‘వాలంటీర్ల వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలనేది చంద్రబాబు ప్రయత్నం’ | Perni Nani Slams Chandrababu And Alliance Over Volunteer Issue | Sakshi
Sakshi News home page

‘వాలంటీర్ల వ్యవస్థను విచ్చిన్నం చేయాలనేది చంద్రబాబు ప్రయత్నం’

Published Mon, Apr 1 2024 7:34 PM | Last Updated on Mon, Apr 1 2024 8:29 PM

Perni Nani Slams Chandrababu And Alliance Over Volunteer Issue - Sakshi

ప్రజల నుండి తిరుగుబాటు రాగానే కీచుకీచుమని అరుస్తున్నారు

చంద్రబాబు ఎన్ని కట్రలు పన్నినా పెన్షన్లు పంపిణీని ఆపలేరు

పెత్తందారీ పోకడలకు చంద్రబాబు నిదర్శనం

మంచాల్లో ఉండి నడవలేని వారి ఉసురు పోసుకుంటారు చంద్రబాబు

విలువలు లేని రాజకీయాలు చేసే వ్యక్తి చంద్రబాబు

మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజం

సాక్షి, తాడేపల్లి: ‘వాలంటీర్ల వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలనేది చంద్రబాబు నాయుడు ప్రయత్నమని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. 55 నెలలుగా వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని, ఇంతకాలం జగనే పెన్షన్లు పంపిస్తున్న సంగతి ప్రజలకు తెలీదా? అని ప్రశ్నించారు పేర్ని నాని.

చంద్రబాబు మాట మార్చే నేర్పరి అని, బాబు తన మాటలతో ఎర వేస్తారని.. అవసరం తీరాకా పాతర వేస్తారని దుయ్యబట్టారు. రాజకీయ స్వార్ధం కోసం పెన్షనర్ల పొట్ట కొట్టారని మండిపడ్డారు. వాలంటీర్లు వద్దు అని ఈసీ దగ్గర పైరవీ చేసింది ఎవరని ప్రశ్నించారు. వాటంటీర్లు వద్దని ఈసీకి లెటర్‌ ఇచ్చింది టీడీపీ సానుభూతిపరులు కాదా అని ప్రశ్నించారు.

ఏదైనా చేసి కుర్చీలో కూర్చోవాలనేదే బాబు లక్ష్యం
పురందేశ్వరి, నిమ్మగడ్డ ప్రసాద్‌ ఎవరో జనాలకు తెలీదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషనర్‌గా ఉన్నప్పుడు నిమ్మగడ్డ వేసిన వేషాలు ప్రజలకు తెలుసని అన్నారు. ఆయనకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో  కూడా  తెలుసన్నారు. చంద్రబాబు పేదలను ఓటు బ్యాంక్‌గానే చూశారని, ఆయన కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. 14 ఏళ్లలో చంద్రబాబు పేదలకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఏదైనా చేసి కుర్చీలో కూర్చొని డబ్బులు వెనకేసుకోవాలన్నదే చంద్రబాబు లక్ష్యమని దుయ్యబట్టారు.

మాట మార్చిన బాబు
‘వాలంటరీలు అంటే బాబుకు భయం. 2 నెలలు వాలంటీర్లు లేకపోతే చంద్రబాబు, పవన్‌లు ‌ ఫించన్లు ఇచ్చారని జనం అనుకుంటారా?.  వాలంటీర్లు వద్దని ఢిల్లీ నుంచి మండలం వరకు బాబు తన మనుషులను తిప్పారు.  ప్రజల నుంచి తిరుగుబాటు రావడంతో బాబు మాట మార్చారు.  పెన్షన్ల ​ పంపిణీ ఆపడం ఎవరి వల్ల కాదు. ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వాలన్న ఆలోచన చంద్రబాబుకు ఎప్పుడైనా వచ్చిందా?. వాలంటీర్ల వ్యవస్థ నడుం విరగొడతాం అని ఏలూరులో పవన్‌ అన్నారు

మీడియాతో మాట్లాడుతూ పేర్ని నాని ఏమన్నారంటే..

  • విలువలు లేని రాజకీయాలు చేసే వ్యక్తి చంద్రబాబు
  • గంటకు లక్షల్లో ఫీజులు తీసుకునే‌ లాయర్లను నిమ్మగడ్డ రమేష్ చౌదరి ఎలా నియమించుకున్నారు? 
  • రాష్ట్ర ఎన్నికల కమిషన్ హోదాలో ఉండి అప్పట్లో ఆయన చేసిన కార్యక్రమాలు ప్రజలందరూ చూశారు 
  • 55 నెలలుగా వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు
  • ఇంతకాలం జగనే పెన్షన్లు పంపిస్తున్న సంగతి ప్రజలకు తెలీదా? 
  • చంద్రబాబు తన హయాంలో ఏనాడైనా పేదల ఇంటికి వెళ్ళి పెన్షన్ అందించాలన్న ఆలోచన ఎందుకు రాలేదు? 
  • వాలంటీర్ల వ్యవస్థను విచ్చిన్నం చేయాలని చంద్రబాబు చూస్తున్నారు
  • ప్రజల నుండి తిరుగుబాటు రాగానే కీచుకీచుమని అరుస్తున్నారు
  • చంద్రబాబు ఎన్ని కట్రలు పన్నినా పెన్షన్లు పంపిణీని ఆపలేరు 
  • పెత్తందారీ పోకడలకు చంద్రబాబు నిదర్శనం
  • మంచాల్లో ఉండి నడవలేని వారి ఉసురు పోసుకుంటారు చంద్రబాబు
  • వాలంటీర్ల వ్యవస్థ నడుం విరగ్గొడతాంఅని పవన్ అన్నారు
  • ఒంటరి మహిళలను రెడ్ లైట్ ఏరియాకు వాలంటీర్లు అమ్ముకుంటున్నారని కూడా పవన్ విమర్శించారు
  • ఊళ్లలో వాలంటీర్ల న్యూసెన్స్ అంటూ చంద్రబాబు మాట్లాడారు
  • వాలంటీర్లంటే చంద్రబాబుకు భయం 
  • వెన్నుపోటు పొడిచే రెండు రోజులముందు కూడా చంద్రబాబు తనకు చెప్పులు తొడిగాడని ఎన్టీఆర్ చెప్పారు
  • అంత నమ్మకంగా ఉంటూ ఒక్కసారిగా వెన్నుపోటు పొడిచాడు 
  • మోదీని దూషించి ఇప్పుడు ప్రేమను వ్యక్తం చేస్తున్నారు
  • ముస్లింలకు ఓటు ఉండదనీ, క్రిస్టియన్లు దేశం వదిలిపోతారని చంద్రబాబు విమర్శలు చేశారు
  • ఇప్పుడు మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని పొత్తు పెట్టుకున్నారు? 
  • చంద్రబాబు పెట్టిన జన్మభూమి కమిటీలపై అప్పట్లోనే కోర్టుకు వెళ్లాం 
  • ఆ వ్యవస్థ మంచిది కాదనే స్టాండ్ మీదనే మేము ఉన్నాం 
  • అధికారంలోకి వచ్చాక ఆ కమిటీలను తొలగించి వాలంటీర్ల వ్యవస్థ తెచ్చాం 
  • ఈ వ్యవస్థ మంచిది కాదని, నోటికొచ్చినట్టు మాట్లాడారు 
  • ప్రజల్లో వ్యతిరేకత రాగానే మళ్ళీ వాలంటీర్లపై కపట ప్రేమను చూపిస్తున్నారు
  • నాయీబ్రాహ్మణులను గుళ్లలోకి కూడా రానివ్వమని చంద్రబాబు దూషించారు 
  • చంద్రబాబు చేతిలో ఎన్టీఆర్, హరికృష్ణ లకు జరిగినట్టే త్వరలోనే పవన్ కళ్యాణ్ కు కూడా జరుగుతుంది
  • పిఠాపురంలో దత్తాత్రేయుడు పవన్ కళ్యాణ్ కి ఇప్పుడే గుర్తొచ్చాడా? 
  • పిఠాపురంలో ఆఫీసు కట్టుకోవటానికి ఎవరైనా స్థలం ఇవ్వాలని పవన్ అంటున్నారు
  • ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే జనం నవ్వుతున్నారు 
  • 21 సీట్లు తీసుకుని ఎంతమంది నిజమైన జనసేన నాయకులకు ఇచ్చారో పవన్ చెప్పాలి
  • జెండా మోసిన వారికి టిక్కెట్లు ఏవీ? 
  • ఇంటింటికీ రేషన్ బియ్యం ఇవ్వొద్దని కూడా ఫిర్యాదు చేశారు
  • వీఆర్వో ద్వారా పంపిణీ చేయమని అంటున్నారు
  • వీఆర్వోలు ఎన్నికల విధుల్లో ఉన్నారు
  • వారితో ఇంటింటికీ బియ్యం పంపిణీ ఎలా జరుగుతుంది? 
  • బీజేపీ, టీడీపీ కలిసిపోయాక తనను ఎవరూ పట్టించుకోలేదని పవన్ కళ్యాణ్ బాధ పడుతున్నారు 
  • అందుకే బ్లేడుతో దాడులు చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు
  • లోకేష్ కి ఇచ్చినట్టు తనకు కూడా సెక్యూరిటీ తీసుకోవటానికి ఇలా ఆరోపణలు చేస్తున్నారు
  • నిజంగా దాడులు చేస్తే రామోజీ, రాధాకృష్ణ పేజీలకు పేజీలు వార్తలు రాయరా? 
  • ఖజానా ఖాళీ అయిందని జగన్ సీఎం అయిన తొలిరోజుల్లో టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు
  • ఈనాడులో పెద్ద వార్త కూడా రాశారు
  • ఐనప్పటికీ రూ.2.70 లక్షల కోట్లు ప్రజా సంక్షేమానికి ఖర్చు చేసింది 
  • జగనంటే ఒక నమ్మకం 


చదవండి: ఒక్కరోజు ఎండలకే పవన్ పరార్ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement