్తులో భాగంగా పవన్‌తో లోకేష్ సఖ్యతగా ఉంటున్నాడే తప్ప.. అసలు పవన్ అంటే లోకేష్‌కు ఎంతమాత్రం కిట్టదని తెలుగుదేశంలో ప్రచారం ఉంది. ఇటీవల ఒక జాతీయ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్యూలో కూడా పవన్‌కు పదవేంటీ అని లోకేష్ అన్న విషయాలను గుర్తు చేస్తున్నారు. సీఎం అభ్యర్థి ఎవరంటే చంద్రబాబేనని, పవర్ షేరింగ్‌లో పవన్‌కు ఏ అవకాశం ఉండదనే మాట లోకేష్ ఓపెన్‌గానే చెబుతున్నాడు. తెల్ల చొక్కా -నల్ల ప్యాంటు వేసుకుని హాయిగా తిని తిరిగే లోకేష్.. ఇప్పుడు పవన్ ఎంపీకి పోటీ చేస్తే మరింత రిలీఫ్‌గా ఉండే ఛాన్స్ దొరికిందని పార్టీలో అనుకుంటున్నారు. అంతేనా లోకేష్.!
Comments
Please login to add a commentAdd a comment